twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా నాన్నగారు కూడా 1947లోనే..: అల్లు అర్జున్

    By Srikanya
    |

    హైదరాబాద్: ఇండిపెండెన్స్ డే నాకు కేవలం శెలవు రోజు మాత్రమే కాదు. మా నాన్న గారు అల్లు అరవింద్ 1947లో పుట్టారు.ఆ సమయంలో మా తాతగారు అల్లు రామలింగయ్య గారు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు. తను పోరాడిన ప్రతీ విషయాన్ని మేము ప్రతీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున గుర్తు చేసుకుంటాము. ఆయన మాకు ఎప్పుడూ ఆ రోజుల్లో దేశం గురంచి,జీవిన విధానం గురించి కథలు చెప్తూండేవారు. నేను ఎవరినైతే మీ ఎదురుగా ఉన్నానో...ఇవన్ని ఆయన భావాలు..భావోద్వాగాలు. ముఖ్యంగా ఓ వ్యక్తి ఏదైనా సాధించగలడు అన్నది నేను స్వాతంత్ర్యం నుండి తెలుసుకున్నాను. మనం చాలా స్వేచ్చాయితమైన,ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నాం. మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్చా,స్వాతంత్ర్యాలకి కారణం ఆ రోజున వారు ప్రాణాలకి ఒడ్డి దేశం కోసం పోరాడిన ఫలితమే అంటూ అల్లు అర్జున్ తన జ్ఢాపకాలను గుర్తు చేసుకున్నారు.

    ఇక క్రిందటి గురువారం అల్లు అర్జున్ తాజా చిత్రం జులాయి రిలీజైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం సక్సెస్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్..''హీరోగా నేనేం చేసినా... ఎంత పేరు తెచ్చుకొన్నా కేవలం అది దర్శకుల వల్లే. సినిమా అనేది సమష్టి కృషే అయినా... దర్శకుడి కష్టమే ఎక్కువ. 'జులాయి' విషయంలో కూడా త్రివిక్రమ్‌ ఎంతో శ్రమించారు''అని చెప్పారు అల్లు అర్జున్‌.

    అలాగే తానిప్పటివరకు నటించిన చిత్రాలన్నింటికీ తొలిరోజు డివైడ్‌ టాక్‌ వచ్చిందని, ఏరోజైనా సినిమా హిట్‌ అన్న స్పందన మొదటి రోజు వినాలని ఎదురుచూశానని, ఆ బాధను జులాయి చిత్రం తీర్చిందని అల్లు అర్జున్‌ అన్నారు. ''ఈ రోజే ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూశా. చాలా బాగుంది''అని దేవిశ్రీ ప్రసాద్‌ చెప్పారు. మలయాళంలో ఈనెల 17న విడుదల చేయనున్నామని, త్వరలో ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక కూడా జరుపుతామని, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని నిర్మాతలు డివివి.దానయ్య, రాధాకృష్ణ తెలిపారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, సోనుసూద్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటించారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

    English summary
    Allu Arjun says...Independence Day is not just a holiday for me. My father, Allu Aravind, was born in 1947. At that time, my grandfather, the late Allu Ramalingaiah, a freedom fighter and also a popular figure in the Telugu film industry, in prison. He was arrested by the British during the Quit India Movement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X