»   » సహజీవనం చేసి ఎఫైర్ లేదంటే ఎలా నమ్ముతాం..పాపా?

సహజీవనం చేసి ఎఫైర్ లేదంటే ఎలా నమ్ముతాం..పాపా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అమెరికానుంచి వచ్చి బాలీవుడ్ లో సెటిలైన భామ నర్గీస్ ఫక్రీ. ఆమె గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు.. నిర్మాత ఉదయ్‌ చోప్రాతో నర్గీస్‌ ఫక్రీ ప్రేమాయణం నడిపింది, సహజీవనం చేసింది... ఈ మధ్యనే బ్రేక్ అప్ కూడా అయింది. అయినా ఇంకా మీడియాలో వారిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరుకి బ్రేక్ అప్ కాలేదని, అదంతా వారు కావాలని మీడియాని ఎట్రాక్ట్ చేయటానికి చేస్తున్న డ్రామా అని అంటున్నారు. ఈ నేపధ్యంలో నర్గీస్ ఫక్రీ స్పందించింది.

ఈ విషయమై నర్గీస్ స్పందిస్తూ, ''నేను చాలా అదృష్టవంతురాలిని. ఎందుకంటే.. ఉదయ్‌ నన్ను ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచేలా చేస్తున్నాడు. వీటి గురించి తెలిసినప్పుడు మేం చాలా నవ్వుకుంటాం. మరోసారి చెబుతున్నా.. ఉదయ్‌ నేను డేటింగ్‌ చేయలేదు. కానీ.. నా జీవితంలో ఆయన కూడా ఒక భాగమే. నాకు ఇండియాలో కొద్ది మంది మిత్రులే ఉన్నారు. అందులో ఉదయ్‌ ఒకరు'' అని చెప్పింది.

ఉదయ్ చోప్రా ఏమంటారంటే... ''సాధారణంగా నేను ఇలాంటి రూమర్స్ కి స్పందించను. కానీ.. మీడియా నిజాన్ని మరిచి కల్పితాలను సృష్టిస్తోంది. మేమిద్దరం కేవలం మంచి స్నేహితులమే. కానీ.. చిన్న విషయాన్ని పెద్దది చేసి కథలు కథలుగా రాస్తున్నారు. ఈ విషయంలో వారిని మెచ్చుకోవాలి'' అని అన్నాడు ఉదయ్ చోప్రా.. ఇంత విడమరిచి చెప్పినా వారిపై గాసిప్స్ ఆగుతాయో లేదో చూడాలి..అంటున్నారు వీళ్లిద్దరు.

మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో ...

మోసం, అందుకే అమెరికాకు

మోసం, అందుకే అమెరికాకు

నటి నర్గిస్‌ ఫక్రి.. బాలీవుడ్ నటుడు, నిర్మాత ఉదయ్‌ చోప్రాలు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ ఫెయిలైంది.. దీంతో ఇద్దరూ విడిపోయారు. అలాగే నర్గిస్‌ వెంటనే తన స్వదేశం అమెరికా వెళ్లిపోయింది. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ ఉదయ్‌ తనని మోసం చేసినట్లు నర్గీస్ అంటున్నది. ఇప్పుడేమో అసలు డేటింగ్ చెయ్యలేదంటోంది. ఇది అందరినీ కన్ఫూజ్ చేస్తోంది.

చెయ్యలేరంటూ..

చెయ్యలేరంటూ..

సర్లే బ్రేకప్ అయ్యితే అయ్యిందని ఆగలేదు..ఆ మధ్యన నర్గిస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన మెసేజ్‌ రూమర్లకి మరింత వూతమిచ్చేలా ఉంది. నిద్రపోతున్న తన కుక్క ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ నర్గిస్ మనల్ని ఎవరూ మోసం చేయనప్పుడు, మనం సింగిల్‌గా ఉన్నప్పుడు ఇంత హాయిగా పడుకుంటాం అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.

ఎందుకిలా కుక్కతో ..

ఎందుకిలా కుక్కతో ..

కుక్క ఫొటో తో పెట్టిన క్యాప్షన్‌ చూసి ఆ మెసేజ్‌ ఉదయ్‌ గురించేనని అతను మోసం చేశాడనే నర్గిస్‌ అమెరికా వెళ్లిపోయిందంటూ బాలీవుడ్‌ వర్గాలు గుస సలాడుకుంటున్నాయి. ఆమె బ్రేకప్ అయ్యిందని వార్తలు వచ్చిన వెంటనే ఇలా నర్గీస్ పోస్ట్ చేసింది. దాంతో మరింతగా ఈ రూమర్స్ కు ఊపు వచ్చింది. కావాలేనే నర్గీస్ ఇలా చేసిందా ..ఏమిటో అర్దం కాలేదు

బ్రేక్ ప్ బాదలోనే వెళ్లిపోయిందా

బ్రేక్ ప్ బాదలోనే వెళ్లిపోయిందా

బాలీవుడ్‌ నిర్మాత, నటుడు ఉదయ్‌ చోప్రాతో నర్గిస్‌ ప్రేమలో పడ్డట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అదే సమయంలో ఉన్నట్టుండి నర్గిస్‌ అమెరికా వెళ్లిపోవడంతో ఉదయ్‌ పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే అలిగి అమెరికాకి వెళ్లిపోయిందని.. ఇక తిరిగి రాదని గాసిప్‌ వార్తలు పుట్టుకొచ్చాయి. హౌస్‌ఫుల్‌-3 చిత్ర ప్రమోషన్‌లో పాల్గొనకపోవడం..అందరికీ షాక్ ఇచ్చింది.

నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు

నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు

చివరగా ఆమె బాలీవుడ్‌లో నటించిన బంజో చిత్రం విడుదల సమీపిస్తున్నా నర్గిస్‌ ఇండియా రాకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. అయితే ఇండియా తిరిగి రాదు అన్న వార్తలకు చెక్‌ పెడుతూ అమెరికాలో నా పనులన్నింటినీ త్వరగా పూర్తి చేసి వీలైనంత తొందరగా బంజో ప్రమోషన్‌లో పాల్గొనాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది ఈ అమెరికా సుందరి.

అడల్ట్ సినిమాలతోనూ ఆమె

అడల్ట్ సినిమాలతోనూ ఆమె

అడల్ట్‌, సెక్స్ కామెడీ వంటి సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమేనంటూ సంకేతాలిచ్చేసింది బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి. కాకపోతే బాలీవుడ్‌లో అలాంటి ఫిల్మ్స్ చేయనని క్లారిటీ ఇచ్చేసింది. అమెరికా లేదా విదేశాల్లో అయితే అలాంటి సినిమాలు చేసినా ఎలాంటి అభ్యంతరం వుండదని చెప్పుకొచ్చింది. అంటే త్వరలో మనళ్లకు పండుగ చేసుకునే అవకాసం ఇస్తోందన్నమాట.

బాగానే వంటపట్టించుకుంది

బాగానే వంటపట్టించుకుంది

అడల్ట్ కామెడీల విషయంలో సెన్స్‌ హ్యూమర్‌ ఇండియాలో చాలా భిన్నంగా ఉంటుంది. అదే అమెరికా, జర్మనీ, లండన్‌లో అయితే వాళ్ల సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ వేరే రకంగా ఉంటుందని అంటోంది. బాలీవుడ్‌లో ఇప్పుడు అడల్ట్ కామెడీ సినిమాలకు మంచి మార్కెట్టే ఉంది అంటూ చెప్తోంది నర్గీస్ ఫక్రీ. అంటే ఆమె ఇక్కడ మార్కెట్ ని , ట్రెండ్స్ ని సైతం రీసెర్చ్ చేసే పనిలో పడిందన్నమాట.

