For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విజువల్ వండర్ ( విక్రమ్ ‘ఐ’ ప్రివ్యూ)

  By Srikanya
  |

  విక్రమ్‌, ఎమీజాక్సన్‌ జంటగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐ'. తమిళంలో ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించిన ఈ సినిమాను మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

  చిత్రంలో లింగేశన్ గా విక్రమ్ కనిపిస్తారు. అతను మిస్టర్ తమిళనాడు అవ్వాలనే కోరిక ఉన్న ఔత్సాహిక బిల్డర్. అతని అమీ జాక్సన్ ని కలిసిన తర్వాత అతను జీవితంలో మార్పు వస్తుంది.ఆమె తో ప్రేమలో పడిన తర్వాత అతనికి ఆమె ఓ టాప్ మోస్ట్ ప్రొఫిషనల్ మోడలింగ్ ఇండస్ట్రీలో అని అర్దమవుతుంది. ఆమె కోసం అతను మోడల్ గా మారుదామనుకుంటాడు. అక్కడ నుంచి ఏమైంది...అతని కోరిక తీరిందా అనే కధాంశంగా ఈ కథ నడుస్తుంది.

  'ఐ' విశేషాలగురించి విక్రమ్ మాట్లాడుతూ...శంకర్‌ దర్శకత్వపు ప్రత్యేకతను ఇదివరకు చూసిన వ్యక్తిని. ఇక ఆయన ప్రభంజనానికి పీసీ శ్రీరామ్‌ కలిస్తే ఎలా ఉంటుందనే.. ఆలోచన చాలా కాలంగా ఉండేది. వీరిద్దరి కలయికలో నటించాలన్నది నా కల. అది 'ఐ'తో నెరవేరింది. చైనాలో తెరకెక్కించిన సన్నివేశాల్లో పీసీ శ్రీరామ్‌ గొప్పతనం ఏంటో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అన్నారు.

  నిర్మాతలు మాట్లాడుతూ ‘‘శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ విజువల్‌ వండర్‌ ఈ చిత్రం. హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా ఉంటుంది. విక్రమ్‌ విభిన్న గెటప్‌లలో ఆకట్టుకుంటారు. రెహమాన్‌ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. '' అని అన్నారు. శంకర్‌ దర్శకత్వంలో విక్రం హీరోగా తెరకెక్కిన చిత్రం 'ఐ'. వారిద్దరి మూడేళ్ల కృషి ఈ చిత్రం. ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరకల్పనలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. దాదాపు రూ.130 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు సమాచారం. గత దీపావళికే సిద్ధమైన ఈ సినిమా... తెలుగు, హిందీలలోనూ విడుదల చేయాలని భావించడంతో ఆగిపోయింది.

  ఈ చిత్రంలో విక్రమ్‌ ఈ చిత్రంలో భిన్న పాత్రల్లో కన్పించనున్నారు. ఓ వైపు బాడీబిల్డర్‌ లింగేశ్వర్‌ పాత్ర కోసం బరువు పెరిగి... మళ్లీ గూనివాడి పాత్ర కోసం పూర్తిగా తగ్గారు. సైకిల్‌ హీరోయిన్‌గా మారడం, నోకియా ఫోన్‌ డ్రెస్‌లో కధానాయికను చూపించడం వంటి శంకర్‌ మార్క్‌ మాయాజాలం ఈ చిత్రంలోనూ చూడవచ్చు.

  చేతి వేళ్లకు పూలు పూయడం, ఒంటిపై సీతాకోక చిలుకలు వాలడం, ప్రపంచ వింతలను ఒకే పాటలో చూపించడం ఇవన్నీ ఎక్కడ చూడవచ్చు అంటే సినీ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా టక్కున చెప్పేది శంకర్‌ సినిమాలో అని. అందుకు తగినట్లే ఆయన సినిమాలు ఉంటాయి.

  మరో విశేషం ఏంటంటే.. పాకిస్థాన్‌లో కూడా ఈ సినిమా థియేటర్లలోకి వెళ్లనుండటం. రాష్ట్రంలో దాదాపు నాలుగొందల థియేటర్లలో సందడి చేయనుంది. ఆంధ్రలో 500 థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం నుంచే ఈ సినిమా టికెట్ల రిజర్వేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్క చెన్నైలోనే 40 థియేటర్లలో తెరపైకి వస్తోంది. దాదాపు వారానికి సంబంధించి అన్ని థియేటర్లలోనూ హౌస్‌ఫుల్‌ అయినట్లు సమాచారం.

  “I” (Ai) (Manoharudu) Telugu Movie preview

  సంస్ధ : ఆస్కార్‌ ఫిలింస్‌, మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

  నటీనటులు: విక్రమ్, అమీ జాక్సన్, సురేష్‌గోపి, ఉపేన్‌ పటేల్‌, సంతానం, రాంకుమార్‌ గణేషన్‌, శ్రీనివాసన్‌, సయ్యద్‌ సిద్ధిక్‌ తదితరులు

  ఛాయగ్రహణం: పి.సి.శ్రీరామ్‌,

  సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌.

  మాటలు: శ్రీరామకృష్ణ

  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శంకర్

  నిర్మాత: ఆస్కార్ రవి చంద్రన్

  విడుదల తేదీ: 14, 01,2015.

  English summary
  Vikram and Shankar's "I" has hit the screens. The movie, which is made with a huge budget, is the most awaited movie of 2015. So, there are a lot of expectations riding on the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X