Just In
- 6 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- News
ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఆ పనిచేయరు... దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి : సంజయ్ సవాల్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సమంత కొంప ముంచిన...హగ్స్ అండ్ కిసెస్ (ఫోటోలు)
హైదరాబాద్ : సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల చుట్టూ వివాదాలు ముసరడం సహజమే. వారు ఎవరితో క్లోజ్‌గా ఉన్నా, ఎవరి గురించైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసినా........ ఎఫైర్? ఉందేమో అనే అనుమానాలకు తావిచ్చినట్లవుతుంది. తాజాగా తెలుగు సినిమా టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత, హీరో సిద్దార్థతో ఎఫైర్ నడుపుతుందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది.
సమంత-సిద్ధార్థ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా ఆ మధ్య జోరందుకుంది. పలు పర్యాయాలు వీరిద్దరు వేర్వేరు సందర్భాల్లో, వేర్వేరుగా ఈ వ్యాఖ్యలను ఖండించినా మీడియాలో గాసిప్స్ మాత్రం ఆగలేదు. దీనికి తోడు వీరిద్దరు కలిసి పలు సినిమాలకు సైన్ చేయడం, సిద్ధార్థ నటించిన ఓ సినిమాలో సమంత గెస్ట్ రోల్ చేయడం, ఏ కార్యక్రమంలో చూసినా వీరు చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుండటంతో 'ఎఫైర్' వార్తలు బలం చేకూరినట్లయింది.
అయితే వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే ప్రచారం జోరందుకోవడానికి కారణం ఏమిటో వెలుగులోకి వచ్చింది. దీనిపై సమంత స్పష్టమైన వివరణ ఇచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

అవార్డులతో మొదలైన కథ...
ఇటీవల సమంత ఉత్తమ నటిగా రెండు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇరవై ఏళ్ల క్రితం సమంత మాదిరి ప్రముఖ నటి రేవతి కూడా రెండు భాషల్లో ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారట. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సమంత రేవతి రేంజిని అందుకుంది.

సిద్దార్థ విష్ చేయడంతో....
రేవతి తర్వాత సమంతనే అలాంటి ఘనత సాధించింది అనే విషయాన్ని అందరికీ గుర్తు చేసిన సిద్ధార్థ.....ఈ విషయమై సమంతను విష్ చేసాడు. అభినందనలతో ముంచెత్తాడు. సిద్ధార్థ తెలిపిన అభినందనలకు సమంత ఇచ్చిన రిప్లై వివాదాస్పదం అయింది.

సమంత రిప్లై ఇలా....
సిద్ధార్థ అభినందించడంతో ఉబ్బితబ్బిబ్బయిన సమంత స్పందిస్తూ....ఈ విషయం తెలిసాక చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఈ వేడుకలో నువ్వు(సిద్దార్థ) లేక పోవడం నిజంగా లేటుగా అనిపించింది అంటూ అనుమానాలకు తావిచ్చేలా ట్వీట్ చేసింది.

సమంత హగ్స్, కిసెస్
అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసిన సమంత....‘నీకు నా హగ్స్ అండ్ కిసెస్' అంటూ సిద్ధార్థకు ట్వీట్ ఇచ్చింది. ఇప్పటికే వీరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తల నేపథ్యంలో సమంత చేసిన హగ్స్, కిసెస్ ట్వీట్ సంచలనం సృష్టించింది. వీరి మధ్య ఎఫైర్ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చినట్లయింది.

ఖంగుతిన్న సమంత...
తన వ్యాఖ్యలే తమ మధ్య ఎఫైర్ ఉందనే పుకార్లకు బలాన్ని ఇచ్చిందనే విషయం తెలుసుకున్న సమంత ఖంగు తింది. ‘మీకు నా హగ్స్ అండ్ కిసెస్' అనే పదం నేను ప్రతి ఒక్కరికీ వాడతాను. కానీ అది ఎప్పుడు ఇంత ఇష్యూ కాలేదు. కానీ సిద్ధార్థ విషయంలో మాత్రం అనవసరం రాద్ధాంతం చేస్తున్నారని మండి పడింది.

స్నేహితులం మాత్రమే అన్న సమంత
సిద్దార్థకు, నాకు మధ్య ఎఫైర్ ఉందనడం కరెక్టు కాదు. సిద్దార్థ నాకు మంచి ఫ్రెండ్. నా శ్రేయోభిలాషుల్లో తను కూడా ఒకరు. అందుకే నా విజయం తనకు ఆనందాన్ని ఇచ్చింది. దానికి మలినాన్ని ఆపాదించడం సబబు కాదు అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.