అయితే ఆ సినిమాలు చూడలేదట

అయితే ఆ సినిమాలు చూడలేదట

బాలీవుడ్ లో గ్రాండ్ మస్తీ, క్యా కూల్ హై హమ్, మస్తీజాదే వంటి పెద్దల సినిమాలు కాసులు రాబట్టాయి. అయితే, బాలీవుడ్‌లో వచ్చిన అడల్ట్ కామెడీ సినిమాలు చూడలేదని నర్గీస్ తెలిపింది. మరి అవేమి చూడకుండానే ఇన్ని విషయాలు తెలిసాయా. లేక కేవలం ఇతర దేశాల అడల్ట్ కామెడీలే చూస్తుందా ఏమో..ఏం ఆమెకు నచ్చుతాయో మరి..ఇక్కడ డోస్ సరిపోవటం లేదేమో.

అందులో లోటు లేదు

అందులో లోటు లేదు

అక్షయ్‌ కుమార్, అభిషేక్ బచ్చన్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హెడెన్‌ వంటి ప్రముఖ తారాగణంతో సాజిద్-పర్హాద్ ద్వయం 'హౌస్‌ఫుల్-3' తెరకెక్కింది. అందులో చేసింది. ఈ మూవీతోపాటు 'అజార్‌'లోనూ నర్గీస్ నటించిది. అమెరికాకు చెందిన 36 ఏళ్ల మోడల్ అయిన నర్గీస్‌కు ప్రజెంట్ బాలీవుడ్‌లో మంచి ఆఫర్లే వస్తున్నాయి.

నర్గీస్ చేస్తున్న చిత్రం ఇది

నర్గీస్ చేస్తున్న చిత్రం ఇది

బాలీవుడ్ హీరో రితేశ్ దేఖ్ ముఖ్, హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ప్రధాన పాత్రలలో రవి జాదవ్ తెరకెక్కిస్తోన్నహిందీ చిత్రం బంజో. మ్యూజికల్ డ్రామాగా తెరక్కెకుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా రాదా రాదా అనే వీడియో సాంగ్‌ని విడుదల చేశారు.దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్‌లో రితేశ్‌తో పాటు బంజో ప్లేయర్స్ చేసిన పర్‌ఫార్మెన్స్‌కు దర్శకుడే షాక్ అయ్యాడట. ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పిస్తోన్న బంజో చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలోకి రానుంది.

ఫక్రీకి ప్రాణాంతక జబ్బు

ఫక్రీకి ప్రాణాంతక జబ్బు

ఆరోగ్య కారణాలతోనే విదేశాలకు వెళ్లినట్టు నర్గీస్ వెల్లడించింది. తను arsenic and lead poisoning అనే అనారోగ్యంతో బాధపడ్డానని చెప్పింది. ఆ అనారోగ్యం ఎందుకు వచ్చిందో అర్దం కాలేదు. అది నీటి వల్లా లేక ఫుడ్ వల్లా, ఓల్డ్ బిల్డింగ్ లో పాడైన పైప్ లు ఉన్న చోట ఉండటం వల్లా మరేమో తెలియలేదు.

రెస్ట్ కోసమే వెళ్లిందట...

రెస్ట్ కోసమే వెళ్లిందట...

అప్పట్లో నగ్రీస్ ఫక్రీ ఇలా విదేశాలకు వెళ్లినప్పుడు...ఏడాది కాలంగా వరుసగా మూడు సినిమాల కోసం తీరిక లేకుండా నటించడంతో ఫక్రి అలసిపోయిందని.. అందుకే విశ్రాంతి తీసుకోవడం కోసం విదేశాలకు వెళ్లిందని ఆమె మేనేజర్ తెలిపాడు.ఉదయ్ చోప్రా పెళ్లికి నిరాకరించడంతో అలిగి విదేశాలకు వెళ్లిపోయినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని అతనన్నాడు.

English summary
There are a lot of speculations doing the rounds about Nargis Fakhri and Uday chopra's relationship status and the duo have not really come out in the open and confirmed their relationship or break-up. However, Nargis Fakhri in a recent interview to Mid Day said that Uday Chopra is just 'a friend' and nothing else.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu