»   » పైసా వసూల్ కావటం లేదు: బయ్యర్లకు నష్టాలు తప్పట్లేదు.

పైసా వసూల్ కావటం లేదు: బయ్యర్లకు నష్టాలు తప్పట్లేదు.

Posted By:
Subscribe to Filmibeat Telugu
Paisa Vasool Collections Hinting Towards Its Box Office Failure |

నందమూరి నటసింహం బాలకృష్ణ - పూరీ కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్ రిలీజ్ అయ్యి అభిమానుల,ప్రేక్షకుల ఆదర అభిమానాల్ని అందుకుంటూ అన్ని వర్గాల నుండి మంచి టాక్ ని తెచ్చుకుంది.కానీ సినిమా సెకండ్ ఆఫ్ ఫ్లాప్ టాక్ రావడం తో బాక్సాఫీసు ని షేక్ చేయలేక పోయింది.

సినిమా డల్ అయ్యింది

సినిమా డల్ అయ్యింది

పైసా వసూల్ ని పూరి జగన్నాధ్ ఈ సినిమాని ఇలా తీశాడు ఏంటి, సినిమాలో బాలయ్య గెటప్ తప్ప ఏమీ లేదు..ఇలా ఒకటేమిటి చాలా రకాల టాక్ లు గుప్పుమన్నాయి..మొదటి రోజు కలెక్షన్స్ అదరగొట్టినా..రెండో రోజుకి సినిమా డల్ అయ్యింది. నెమ్మది నెమ్మదిగా కిందకి జారిపోయింది.... లాభాలు పక్కన పెట్టి బయ్యర్లకు నష్టాలనే మిగిల్చిందనే టాక్ వినిపిస్తోంది...

అంచనాల్ని తలకిందులు చేసింది

అంచనాల్ని తలకిందులు చేసింది

పెట్టుబడి తక్కువ కావడంతో ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని రూ.32.5 కోట్లకే అమ్మారు. కాబట్టి ఫస్ట్ వీకెండ్లో జోరు చూపించినా చాలా వరకు పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందనే అనుకున్నారు. కానీ ‘పైసా వసూల్' అంచనాల్ని తలకిందులు చేసింది. తొలి వారాంతంలో ఆశించిన వసూళ్లు రాబట్టలేదు. వారం రోజుల్లో కలిపి ఈ సినిమా కేవలం రూ.17.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది.


పైసా వసూల్

పైసా వసూల్

ఫస్ట్ వీకెండ్ అవ్వగానే బాగా డల్లయిపోయింది ‘పైసా వసూల్'. వీక్ డేస్‌లో నామమాత్రంగా వచ్చాయి వసూళ్లు. మళ్లీ వీకెండ్ వచ్చాక కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా కనిపించట్లేదు. ఫుల్ రన్లో రూ.20 కోట్ల షేర్ మార్కును దాటితే ఎక్కువ అన్నట్లుంది. కనీసం పది కోట్ల వరకైనా బయ్యర్లకు బ్యాండ్ పడటం ఖాయం. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లకు నష్టాలు తప్పట్లేదు.


బయ్యర్లకు నష్టాలు తప్పట్లేదు

బయ్యర్లకు నష్టాలు తప్పట్లేదు

నైజాం హక్కుల్ని కొంచెం తక్కువకే రూ.8 కోట్లకు అమ్మితే.. ఇప్పటిదాకా రూ.3.8 కోట్ల షేరే వచ్చింది. 3 కోట్ల దాకా నష్టం తప్పేలా లేదు. బాలయ్యకు పట్టున్న సీడెడ్ ఏరియా హక్కుల్ని రూ.6 కోట్లకు అమ్మితే అక్కడ వసూలైంది రూ.3.55 కోట్లు. అక్కడా నష్టాలే. వైజాగ్ హక్కుల్ని రూ.3 కోట్లకు కొంటే ఇప్పటిదాకా రూ.1.55 కోట్లే వచ్చాయి. ఇలా ప్రతి ఏరియాలోనూ బయ్యర్లకు నష్టాలు తప్పట్లేదు.English summary
With each passing day, the film Paisa vasool collection is hinting towards its box office failure.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu