»   » హీరోకి ఏడువందల మాస్క్ లు వాడాం

హీరోకి ఏడువందల మాస్క్ లు వాడాం

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Hrithik used over 700 masks for Krrish 3
  ముంబై : కొన్నేళ్ల క్రితం వరకు సూపర్‌ హీరోలను హాలీవుడ్‌ చిత్రాల్లో మాత్రమే చూసిన మనకు.. 'క్రిష్‌' ద్వారా మానవాతీత శక్తులున్న హీరో పాత్రను పరిచయం చేసిన నటుడు హృతిక్‌ రోషన్‌. ఈ చిత్రంలో ఇతరులకు సహాయం చేసే సందర్భాల్లో హీరో ఉనికిని గోప్యంగా ఉంచడానికి ఆయన ముఖానికి ఉపయోగించిన మాస్కు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ చిత్రంలో హృతిక్‌ మాస్కు ఒక సన్నివేశంలో చిరిగిపోయినా అదే మాస్కుతో ఆయన ఆ చిత్రంలోనూ, ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న క్రిష్‌-3లోనూ ప్రేక్షకులను అలరించనున్నారు.

  ఒకే తరహా మాస్క్‌తో హృతిక్‌ చిత్రమంతా కనిపించినా చిత్రీకరణ పూర్తయ్యే సమయానికి దాదాపు ఏడు వందల వరకు మాస్కులను వినియోగించడం విశేషం. హృతిక్‌ ముఖానికి అతికించడానికి ప్రత్యేకంగా జిగురుతో ఈ మాస్కులను రూపొందించారు. ఒక్కో మాస్కు ఖరీదు రూ. ఎనిమిది వేలని చెప్తున్నారు. మాస్క్ తో ఉన్న సన్నివేశాలు సినిమాలో బాగా ఆకట్టుకుంటాయని చెప్తున్నారు.

  చిత్ర నిర్మాత, దర్శకుడు రాకేష్‌ రోశన్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని చాలా వరకు సన్నివేశాలను హైదరాబాదులో (రామోజీ ఫిల్మ్‌సిటీ) చిత్రీకరించామని, అక్కడి వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండటంతో మొదటి చిత్రంకంటే ఈ క్రిష్‌-3లో ఎక్కువ మాస్కులను వినియోగించాల్సి వచ్చిందన్నారు.

  షూటింగ్ సమయంలో మాస్కులపై ఉన్న జిగురు కరిగిపోకుండా ఉండటానికి వీటిని ఒక ప్రత్యేకమైన ఎయిర్‌ కండీషన్డ్‌ వ్యాన్‌లో ఉంచేవారట. క్రిష్‌-3 చిత్ర ప్రచారంలో భాగంగా ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తున్న సన్నివేశాలు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, గ్రాఫిక్స్‌ భారీతనాన్ని చెప్పకనే చెప్తున్నాయి.

  గతంలో రాకేష్ నిర్మించిన 'క్రిష్', 'ధూమ్ 2' తెలుగు,తమిళ భాషల్లో అనువాదం చేయగా హృతిక్‌కు మంచి ఆదరణ లభించింది. బాలీవుడ్‌తో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో కూడా హృతిక్‌కు భారీగా '్ఫ్యన్ ఫాలోయింగ్' ఏర్పడింది. గతంలో తాను నిర్మించిన 'క్రిష్'ను ప్రతి భారతీయుడు ఆస్వాదించాలన్న తపనతో డబ్బింగా చేయించి ఇతర భాషల్లో విడుదల చేయించినట్లు రాకేష్ గుర్తు చేస్తున్నాడు. దక్షిణాది ప్రేక్షకులూ తన సినిమాలను ఆదరించడం ఎంతో ఆనందం కలిగించిందని అంటున్నాడు.


  'క్రిష్ 3'ని అనువాదం చేసి ఎప్పుడు విడుదల చేస్తారని దక్షిణాదికి చెందిన సినీ పంపిణీదారులు తనను పదే పదే అడుగుతున్నారని తెలిపాడు. కన్నడ, మలయాళం కంటే తెలుగు, తమిళ భాషల్లో సినీ పరిశ్రమ బాగా విస్తరించిందని అంటున్నాడు. వాణిజ్యపరమైన కోణంలో ఆలోచించినా అనువాద చిత్రాలకు దక్షిణాదిలో మంచి డిమాండ్ ఉందని రాకేష్ విశే్లషిస్తున్నాడు. 'ఫిల్మ్ క్రాఫ్ట్' పతాకంపై రాకేష్ దర్శక, నిర్మాతగా రూపొందించిన 'క్రిష్ 3' నవంబర్ 1న విడుదల కాబోతోంది.

  English summary
  Hrithik Roshan, who reprises his role as the superhero in 'Krrish 3', has used a lot more masks in his upcoming movie than he did in the last instalment. We're told that the masks were made from a special kind of wax and required a different kind of glue for the actor to stick them on his face. Interestingly, about 600 to 700 such masks were made for the movie - each costing over 8,000 to make — with the actor using at least five a day. There was also a separate air-conditioned van for storing them during the shoot.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more