»   »  సంపూర్ణేష్ బాబు వ్యాఖ్యలు ఏ హీరో గురించి?

సంపూర్ణేష్ బాబు వ్యాఖ్యలు ఏ హీరో గురించి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'హృదయ కాలేయం' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన సంపూర్ణేష్ బాబు, ఆచిత్ర యూనిట్ సభ్యులు విజయోత్సవ యాత్రల పేరుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా వారు విజయవాడ, గుంటూరులలో పర్యటించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ప్రేక్షకులు తనపై చూపుతున్న ఆదరణను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు.

ఓ వైపు అగ్రహీరో చిత్రం విడుదలైనప్పటికీ 'హృదయ కాలేయం' చిత్రం కలెక్షన్లు తగ్గలేదని అన్నారు. హృదయ కాలేయం చిత్రం విడులైన రోజు మంచు విష్ణు నటించిన 'రౌడీ' చిత్రం కూడా విడుదలైంది. బహుషా మంచు విష్ణు సినిమా గురించే సంపూర్ణేష్ బాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

 I am indebted to Vijayawada : Sampoornesh Babu

తన తర్వాతి చిత్రం 'కొబ్బరి మట్ట' గురించి సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ....త్వరలోనే ఈచిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని, పూర్తి వినోదాత్మకంగా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నట్లు సంపూర్ణేష్ బాబు తెలిపారు.

'కొబ్బరి మట్ట' చిత్రంలో సంపూర్ణేష్ సరసన ఏడుగురు హీరోయిన్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడ్ అనే మూడు పాత్రలు సంపూర్ణేష్ బాబు పోషించబోతున్నాడట.

English summary
Overwhelmed by the love and support his small budget movie, Hrudaya Kaleyam received, Sampoornesh Babu or as he likes to call himself, Burning Star on Friday thanked his fans in Vijayawada. “I am indebted to the people of Vijayawada,” he said
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu