»   » నాపై లైంగిక దాడి, కిడ్నాప్ వెనుక భారీ కుట్ర.. ఆఫర్ల కోసం రాజీపడను

నాపై లైంగిక దాడి, కిడ్నాప్ వెనుక భారీ కుట్ర.. ఆఫర్ల కోసం రాజీపడను

Written By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు తమిళ హీరోయిన్ భావన కిడ్నాప్ వ్యవహారం ఇటీవల సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ ఘటనను పరిశ్రమలోని అన్ని వర్గాలు ఖండించడమే కాకుండా ఆందోళన వ్యక్తం చేశాయి. తన జీవితంలో చోటుచేసుకొన్న విషాద సమయంలో నిర్మాత నవీన్ ఆమెకు అండగా నిలిచారు. రెండు నెలల క్రితం జరిగిన దారుణ ఘటనపై భావన మీడియాకు వివరణ ఇచ్చింది.

డబ్బు కోసం జరుగలేదు..

డబ్బు కోసం జరుగలేదు..

కిడ్నాప్, వేధింపుల ఘటన కేవలం డబ్బుకోసమే జరిగిందని భావించట్లేదు. దీని భారీ కుట్ర ఉంది. లొకేషన్‌ నుంచి నటీనటులను తీసుకెళ్లే ఓ కారు డ్రైవర్.. ఇంతటి సాహసానికి ఒడిగట్టడం జీర్ణించుకోలేని విషయం అని భావన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇలాంటి దారుణానికి సాహసించిన వారు ఎవరు, ఎందుకు చేశారనే ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేదు అని భావన వెల్లడించింది.

కుట్ర వెనుక..

కుట్ర వెనుక..

ఈ కుట్ర వెనుక ఉన్న వారిని బయటకు లాగేందుకు, వారి నుంచి సమాధానాలు వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాను. అంతేకాకుండా అవకాశాల కోసం రాజీపడను. ఇలాంటి దారుణాలపై మౌనంగా ఉంటే తోటివారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ఈ ఘటనపై మౌనం వహించే ప్రసక్తి లేదు అని భావన చెప్పుకొచ్చారు.

విచారణ జరుగుతున్నది...

విచారణ జరుగుతున్నది...

ఈ కేసులో పోలీసులు ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. త్వరలోనే దర్యాప్తు వివరాలు బయటకు వస్తాయి. అప్పుడు నిందితులు ఎవరో, ఎందుకు చేశారో, ఈ ఘటన వెనుక ఎవరి హస్తం ఉంది. ఏం ఆశించి చేశారో అనే ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ఒకవేళ కేసు తప్పదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే పోరాటం తప్పదని హెచ్చరించింది.

కన్నడ నిర్మాతతో నిశ్చితార్థం

కన్నడ నిర్మాతతో నిశ్చితార్థం

ఈ విషాద సమయంలో తోడుగా ఉన్న కన్నడ నిర్మాత నవీన్‌తో భావన నిశ్చితార్థం జరిగింది. ఈ వేసవిలో వీరిద్దరి వివాహం జరుగనున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 17 రాత్రి భావన కిడ్నాప్ జరిగింది. కారులో రెండు గంటలపాటు తిప్పుతూ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె డ్రైవర్ మార్టిన్, మాజీ డ్రైవర్ సునీల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కఠినంగా శిక్షిస్తాం.

కఠినంగా శిక్షిస్తాం.

ప్రాథమిక దర్యాప్తులో శుక్రవారం (17వ తేదీ) ఒక్కరోజే ఇద్దరి మధ్య 40 సార్లు ఫోన్ సంభాషణలు జరిగాయి. ఆమె ఎక్కడకు వెళ్లేది, ఎప్పుడు వెళ్లేది మెసేజ్‌ల రూపంలోనూ చర్చించుకున్నారని విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేరళ సీఎం వెంటనే స్పందించారు. ఈ కేసులో నిందితులెవరినీ వదిలిపెట్టబోమని, వారిని శిక్షిస్తామని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రకటించారు.

English summary
Actress Bhavana revealed in an interview that she has enemies in the film industry. Things which I thought would never happen to me, happened. I'm grateful to all who helped through it with their prayers and support.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu