»   » అవన్నీ నమ్మకండి కొట్టిపడేసిన నమ్రతా.., మహేష్ ఫ్యాన్స్ నిరాశ

అవన్నీ నమ్మకండి కొట్టిపడేసిన నమ్రతా.., మహేష్ ఫ్యాన్స్ నిరాశ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు భార్య, మాజీ మిస్ ఇండియా, నటి నమ్రత శిరోద్కర్ త్వరలో సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా మల్టీ స్టారర్ మూవీ ద్వారా అంటూ ఊదరగొట్తారు కొన్నాళ్ళుగా. నమ్రత మిస్ ఇండియా కీరీటం దక్కించుకున్న తర్వాత ఆమె పలు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

బాలీవుడ్ నుండే మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జరిగింతా అందరికీ తెలిసిందే. 2005లో 'బ్రైడ్ అండ్ ప్రిజుడిస్' అనే ఆంగ్ల చిత్రంలో నటించిన ఈ మాజీ మిస్ ఇండియా ఆ తర్వాత వేరే సినిమాల్లో కనిపించలేదు. ఇన్నాళ్లు మహేష్ బాబుకు సంబందించిన వ్యవహారాలూ, ఇతర వ్యాపార విషయాలు చూసుకుంటూ ఉండిపోయింది.

I am in no mood for Comeback to filims says Namrata Mahesh Babu

అయితే గత కొన్నాళ్ళుగా నమ్రత రీ ఎంట్రీ అంటూ వర్తలు వస్తున్నాయి.నమ్రత రీ ఎంట్రీ ఇస్తుందనే వార్త బయటకు రావడంతో ఇటు మహేష్ ఫ్యాన్స్ అటు నమ్రత ఫ్యాన్స్ లో ఆనందం అవధులు దాటింది. దాదాపుగా అవి నిజమే అని అంతా నమ్మెసే సమయం లో తాను నటించ బోవటం లేదనీ అసలు అలాంటి ఉద్దేశమే లేదనీ చెప్పేసి. ఆశగా ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ ఆశలమీద నీళ్ళు జల్లేసింది.

మ‌హేశ్ ప్ర‌స్తుతం మురుగదాస్ తో సినిమా చేస్తున్నాడు. ఇందులో ర‌కుల్ ప్రీత్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే ఇందులో మ‌రో హీరోయిన్ కు కూడా ఓ పాత్ర ఉంటుంద‌ని, 10-15 నిమిషాలు ఉండే పాత్ర ఇది. ఈ క్యారెక్టర్ కోసం చాలా మంది హీరోయిన్ల‌ను అనుకున్న మురగ‌దాస్.. చివ‌రికి న‌మ్ర‌త తోనే ఆ క్యారెక్టర్ చేయించాలనుకున్నాదనీ చెప్పుకున్నారు, ఈ పాత్ర చేయటానికి నమ్రత కూదా ఓకే చెప్పిందనీ అన్నారు. కానీ నమ్రత తాజా ప్రకటనతో అవన్నీ రూమర్లేనని తేలిపోయింది.

నా రీఎంట్రీపై వస్తున్న రూమర్లన్నీ జస్ట్ ట్రాష్ అంటూ కొట్టిపాడేసింది నమ్రత. తాను గతంలో మిస్ ఇండియా.. అలాగే ఒక కమర్షియల్ హీరోయిన్ గా ఎంటర్టయిన్ చేసినప్పటికీ.. ఇప్పుడు పెళ్ళాయక తీరుబడి లేదంటోంది. ''ఆల్రెడీ నా పనులు నాకున్నాయి. మహేష్ ఎండార్సమెంట్ డీల్స్ చూసుకోవాలి.. తన సినిమాల ప్రమోషన్ పనులు చేయాలి. పిల్లలు కూడా ఉన్నారు. ఖాళీ దొరికితే టూర్లకు వెళ్తున్నాం. వీటన్నింటితో లైఫ్ చాలా బిజీ ఉండటంతో ఇక రీ-ఎంట్రీ అనే పదానికి నా దగ్గర స్కోప్ లేదు'' అంటూ చెప్పుకొచ్చింది నమ్రత.

English summary
Namrata claims to be extremely busy looking after brands endorsed by Mahesh and the marketing of his projects. 'Apart front that I have to take care of our two children. Whenever we are free, We go on a vacation. That's it! No possibility of me making a comeback,' she informs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu