For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెక్స్ అడిక్ట్! టాలీవుడ్లోనూ అంతే: తేల్చి చెప్పిన అవసరాల శ్రీనివాస్

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: 'అష్టాచమ్మా' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు అవసరాల శ్రీనివాస్. తర్వాత 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర చేయడం ద్వారా అటు నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

  అటు దర్శకుడిగా సినిమాలు చేస్తూ... అప్పుడప్పుడు నటుడిగానే తన సత్తా చాటుకుంటున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించే అవసరాల శ్రీనివాస్... ఇటీవల విడుదలైన 'జెంటిల్‌మన్' సినిమాలో విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు.

  నటుడిగా కేవలం ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా తనలోని వివిధ షేడ్స్ ను ప్రదర్శించి టాలెంటు నిరూపించుకోవాలని ఉవ్విల్లూరుతున్న అవసరాల.... ఈ సారి అడల్ట్ కామెడీ సినిమాను ఎంచుకోవడం హాట్ టాపిక్ అయింది.

  ఆ మధ్య హిందీలో 'హంటర్' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ సినిమాలో అవసరాల హీరో పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హీరో పాత్ర సెక్స్‌కు అడిక్ట్ అయినట్లుగా ఉంటుంది.

  హీరో పాత్ర తీరు తెన్నుల పరిశీలిస్తే... పదిహేనేళ్ల కుర్రాడిగా ఉన్నప్పటి నుండే విపరీతమైన సెక్స్ కోరికలు ఉండే ఆ కుర్రాడు సెక్స్ సినిమాలు చూస్తూ పోలీసులకు దొరికిపోతాడు. ఇక కాలేజీ రోజుల్లోకి వచ్చాక అమ్మాయితో ఎఫైర్, తర్వాత పెళ్లైన ఆంటీతో ఎఫైర్...ఇలా సాగుతుంటుంది. మనికి ఆకలి, నిద్ర ఎలాగో సెక్స్ కూడా అవసరమే....అది ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్ అంటూ తన స్నేహితులతో వాదించే క్యారెక్టర్. ఇక ఇవన్నీ వదిలేసి పెళ్లి చేసుకోవాలని అనుకున్న అతడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా.

  అయితే హిందీలో ఈ సినిమాను చాలా బోల్డ్‌గా, ఎమోషనల్‌గా తెరకెక్కించారు. అయితే తెలుగులోనూ అలా తీయడం సాధ్యం అవుతుందా? ఇక్కడ పరిస్థితులు అందుకు అనుకూలియాస్తాయా? అనే అనుమానం ఉండేది. దీనిపై తాజాగా అవసరాల శ్రీనివాస్ స్పందించారు. ఆయన చెప్పిన విషయాలు స్లైడ్ షోలో....

  బోల్డ్, ఎమెషనల్

  బోల్డ్, ఎమెషనల్

  హిందీలో ఈ సినిమా ఫస్టాఫ్ బోల్డ్ గా సాగుతుంది, సెకండాఫ్ ఎమోషనల్ గా సాగుతుందని అవసరాల శ్రీనివాస్ తెలిపారు.

  టాలీవుడ్లోనూ అంతే..

  టాలీవుడ్లోనూ అంతే..

  బాలీవుడ్లో ఈ సినిమా ఎలా ఉంటుందో.. టాలీవుడ్లోనూ అంతే బోల్డుగా, ఎమోషనల్ గా తీస్తామని తెలిపారు అవసరాల శ్రీనివాస్.

  అడల్ట్ కామెడీ అయినా లోతైన మీనింగ్..

  అడల్ట్ కామెడీ అయినా లోతైన మీనింగ్..

  అడల్ట్ కామెడీ అనగానే అంతా ఏదో ఊహించుకుంటారు.. కానీ ఈ సినిమాలో చాలా లోతైన మీనింగ్ ఉంటుంది అన్నారు అవసరాల శ్రీనివాస్?

  సెక్స్ అడిక్ట్

  సెక్స్ అడిక్ట్

  హిందీలో గుల్షన్ దేవయ్య పొషించిన సెక్స్ అడిక్ట్ రోల్ తెలుగులో అవసరాల శ్రీనివాస్ చేయబోతున్నారు.

  దర్శకుడు

  దర్శకుడు

  నవీన్ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

  అఫీషియల్ గా సైన్ చేయలేదు

  అఫీషియల్ గా సైన్ చేయలేదు

  నేను ఇంకా అఫీషియల్ గా సైన్ చేయాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో ఇది ఫైనలైజ్ అవుతుందని తెలిపారు శ్రీనివాస్.

  షూటింగ్ మొదలైంది

  షూటింగ్ మొదలైంది

  సినిమాలో హీరో చైల్డ్ హుడ్ పోర్షన్ షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. చిత్రీకరణ జరుపుకుంటోంది.

  ఆగస్టులో..

  ఆగస్టులో..

  ఆగస్టులో నేను షూటింగులో జాయిన్ అవుతాను. హీరోయిన్లు కూడా ఇంకా ఫైనల్ కావాలి అన్నారు.

  రెజీనా, తనికెళ్ల భరణి

  రెజీనా, తనికెళ్ల భరణి

  ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రలో రెజీనా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. తనికెళ్ల భరణి కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

  తెలుగు ప్రేక్షకులు యాక్ట్సెప్ట్ చేస్తారా?

  తెలుగు ప్రేక్షకులు యాక్ట్సెప్ట్ చేస్తారా?

  ఇలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ... ఏమో తెలియదు, నేను ఈ పాత్ర చేయగలను అని మాత్రమే ఆలోచించాను. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు అన్నారు.

  English summary
  Actor-filmmaker Srinivas Avasarala, who will play the lead in the yet-untitled Telugu remake of Hindi adult comedy "Hunterrr", says the upcoming project will be a bold yet emotional film. "The second half of the film is so emotional, I was moved by it. People assume it's an adult comedy but the story and the character has a deeper meaning to it. The remake will be bold, but at the same time equally emotional," Srinivas told IANS.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X