»   »  ముస్లిం కల్చర్‌పై మరో తెలుగు హీరోయిన్ ఆసక్తి

ముస్లిం కల్చర్‌పై మరో తెలుగు హీరోయిన్ ఆసక్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య పలువురు సినీ తారలు మత మార్పిడి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నటి మోనికా, ఏఆర్ రెహహాన్, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా లాంటి వారు ఇస్లాం మతం వైపు ఆకర్షితులయ్యారు. మతం మార్చుకున్నారు. ముస్లిం మత సంస్కృతి వైపు ఆకర్షితులు అవుతున్న వారి లిస్టులో మరో నటి కూడా చేరింది. ఆమె ఎవరో కాదు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల నటి సంజన.

ముస్లిం సంస్కృతి, సాంప్రదాయాలు తనకు ఎంతో నచ్చాయని, వాటి వల్ల ప్రభావితం అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె మాటలను బట్టి త్వరలో ఇస్లాం స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంజన మలయాళం మూవీ 'బదారుల్ మునీర్ హస్నుల్ జమాల్' అనే చిత్రంలో నటిస్తోంది. ఇదొక మలబారీ ముస్లిం లవ్ స్టోరీ. ఇందులో ఆమె ముస్లిం యువతిగా నటిస్తోంది. ముస్లిం మహిళల వస్త్ర ధారణతో ఆమె కనిపించనుంది.

I Am Very Much Influenced By Muslim Culture: Sanjana

ఈ సినిమాకు పని చేస్తున్న సందర్భంగా ముస్లిం కల్చర్ గురించి ఆమె చాలా విషయాలు నేర్చుకుంది. అంతే కాకుండా వాటి పట్ల ఆకర్షితురాలైంది. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసింది. ''బదారుల్ మునీర్ హస్నుల్ జమాల్' చిత్రం షూటింగ్ లో భాగంగా కాలికట్ వచ్చాను. సినిమా సెట్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్నాను. తొలిసారి ఈ ఎక్స్‌పీరియన్స్ ఎంతో బాగా అనిపించింది. మత పరంగా ఎంతో రిచ్‌గా ఉంది. బ్యూటిఫుల్ ఫీలింగ్. నాకు ఎంతో నచ్చింది' అని సంజన పేర్కొన్నారు.

సంజన చెబుతున్న మాటలు బట్టి ఆమె కూడా మోనికా, యువన్ శంకర్ రాజా దారిలో నడుస్తుందా? ఇస్లాంలోకి కన్వర్ట్ అవుతుందా? అనేది చర్చనీయాంశం అయింది. ఈ విషయాలకు కాలమే సమాధానం చెప్పాలి.

English summary
A few South Indian stars like Monica, AR Rahman and Yuvan Shankar Raja have already been fascinated by Islam culture and principles. The latest star to join their bandwagon is none other than actress Sanjjanaa Archana, who is popular in Telugu, Kannada and Malayalam. The Bujjigadu actress says that she is very much influenced by the Muslim culture or tradition.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu