»   » అల్లు అర్జున్ కి సోదరిగా చేస్తే ప్రాబ్లం ఏంటి?

అల్లు అర్జున్ కి సోదరిగా చేస్తే ప్రాబ్లం ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నిత్యామీనన్ తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడూ ఆశ్చర్యపరుస్తూ...అందరినీ థ్రిల్ చేస్తూంటాయి. ఆమె మంచి టాలెంటెడ్ నటి అన్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో సోదరిగా చేస్తోంది. ఈ విషయమై మీడియాలో విభిన్న కథనాలు రావటంతో ఆమె స్పందించింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిత్యామీనన్ మాట్లాడుతూ... "బన్నికు సోదరిగా నటిస్తే ప్లాబ్లం ఏంటి..కాజల్, షారూఖ్ ఖాన్ జోష్ చిత్రంలో అన్న చెల్లెళ్లు గా చేసారు. తర్వాత వాళ్ళిద్దరూ దేవదాసులో లవర్స్ గా చేసారు. అల్లు అర్జున్ నాకు తన తదుపరి చిత్రంలో హీరోయిన్ గ ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేసాడు " అంటూ నిత్యా మీనన్ వివరించింది.

అల్లు అర్జున్‌ను తెరపై 'జులాయి'గా చూపించి ప్రేక్షకులకు వినోదాలు పంచారు త్రివిక్రమ్‌. ఆ ఇద్దరి కలయికలో ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతోంది. సమంత, నిత్యమేనన్‌, ఆదాశర్మ కథానాయికలు. రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.

I Am Ok As Sister To Bunny

త్రిశూలం, హుషారు, జాదూగర్ వంటి టైటిల్స్ పరిశీలనలకో వచ్చినా కథ ప్రకారం ఇదే సరైన టైటిల్ అని దర్శకుడు, హీరో భావించినట్లు సమాచారం. మార్చి చివరలో కాని,ఏప్రియల్ మొదటి వారంలో కానీ ఈ చిత్రం విడుదల అవనుంది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా పడుతుందని చెప్తున్నారు. తండ్రి కొడుకుల రిలేషన్ కూడా కథలో ప్రధానంగా సాగుతుందని అంటున్నారు.

ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది.

ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపిస్తాడనీ, సినిమా అంతా పెళ్లి సందడి మధ్య సాగుతుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరో ప్రక్క ఈ చిత్రం పూర్తవగానే మహేష్ ,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభం కానుంది. జూలాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2015 ఆగస్టు నుంచి ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలు ఎక్కవచ్చు. ఈ మేరకు ఎగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అప్పటికి మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని ఫినిష్ చేసుకుని రెడీ అవుతారు.

English summary
Nitya Menon said... "What happens if I act as sister for Bunny? Earlier, Sharukh Khan and Kajol also seen as brother and sister in Josh but later they were seen romancing in the film Devdas. Allu Arjun also promised to offer me her love role in his upcoming films. I have no worries" Nithya explained.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu