For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కమేడియన్ వర్సెస్ క్రిటిక్: కత్తి మహేష్ V/S హైపర్ ఆది మధ్య ఫోన్ టాక్

  |

  జబర్దస్థ్ షో లో హైపర్ ఆది చేసే స్కిట్ లకి కాస్త ఫాలోయింగ్ ఎక్కువే, దాదాపు వాట్సాప్, ఫేస్బుక్లలో వచ్చే జోకులనే కాపీకొట్టి "పంచ్" లుగా వాడే ఆదీ స్కిట్స్‌లో గతం లోనే రామ్‌గోపాల్ వర్మ మీద కూడా సెటైర్లు వేసాడు... రాత్రి బోరుకొడితే ఓడ్కా బాటిల్ ఓపెన్ చేసి ట్విట్టర్ ఓపెన్ చేస్తాడంటూ ఇన్‌డైరెక్ట్ గా రామ్‌గోపాల్ వర్మ మీద వేసిన సెటైర్లకే ఆది మీద కొంత వ్యతిరేకత వచ్చింది జనాల్లో. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ దగ్గర్నుంచీ మహేష్ కత్తి ఎదుర్కుంటున్న సమస్యలు మనందరికీ తెలిసినవే అదే సమయం లో హైపర్ ఆది కూడా మహేష్ కత్తిని టార్గెట్ చేస్తూ ఒక స్కిట్ వేసాడు. గతంలోనూ హైపర్ ఆది చేసిన స్కిట్‌లు కత్తి మహేశ్‌పై పంచ్‌లు వేసేలా ఉన్నాయి. ఇలా ఒక సిద్దాంత పరంగా జరుగుతున్న ఇష్యూ కాస్తా వ్యక్తిగతంగా టార్గెట్ చేసెంత వరకూ తీసుకు వెళ్ళాడు ఆది. ఇక ఆదికీ కత్తిమహేష్ కీ మధ్య జరుగుతున్న వివాదాన్ని ఒక టీవీ చానల్ లైవ్ షోతో మరింత పెంచేసింది. ఆ షోలో ఆది-కత్తి మహేష్ ఇలా మాట్లాడుకున్నారు...

  మారండ్రా నాయనా ! వైరల్ అవుతున్న కత్తి మహేష్ పోస్ట్
   మనుషులుగా మాకు ద్వేషాలు లేవు

  మనుషులుగా మాకు ద్వేషాలు లేవు

  కత్తి: హైపర్ ఆదిని లండన్‌బాబు షూట్‌లో కలిశాను మనుషులుగా మాకు ద్వేషాలు లేవు. సిద్ధాంతంపరంగా ఎవరి ఉద్దేశాలు వారికి ఉన్నాయి. హైపర్ ఆది చేసే కొన్ని కామెడీ స్కిట్లు కొన్ని విషయాలు నాకు నచ్చవు. నన్ను టార్గెట్ చేశారు అనుకున్న వాటిల్లో ఆ విషయం కూడా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. మనుషులతో నాకెందుకు విభేదం.

  ఆది: మేమూ మేమూ బాగుంటాం. విభేదాలు ఉంటాయి. మధ్యలో ఫ్యాన్సే వెధవలు అన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే నేను కూడా ఫ్యానే కాదా..?. కత్తి మహేశ్ ఎవర్ని అన్నట్టు. నాతోనే ఫొటో దిగి నన్నే వెధవ అని అంటారా..?.

   మీరన్న దాంట్లో మీనింగ్ అదే కాదా..?

  మీరన్న దాంట్లో మీనింగ్ అదే కాదా..?

  కత్తి: నేను విమ్మల్ని కాదు అన్నది.

  ఆది: కాదండి మీరన్న దాంట్లో మీనింగ్ అదే కదా..?. మేమూ మేమూ బాగానే ఉంటాం. మధ్యలో ఫ్యాన్సే పిచ్చి వెధవలు అంటే.. నేను కూడా ఒక ఫ్యానే. నేను ఒక సెలబ్రిటీ హోదాకు వచ్చానని అనుకోవడం లేదు. కళాకారులందరికీ నేను ఫ్యాన్‌నే. మీరు సెలబ్రిటీ అని ఫీలయి, ఫ్యాన్స్‌ని వెధవలు అంటున్నారేమో...?. నేను ఒకటి చెబుతాను వినండి.

   పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టే

  పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టే

  కత్తి: మీరు ఎవరికి అభిమానో ముందు చెప్పండి.


  ఆది: ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్‌ను నేను. సినిమాలపరంగా అందరి హీరోలకి అభిమానిని.

  కత్తి: మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టే నన్ను టార్గెట్ చేస్తున్నారా..? కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా నన్ను కామెడీలు చేస్తూ మీ షోలో వాడుకుంటున్నారా..?.

  ఆది: ఫ్యాన్‌ని వెధవలు అనే వాడు కక్ష సాధిస్తున్నట్టా..?. నువ్వు నాతో వచ్చి ఫొటో దిగినప్పుడు కక్ష సాధింపు అని అనిపించలేదా..?

  కన్నింగ్ ఆలోచన ఏముంది..?.

  కన్నింగ్ ఆలోచన ఏముంది..?.

  కత్తి : అక్కడ పక్కనున్న వాళ్లు ఫొటో దిగుదామంటే సరే అన్నాను.


  హైపర్ ఆది: ఆ ఫొటోని నువ్వు ఇలా యూజ్ చేసుకున్నావంటే ఏ కక్ష సాధింపు అనుకోవాలి..?. ఎంత కన్నింగ్ ఆలోచన నీది.

  కత్తి: ఏంటి అందులో కన్నింగ్ ఆలోచన ఏముంది..?.

  ఆది: ఫ్యాన్‌ని తిట్టేందుకు ఆ ఫొటోని వాడుకున్నావంటే ఎంత కన్నింగ్‌గా ఆలోచించి ఉంటావు..?

   ఫొటోలో ఫ్యాన్స్ అనే పదం వాడారు

  ఫొటోలో ఫ్యాన్స్ అనే పదం వాడారు

  కత్తి : నీకూ, నాకు వ్యక్తిగత ద్వేషం ఉందా..? లేదా ఇప్పుడు నిజంగా ఉందా అని ఒప్పుకుంటున్నావా...?.

  ఆది: వ్యక్తిగత ద్వేషం లేదు. మీరు వాడిన ఫొటోలో ఫ్యాన్స్ అనే పదం వాడారు. నేను కూడా ఒక ఫ్యాన్ అని చెబుతున్నా.. అర్ధమైందా మీకు.

  కత్తి : నేను మిమ్మల్ని తిట్టడాన్ని, నన్ను మీరు తిట్టడాన్ని ఎవరైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నేను వాళ్లను వెధవలు అంటున్నాను. మీరు వెధవ కాదు కదా..? మరి ఎందుకు ఫీలవుతున్నారు.

  ఆది: ఫ్యాన్స్ అనే పదం కింద మీరు వెధవ అన్నారు. వాళ్లు లేకపోతే మీరు రివ్యూ రాయడానికి కూడా పనికిరారు. వాళ్లు తప్పు, ఒప్పు అని చెబితేనే రివ్యూ రాయగలుగుతున్నారు.

   మీ దేవుడ్ని మీరు ఏమైనా చేసుకోండి.

  మీ దేవుడ్ని మీరు ఏమైనా చేసుకోండి.

  కత్తి: మూర్ఖంగా ఫ్యాన్స్ నాకు అక్కరలేదు. మనుషులు కావాలి.


  హైపర్: కొంతమంది వద్దనేవారు ఉంటారు. రైట్ అనే వాళ్లు ఉంటారు. ఈ రైటు రాంగ్ ప్రాసెస్‌లోనే నువ్వు రివ్యూ రాస్తావ్. అర్ధమవుతుందా నీకు. నువ్వు చేసే పనులకు మూర్ఖపు ఫ్యాన్స్ తయారువుతున్నారు గానీ, ఇంక వేరే ఉద్దేశమేమీ లేదు. నువ్వు పెట్టిన సెకండ్ పోస్టు చదువు. దేవుడైతే మీరు పొర్లు దండాలు పెట్టుకోండి. అంగ ప్రదక్షిణలు చేసుకోండి అనే పదాన్ని ఒక మగాడిగా చదవలేకపోతున్నానంటే ఒక్క సారి మీరే చదవండి.

  కత్తి: నేను చెబుతున్నాగా... నా వరకూ రాకండి అని అంటున్నాను. మీ దేవుడ్ని మీరు ఏమైనా చేసుకోండి.

  ఆది: అంటే మీరు చేస్తే వ్యాపారం. మేము చేస్తే వ్యభిచారమా..? ఇదే తప్పు. ఒక్కసారి ఆ పోస్టు గనుక కరెక్టుగా చదివితే ఆ హీరో ఫ్యాన్స్ కాదు. ప్రతీ హీరో ఫ్యాన్స్ కొడతారు. ఫ్యాన్స్ అనే పదం ప్రతీ హీరోకి వర్తిస్తుంది.

  కత్తి: ఉన్నాదులు ఎవరి ఫ్యాన్స్ అయినా వెధువలే. ఇప్పటికీ అదే చెబుతున్నా.

  ఆది: మీరు రాసిన సెకండ్ పోస్టులో అవేమి పదాలు. అలా రాస్తారా..?

   ఫ్యాన్స్ గౌరవంగా కొడతారు

  ఫ్యాన్స్ గౌరవంగా కొడతారు

  కత్తి: అది చాలా గౌరవమైన పదాలు, సభ్యతగల పదాలు. మీరే వేరేలా అర్ధం చేసుకుంటున్నారు.


  హైపర్: గౌరవంగా చెప్పి ఉంటావ్.. ఫ్యాన్స్ గౌరవంగా కొడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకో. చాలా గౌరవంగా కొడతారు. ఇప్పుడే కత్తి మహేశ్ గారు క్యూట్ బాయ్ అని చెప్పా. ఆ ఫేస్‌కు ఏమన్నా అయితే నాకు నచ్చదు.

   చెప్పుకొని బతికిపోవడమే

  చెప్పుకొని బతికిపోవడమే

  కత్తి: ఇప్పుడు నువ్వు బెదిరింపులు చేస్తున్నావ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అంతే. గూండాలు, రౌడీలు, ఊరమాసులు. ఉన్మాదులు, ఒకర్ని కొట్టడానికి. నరకడానికి తయారై ఉన్నారు.


  ఆది: ఇలా చెప్పుకొని బతికిపోవడమే. పవన్ కళ్యాణ్, హైపర్ ఆది, లేకపోతే ఇంకో హీరో పేరు చెప్పుకొని ప్రతి రోజు పబ్బం గడుపుకుంటూ ఉండు.

  కత్తి: పవన్ కళ్యాణ్ మీకు దేవుడై ఉండొచ్చు. నాకు కాదు. పవన్ కళ్యాణ్ అనే అతనికీ, నాకు, నా జీవితం అసలు ఇంపార్టెంట్ కాదు.

  ఆది: నువ్వు ఎవరివయ్యా..... నీకు ఇంపార్టెంట్ ఇవ్వడానికి. పవన్ కొన్ని కొట్ల మందికి ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ ఇష్యూ రాకముందు నువ్వు ఎవరు..? చెప్పు.. కత్తి మహేశ్ అనే వాడు ఎవరికి తెలుసు.

   యూట్యూబ్‌లో కూర్చుందాం రా

  యూట్యూబ్‌లో కూర్చుందాం రా

  కత్తి: అందుకనే మీరు పూజించుకోండి. నా గురించి ఎందుకు చెబుతున్నారు. నువ్వు మాత్రం ఎవరికి తెలుసు..?.


  ఆది: యూట్యూబ్‌లో కూర్చుందాం రా... నేను ఎవరో తెలుస్తుంది. నువ్వేదో సినిమాలకు రివ్యూలు రాస్తున్నావ్ కదా.. సినిమాలు బాగా తీస్తారని రెండు సినిమాలు నీ చేతిలో పెట్టారు కాదా అవి చేస్కో..

  కత్తి: అందుకనేనా పెసరట్టు సినిమా గురించి భలే కామెంట్స్ చేశావ్.

  ఆది: పెసరట్టు, ఇడ్లీ మావూరోడు. సుత్తి రాజేశ్ గాడు. వాడికి ఏమీ చేయడం రాదు. నువ్వు పెసరట్టు అనే సినిమా తీశావ్.. సుత్తి రాజేశ్ గాడికి ఆ ఐటెమ్ చేయడం రాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై కక్ష పెట్టుకున్నావ్. నిన్ను పట్టించుకునే వాడేలేదు. నేను చెబుతున్నా కదా...?. కత్తి మహేశ్‌కి పొట్ట, బట్ట ఉందని నేను అనుకోవడంలేదు. ఆయన ఎందుకలా ఫీలవుతున్నారు. నేను అన్నది సుత్తి రాజేశ్ గాడిని. ఆయన వేరే, కత్తి మహేశ్ వేరే.

   ఈ కామెడీలే నాకు నచ్చవ్

  ఈ కామెడీలే నాకు నచ్చవ్

  కత్తి: ఇప్పుడు చూశారా.. ఆయన చెప్పిన అబద్ధాలన్నీ ఆయనే బయట పెట్టుకున్నాడు కదా..?. తెలుగు జర్నలిజంలో ఆన్ ది ఫేస్ కెమెరా ముందుకు వచ్చి రివ్యూలు రాసేది నేనే.


  ఆది: ఇదే.. ఈ కామెడీలే నాకు నచ్చవ్. జబర్దస్త్ కంటే మించిన కామెడీలు చేస్తున్నావ్.. ఇంత కామెడీ చేసేవాడివి జబర్దస్త్‌కు రావచ్చు కదా.. ఎందుకు ఇందంతా.

  కత్తి: కామెడీ నీ వంతు. నేను ఫీలవడంలేదు.. ఎలా ఫీలవుతాను..?

  ఆది: ఒకే ఒక విషయం అడుగుతా చెబుతారా..? ఇప్పుడు మీరు ఆర్టిస్టుగా బాగా చేస్తారు. నా స్కిట్‌లో క్యారెక్టర్ చేయమంటే చేస్తారా..? ఏ విధమైన విభేదాలు లేకుండా..?

  కత్తి: నేను డైరెక్టర్‌ని, ఆర్టిస్టుగా ప్రెండ్స్ కోసం చేస్తా...
  ఆది: అయితే నా కోసం చేయండి. మేమూ మేమూ ఒకటే అన్నారు కదా..?

   కాల్ చేస్తా.

  కాల్ చేస్తా.

  కత్తి:ఫ్రెండ్‌గా అయితే వస్తా. పవన్ కళ్యాణ్ ఫ్యానుని నేను. బెదిరింపు చర్యలకు పాల్పడతా..? నీ ఫేస్ ఏమవుతుందో చూసుకో అని కాకుండా నీ ఫ్రెండ్‌గా పిలిస్తే వస్తా.


  ఆది: నీ కోసం మంచి క్యారెక్టర్‌ని సృష్టిస్తా. సరదాగా చేసుకుంటూ వెళ్దాం. కాల్ చేస్తా.

  కత్తి: నేను పోస్టులు చేసే వాటిలో ఎదుటివారిని రెచ్చగొట్టే కామెంట్స్ ఏమీ ఉండవు. ఇప్పటికీ నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి రోజుకు 300 నుంచి 800 కాల్స్ వస్తున్నాయ్. మాట్లాడితే పచ్చి బూతులు. వాటిలో నాకు సబ్‌స్ర్కైబ్ చేసివి హైపర్ ఆది జోకులు. వాటి మెయిల్స్. అంటే వాటి ఉద్దేశమేంటంటే హైపర్ ఆది నన్ను టార్గెట్ చేసేస్తున్నాడు. దాంతో ఆనంద పడిపోతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

  హైపర్: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది ఒక్కటే ఆనందం. వాళ్లకు కుటుంబం ఉండదు. నీదొక్కటే ఆనందం వారికి.

   నీ జీవనాధారమేంటో చెప్పు

  నీ జీవనాధారమేంటో చెప్పు

  కత్తి: ఈ మధ్య పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి రెండే రెండు తెలుసు. ఒకటి పవన్‌ని దేవుడు అనడం, రెండోది నాకు ఫోన్ చేసి తిట్టడం.


  ఆది: నీ జీవనాధారమేంటో చెప్పు. వాళ్ల జీవనాధారం పక్కన పెట్టు. నీదేంటి ఆ పేరు చెప్పుకొనే కదా రోజూ టీవీలు, స్టూడియోల దగ్గరకు తిరుగున్నావు.

  కత్తి: ఇప్పుడు జీవనాధారాలు గురించి మాట్లాడొద్దు.. నా జీవనాధారమేంటో నీకు తెలియదా. నేను క్రిటిక్, రివ్యూలు చేస్తాను.

  ఆది: ఇదే మళ్లీ కామెడీలు చేస్తున్నారు. ఇలాంటి కామెడీలు నచ్చవని 100సార్లు చెప్పా. మళ్లీ అదే కామెడీ చేస్తున్నారు మీరు.

  కత్తి: అది నా ప్రొఫెషన్ నువ్వు గేలీ చేసి దాన్ని కామెడీ అంటే ఎలా..?

  ఆది: నేను చేసేది ప్రొఫిషన్ కాదా...మరి నాది ఏంటిది..?. నువ్వు ప్రొఫిషన్‌ని గౌరవించే వ్యక్తి అయితే ఆ పోస్టును ఒక్కసారి చదువు. మళ్లీ మళ్లీ చదువుకో. నిన్ను ఎంతమంది గౌరవిస్తారో, ఎంతమంది ఏం చేస్తారో, చూస్తాను.

  పెద్ద పూజారివి కదా

  పెద్ద పూజారివి కదా

  కత్తి: నీ లాంటి ఫ్యాన్స్ వల్ల మొత్తం పవన్ కళ్యాణ్‌కే చాలా చెడ్డ పేరు వస్తోంది. దాంట్లో ఇదో భాగం అంతే..


  ఆది: నిన్ను పట్టించుకునే వాడే ఉండదు.

  కత్తి: అలా అయితే ఎందుకిన్ని స్కిట్లు, ఎందుకింత టార్గెట్లు.

  ఆది: సుత్తి రాజేశ్ మా ఊరిలో మంచి నాటు. ఆయన గురించే చేస్తున్నా.

  కత్తి: మీ దేవుడికి నువ్వు పెద్ద పూజారివి కదా.. మీ ఫ్యాన్స్‌కి చెప్పు కత్తి మహేశ్‌కి ఫోన్ చేయొద్దని.

  ఆది: నీకు ఎవరెవరో ఫ్యాన్స్. అందుకే రోజుకి అన్ని కాల్స్ వస్తున్నాయి. వాళ్లందరూ పవన్ ఫ్యాన్సే అని ఎందుకు అనుకుంటున్నారు. మీ వాదన ఎవరికీ నచ్చట్లేదేమో.. మామూలుగా ఊళ్లల్లో పనులు చేసుకునే వాళ్లు కూడా ఫోన్లు చేస్తున్నారేమో..

   ఎవరికి నచ్చడం లేదేమో

  ఎవరికి నచ్చడం లేదేమో

  కత్తి: అంత సిగ్గుమాలిన ఫ్యాన్సా..? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్లు. ఆయనకు మంచి ఫ్యాన్సు లేరా..


  ఆది: మీరు చెప్పిన వాదన అసలు ఎవరికి నచ్చడం లేదేమో.. ఎవరుబడితే వాళ్లు చేస్తున్నారనుకుంటున్నావ్.

   నువ్వు చెప్పొచ్చుగా

  నువ్వు చెప్పొచ్చుగా

  కత్తి: అదే ముక్క నువ్వు స్కిట్లో పెట్టావ్ గానీ. ఆది నువ్వు చెప్పొచ్చుగా.. ఓ మాట కత్తి మహేశ్ గాడు సుత్తిగాడు, ఆయన మాటల్ని పట్టించుకోవద్దు. అతనికి ఫోన్లు చేయొద్దని.


  ఆది: ఏ నువ్వే చెప్పొచ్చుగా.. పొరపాటుగా నేను తప్పుగా మాట్లాడానని.. నన్ను క్షమించండని.

   నాది పొరపాటు కాదు

  నాది పొరపాటు కాదు

  కత్తి: నాది పొరపాటు కాదు. తప్ప మాట్లాడలేదు. నేను మాట్లాడింది ఫర్‌ఫెక్ట్. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరంగా మాట్లాడాను.


  ఆది: నువ్వు చెప్పింది ఫర్‌ఫెక్ట్ అయితే యూట్యూబ్‌లో నువ్వు పెట్టిన వీడియో కింద కామెంట్లు చూడు. ఒకటైనా సపోర్ట్ చేస్తే నాకు చెప్పు. ఫ్యాన్స్ పిచ్చి వెధవలు అని పోస్టు చేయడం వల్లే అందరి అభిమానులు కోపం వచ్చింది కాబట్టే అన్ని కాల్స్ వస్తున్నాయి.

  English summary
  Katti Mahesh and Jabardasth Comedian Hyper Aadi phone Conversation in a TV chanel live interview
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X