»   » నా కుడికన్నులో చూపు లేదు.. పుట్టుక నుంచే ఈ సమస్య.. చాలా రోజులు బాధలో.. రానా దగ్గుబాటి

నా కుడికన్నులో చూపు లేదు.. పుట్టుక నుంచే ఈ సమస్య.. చాలా రోజులు బాధలో.. రానా దగ్గుబాటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రంలో భళ్లాలదేవ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకొంటున్న రానా దగ్గుబాటి తన జీవితానికి సంబంధించిన వాస్తవాన్ని వెల్లడించి షాకింగ్‌కు గురిచేశాడు. పుట్టుక నుంచే నా కుడి కన్నులో చూపులేదు అని గతేడాది ఓ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2016లో అప్‌లోడ్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రానా చెప్పిన విషయం ప్రేక్షకులను నివ్వెరపాటు గురిచేసింది.

కుడి కన్నులో చూపు లేదు..

కుడి కన్నులో చూపు లేదు..

నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం మీతో పంచుకొంటాను. పుట్టినప్పటి నుంచే నా కుడి కన్నులో చూపులేదు. కేవలం నా ఎడమ కంటితోనే చూస్తాను. ప్రస్తుతం మీరు చూస్తున్న కన్ను ఓ వ్యక్తి మరణాంతరం దానం చేసిన కన్ను అది. మీరు ఎడమ కన్ను మూస్తే నాకు ఏమీ కనిపించదు అని రానా చెప్పాడు.

ఆపరేషన్ చేసి..

ఆపరేషన్ చేసి..

జెమిని టెలివిజన్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‌యువకుడిగా ఉన్నప్పుడు ప్రముఖ నేత్రాలయ సంస్థ ఎల్వీ ప్రసాద్ వైద్యులు ఆపరేషన్ చేసి కన్ను అమర్చారు తెలిపారు. ఆ కార్యక్రమంలో తన తల్లికి కన్ను లేదని బాధపడుతున్న ఇద్దరు పిల్లలకు భరోసాను ఇచ్చారు. మీరు బాగా చదువుకోండి. నేను సహాయం చేస్తాను. మిమ్మల్ని చూస్తే చాలా మనో నిబ్బరంతో ఉన్నారు. మీ అమ్మ, తాత, అమ్మమ్మలు ఏడ్వకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని పిల్లల నుంచి హామీ తీసుకొన్నారు. ఈ కార్యక్రమం చాలా ఉద్వేగంగా సాగింది.

నటనతో అలరిస్తున్న..

నటనతో అలరిస్తున్న..

ఉన్నత చదువులు పూర్తయిన తర్వాత పలు వ్యాపారాలపై దృష్టి సారించి ఎన్నో విజయాలను అందుకొన్నారు. సినీ రంగంలోకి ప్రవేశించి విభిన్నమైన పాత్రలతో రానా అలరిస్తున్నారు. తెలుగులోనే కాకుండా హిందీ చిత్ర సీమలో పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ఘాజీ, బాహుబలి చిత్రం దేశవ్యాప్తంగా అభిమానుల ఆదరణను చూరగొంటున్నాయి.

బాహుబలి హవా..

బాహుబలి హవా..

రానా, ప్రభాస్‌ నటించిన బాహుబలి2 చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది. విడుదలైన తొలిరోజు రూ.120 కోట్ల కలెక్షన్లను సాధించింది. త్వరలోనే రూ.1000 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఓ అరుదైన ఘనతను సాధించేందుకు పరుగులు పెడుతున్నది.

English summary
Rana Daggubati said in a Interview, "Should I tell you one thing, I am blind from my right eye. I see only from my left eye. The one you see is someone else's eye which was donated to me after his death. If I close my left eye, I can see no one."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu