»   » రంభకి కోర్టు నోటీసులు.., తక్షణమే కోర్టుకు రావాలంటూ.., పద్మాలయా స్టుడియో లో ఉండగానే, పోలీసులు...

రంభకి కోర్టు నోటీసులు.., తక్షణమే కోర్టుకు రావాలంటూ.., పద్మాలయా స్టుడియో లో ఉండగానే, పోలీసులు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

భర్తతో కలిసి జీవించేలా ఆదేశించాలని కోరుతూ కోర్టు ఆశ్రయించిన సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట. దీంతో ఆమెకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. తన వదిన పల్లవిని వేధింపులకు గురి చేసిన కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ బంజారాహిల్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. నిన్నటి తరం నటి రంభ తానూ లైమ్ లైట్ లో ఉన్నప్పుడు కుర్రకారు గుండెల్లో నిద్రలేకుండా చేసింది. దాదాపు పది సంవత్సరాలపాటు ఇటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

2010 లో కెనడాకు చెందిన ఇంద్రన్ పద్మనాభన్ అనే వ్యాపారవేత్తను రంభ పెళ్లి చేసుకుంది..వీరికి పిల్లలు అయినా తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి..ఇంద్రన్‌కు 2003లోనే దుశ్యంతి సెల్వవినాయకమ్ అనే యువతితో పెళ్లయిందని, ఆ విషయం దాచిపెట్టి తనను పెళ్లిచేసుకున్నాడని రంభ ఆరోపిస్తోంది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు బాగా ఎక్కువయ్యాయి.

Hyderabad court issue notice to hot actress rambha

ఈ నేపథ్యం లో మైనర్ పిల్లలు తన దగ్గరే ఉంచాలని రంభ కోర్ట్ లో దాఖలాలు చేసింది..కోర్టు తదుపరి విచారణను 2017 జనవరి 21కి వాయిదా వేసింది. మరి అప్పుడు విచారణ జరిపి పిల్లలు రంభ కు ఇస్తారో లేక ఇంద్రన్ కు ఇస్తారో చూడాలి. అయితే ఇదంతా ఒక పార్శ్వం అయితే తనభరతనుంచి వేదిపంపులు అని చెప్పిన రమంభ మాత్రం తన సోదరుడి భార్యని వేదించిన కేసులో మాత్రం కోర్టు కేసుని ఎదుర్కోవటం.

సినీ నటి రంభకు ఊహించని పరిణామం ఎదురైంది. పద్మాలయ స్టూడియోలో ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న వేళ.. ఆ షో షూటింగ్ జరుగుతున్న వేళ.. ఆమెను పోలీసులు కలిశారు. వరకట్న వేధింపుల కేసులో కోర్టుకు హాజరు కాని వైనాన్ని ఆమె దృష్టికి తీసుకొచ్చిన బంజారాహిల్స్ పోలీసులు.. తక్షణమే కోర్టుకు హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు జారీ చేశారు.

సినీ నటి రంభ సోదరుడు శ్రీనివాసరావు వివాహం 1999లో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2లో నివసించే పల్లవితో జరిగింది. అయితే.. పెళ్లి జరిగిన 15 ఏళ్ల తర్వాత అత్తింటి నుంచివేధింపులు మొదలైనట్లుగా పల్లవి.. 2014లో నాంపల్లిలోని మూడవ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇందులో భర్త.. అత్తమామలు.. ఆడపడుచు రంభపైనా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో 2014 జులై 21న బంజారాహిల్స్ పోలీసులు రంభతో పాటు భర్త.. అత్తమామలపైనా కేసు నమోదు చేశారు.

అయితే.. అప్పట్లో అమెరికాలో ఉన్న రంభకు సమన్లు జారీ చేయటానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని చెబుతున్నారు. తాజాగా ఒక ఛానల్ నిర్వహించే డ్యాన్స్ షో కోసం హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుసుకున్న పోలీసులు.. షూటింగ్ జరుగుతున్న పద్మాలయ స్టూడియోస్ కు వెళ్లి.. రంభకు కోర్టు సమన్లు జారీ చేసి వచ్చారు. మరి.. నాంపల్లి కోర్టు మెట్లను ఆమె ఎక్కనుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

English summary
Hyderabad Court issued Sumens To Ramba on thiss Case Yester Day at Padmalaya Studios.. For dowry harassment case
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu