»   » ‘బాహుబలి’లో నటించనందుకు బాధగా ఉంది: నాగార్జున(పిక్చర్స్)

‘బాహుబలి’లో నటించనందుకు బాధగా ఉంది: నాగార్జున(పిక్చర్స్)

Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' చిత్రంలో నటించలేకపోయినందుకు బాధగా ఉందని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున అన్నారు. క్రాస్‌వర్డ్ బుక్‌స్టోర్‌లో ప్రముఖ భారతీయ-ఆంగ్ల రచయిత ఆనంద్ నీలకంఠన్ భారతీయ పురాణాల ఆధారంగా రాసిన ‘అజయ-2 రైజ్ ఆఫ్ కలి'ని సినీ నటులు అక్కినేని నాగార్జున, అమల ఆవిష్కరించారు.

అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు మైథాలజీ ఇష్టమన్నారు. బాహుబలిలో నటించలేకపోయినందుకు బాధగా ఉందన్నారు. ఆ నటులను చూసి జలసీగా ఫీలవుతున్నాని చెప్పారు.

బాహుబలి చిత్రం చాలా గొప్పగా ఉందని చెప్పారు. అందులో నటించిన వారందరూ నిజంగా అదృష్టవంతులని ఆయన అభినందించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ నటించిన పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టమని, అలాంటి పాత్రలు చేయాలని ఉన్నా.. అందుకు తగ్గ సందర్భం రావడం లేదని తెలిపారు. పురాణాలలో గొప్ప నీతి ఉందని, అది మానవాళికి ప్రతీ అడుగులో అవసరమన్నారు.

ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. పురాణాలలోని నీతిని ఆధునిక ధోరణిలో అందరికీ తెలియజేయడం నిజంగా కొత్త ఆలోచన అని అన్నారు. ఇటువంటి పుస్తకాలు పిల్లలు చదవాలన్నారు.

రచయిత నీలకంఠన్ మాట్లాడుతూ.. మొదటి బుక్ ఇక్కడ లాంచ్ చేశానని, పాఠకులు ప్రతి క్యారెక్టర్ అన్ని కోణాల్లోనూ చూడడం, చదవడం అలవర్చుకోవాల్సిన అవసరముందని అన్నారు. అప్పుడే మంచి చెడు అర్థమవుతాయని తెలిపారు. ఈ నవల ద్వారా దుర్యోధనుడిని అన్ని కోణాల్లో ఆవిష్కరించినట్టు పేర్కొన్నారు.

తన నవలలు సినిమాలుగా రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆ కోరికను తెలుగు సినిమానే నెరవేర్చగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన నవలల్లోని రావణ, దుర్యోధన క్యారెక్టర్లను నాగార్జున చేస్తే బాగుంటుందన్నారు.

పుస్తకావిష్కరణలో నాగార్జున-అమల

పుస్తకావిష్కరణలో నాగార్జున-అమల

‘బాహుబలి' చిత్రంలో నటించలేకపోయినందుకు బాధగా ఉందని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున అన్నారు.

పుస్తకావిష్కరణలో నాగార్జున-అమల

పుస్తకావిష్కరణలో నాగార్జున-అమల

క్రాస్‌వర్డ్ బుక్‌స్టోర్‌లో ప్రముఖ భారతీయ-ఆంగ్ల రచయిత ఆనంద్ నీలకంఠన్ భారతీయ పురాణాల ఆధారంగా రాసిన ‘అజయ-2 రైజ్ ఆఫ్ కలి'ని సినీ నటులు అక్కినేని నాగార్జున, అమల ఆవిష్కరించారు.

పుస్తకావిష్కరణలో నాగార్జున-అమల

పుస్తకావిష్కరణలో నాగార్జున-అమల

అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు మైథాలజీ ఇష్టమన్నారు. బాహుబలిలో నటించలేకపోయినందుకు బాధగా ఉందన్నారు. ఆ నటులను చూసి జలసీగా ఫీలవుతున్నాని చెప్పారు.

పుస్తకావిష్కరణలో నాగార్జున-అమల

పుస్తకావిష్కరణలో నాగార్జున-అమల

బాహుబలి చిత్రం చాలా గొప్పగా ఉందని చెప్పారు. ఆ చిత్రంలో నటించిన వారందరూ నిజంగా అదృష్టవంతులని ఆయన అభినందించారు.

English summary
Actor Akkineni Nagarjuna on Tuesday said that he was very sad for not acting in 'Bahubali'.
Please Wait while comments are loading...