»   » డేటింగ్ నిజమే అని ఒప్పుకున్న హీరోయిన్, ఆ నిర్మాతేనా?

డేటింగ్ నిజమే అని ఒప్పుకున్న హీరోయిన్, ఆ నిర్మాతేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కన్నడ భామ భావన గత కొంత కాలంగా రహస్య వ్యక్తితో డేటింగ్ చేస్తోందని, అతనితో ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంత కాలం ఈ వార్తలను చూసి చూడనట్లు వెళ్లిన భావన ఎట్ట కేలకు ఆ విషయం నిజమే అని ఒప్పుకుంది. ఒక వ్యక్తితో గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

'గత రెండు సంవత్సరాల నుండి ఒకరితో రిలేషన్‌షిప్ మెయింటేన్ చేస్తున్నాను. కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం మాత్రం లేదు. ఆ వ్యక్తి వివరాలు ఇప్పుడే బయట పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. నా పర్సనల్ విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ప్రస్తుతం నా ఫోకస్ అంతా ఇప్పటి వరకు కమిటైన చిత్రాలు పూర్తి చేయడంపైనే ఉంది' అని భావన వెల్లడించింది.

I Am In A Relationship Since Two Years, Says Bhavana

కాగా...ఆ వ్యక్తి ఎవరో భావన బయట పెట్టక పోవడంతో పలు రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. అతను కన్నడ సినీ నిర్మాత నవీన్ అనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి 'రోమియో' అనే కన్నడ చిత్రానికి కలిసి పని చేసారు. తన పేరు బయటకు రావడంపై నవీన్ కాస్త కంగారు పడ్డారు.

వెంటనే మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నాడు. భావన, నేను స్నేహితులం మాత్రమే. అందుకు మించి మరేమీ లేదు. 'రోమియో' చిత్రం దగ్గర నుండి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మధ్యలో కొన్ని సార్లు కలిసి ఇతర ప్రాజెక్టుల గురించి కూడా చర్చించాం. ఆమె కన్నడలో చిత్రాలు చేయడం తగ్గించినప్పటి నుండి ఇద్దరం టచ్‌లో లేము. మేమిద్దరం డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు ఎలా ప్రచారంలోకి వచ్చాయో అర్థం కావడం లేదు అని నవీన్ తెలిపారు.

English summary

 Lots of rumours are speculations about actress Bhavana and her lover. The actress, who recently accepted the fact that she is dating someone, has finally come up saying that she is dating a person and has been in a relationship for the past two years!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu