»   » ఏ హీరోకూ ఈ కష్టం రాకూడదు: ముద్దు సీన్ అనగానే... అన్నయ్యా అనేసింది!

ఏ హీరోకూ ఈ కష్టం రాకూడదు: ముద్దు సీన్ అనగానే... అన్నయ్యా అనేసింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్లో ఇపుడు బాగా మార్మోగి పోతున్న పేరు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఇప్పటికే పలు చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవాజుద్దీన్ ఈ నెల 25న 'బాబూమోషాయ్ బందూక్‌బాజ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలోని వివాదాస్పద సీన్లు, సెన్సార్ గొడవతో నవాజుద్దీన్ మరింత పాపులర్ అయ్యాడు.

  సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీ అయిపోయిన నవాజుద్దీన్.... తాజాగా ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. హీరోల సంగతి పక్కన పెడితే నటుడిగా బాలీవుడ్లో ప్రస్తుతం హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్ తానే అని ఫీలవుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

  నేనేమీ డిమాండ్ చేయడం లేదు

  నేనేమీ డిమాండ్ చేయడం లేదు

  తాను ఎవరినీ ఇంత కావాలని డిమాండ్ చేయడం లేదని, తన నటనను చూసి నిర్మాతలే తనకు ఇంత అని ఫిక్స్ చేస్తున్నారని, రెమ్యూనరేషన్ విషయంలో తాను ఇంత వరకు ఏ నిర్మాతతోనూ గొడవ పడింది లేదు అని నవాజుద్దీన్ చెప్పుకొచ్చారు.

  Ram Charan's 2 actresses for Sukumar's film - Filmibeat Telugu
  హాలీవుడ్ ధీటుగా ఇండియన్ సినిమా

  హాలీవుడ్ ధీటుగా ఇండియన్ సినిమా

  చాలా మంది స్టార్లు బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్లాలని చూస్తున్నారు. దాన్నో పెద్ద అచీవ్మెంటులాగా భావిస్తున్నారు. ఇలాంటి భావన మన వాళ్లలో ఎందుకు ఉందో అర్థం కావడం లేదు. మన దగ్గర హాలీవుడ్‌కి ధీటుగా సినిమాలు వస్తున్నాయి, అద్భుతమైన కటెంటుతో సినిమాలు తీస్తున్నాం, మన సినిమాలను చూసి మనం గర్వపడాలి అని నవాజుద్దీన్ అన్నారు.

  బాబూమోషాయ్ బందూక్‌బాజ్

  బాబూమోషాయ్ బందూక్‌బాజ్

  నవాజుద్దీన్ సిద్ధిఖీ ఆగస్టు 25న బాబూమోషాయ్ బందూక్‌బాజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో అతడు బెంగాళీనటి బిదితా బాగ్‌తో కలిసి ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు చేసాడు. నవాజుద్దీన్ కెరీర్లో ఘాటైన రొమాంటిక్ సీన్లు చేసిన సినిమా ఇదే.

  నాతో ముద్దు సీన్లు చేయడానికి ఇష్టపడటం లేదు

  నాతో ముద్దు సీన్లు చేయడానికి ఇష్టపడటం లేదు

  తనతో ముద్దు సీన్లలో నటించేందుకు చాలా మంది కథానాయికలు ఇష్టపడట్లేదని ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పుకొచ్చాడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ. ‘బాబూమొషాయ్‌ బందూఖ్‌బాజ్‌' చిత్రంలో బిదితా బాగ్‌ కంటే ముందు చిత్రాంగత సింగ్‌ని కథానాయికగా తీసుకున్నారు. నవాజ్‌-చిత్రాంగద మధ్యలో కొన్ని ముద్దు సీన్లు కూడా చిత్రీకరించారట. కానీ ఆమె మధ్యలోనే ఈ సినిమా నుంచి తప్పుకుంది.

  ముద్దు సీన్లు చేయను అనేసింది

  ముద్దు సీన్లు చేయను అనేసింది

  చిత్రాంగద సింగ్ తప్పుకున్న తీరుపై నవాజుద్దీన్‌ మాట్లాడుతూ.. ‘‘ చిత్రాంగదతో దాదాపు సగం సినిమా చిత్రీకరణ జరిగింది. ఆ సమయంలో దర్శకుడు కుషన్ నంది మరిన్ని ముద్దు సన్నివేశాల్లో నటించాలని ఆమెను కోరాడు. ఇక అలాంటి సీన్లు చేయను అని సినిమా నుంచి తప్పుకుంది.... అని నవాజుద్దీన్ తెలిపారు.

  ముద్దు సీన్లు చేయాల్సి వస్తుందని అన్నయ్య అనేసింది

  ముద్దు సీన్లు చేయాల్సి వస్తుందని అన్నయ్య అనేసింది

  గతంలో ‘గ్యాంగ్‌ ఆఫ్‌ వస్సేపూర్‌' చిత్రంలోనూ హ్యూమా ఖురేషితో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించాల్సింది. కానీ ఆ సినిమా సమయంలో మా మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు, ముద్దు సీన్లు ఉన్నాయని తెలిసి హ్యూమా నన్ను ‘నవాజ్‌ అన్నయ్యా' అని పిలవడం మొదలుపెట్టింది. ఆమె నన్ను అలా అన్నయ్యా అని పిలిచినపుడు తనతో అలాంటి సన్నివేశాల్లో ఎలా నటించగలను? అని దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో చెప్పిన విషయాన్ని నవాజుద్దీన్ గుర్తు చేసుకున్నారకు.

  English summary
  Bollywood actor Nawazuddin Siddiqui says he feels he is presently the highest paid actor in Bollywood in terms of acting. Nawazuddin will next be seen in Babumoshai Bandookbaaz, in which he has some intimate scenes with actor Bidita Bag. Earlier, actor Chitrangada Singh was a part of the movie, but she had walked out it. Commenting on that, Nawazuddin said: "She left when half of the shooting was over. Actually our director (Kushan Nandy) wanted some more kissing scenes, and she said, 'Enough is enough, I won't be able to do any more scenes, and left'." He said he felt "uncomfortable" initially while doing kissing scenes, but became used to it. Narrating an incident with Huma Qureshi during the shoot of Gangs of Wasseypur, he said: "We had to do a romantic scene, and she started addressing me as Nawaz bhai. I went to the director Anurag Kashyap and said, 'She is calling me bhai, how can I do the scene?'" With inputs from IANS.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more