»   » వారేమో చెప్పుతో కొడతామంటుంటే...ఈవిడ వర్మకు మద్దతిస్తోంది!

వారేమో చెప్పుతో కొడతామంటుంటే...ఈవిడ వర్మకు మద్దతిస్తోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఉమెన్స్ డే సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. వర్మపై విమర్శలు, పలు చోట్ల కేసులు కూడా నమెదయ్యాయి. మహిళాలోకం మొత్తం వర్మపై దుమ్మెత్తి బాలీవుడ్ ఐటం గర్ల రాఖీ సావంత్ మాత్రం వర్మకు తన మద్దతు ప్రకటించింది.

ఈ విషయమై రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ... 'రామ్ గోపాల్ వర్మ చెప్పింది కరెక్టే. సన్నీ లియోన్ మాదిరిగా మహిళలు ఆనందాన్ని పంచాలనే ఆయన వ్యాఖ్యలకు నేను మద్దతు ఇస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు మహిళలు ఆనందం ఎలా పంచాలో నేర్చుకోవాలి' అన్నారు.

కోచింగ్ తీసుకోవాలి

కోచింగ్ తీసుకోవాలి

మహిళలు తమ బాధ్యతగా వంటగది బాధ్యతలు నిర్వర్తించాలి. దీంతో పాటు ఆనందం పంచడం ఎలా? అనే విషయంలో కోచింగ్ క్లాసులకు వెళ్లాల్సిన అవసరం ఉందని అంటూ రాఖీ సావంత్ వ్యాఖ్యానించారు.

రాఖీ వెటకారంగా

రాఖీ వెటకారంగా

రాఖీ సావంత్ వర్మకు మద్దతుగా మాట్లాడినట్లు అనిపించినా... వెటకారంగానే ఆమె ఈ కామెంట్స్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఏది ఏమైనా వర్మపై ఓ రేంజిలో పేలుతుందనుకున్న ఈ ఐటం బాంబ్ ఇలా మాట్లాడటంతో అంతా ఆశ్యర్య పోయారు.

వర్మ చేసిన ట్వీట్ ఏమిటి?

వర్మ చేసిన ట్వీట్ ఏమిటి?

మహిళా దినోత్సవం నాడు మహిళలకు శుభాకాంక్షలంటూనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్లు చేశాడు. ఉమెన్స్ డే రోజున ప్రపంచంలోని మహిళలంతా సన్నీ లియోన్ లా సంతోషం పంచాలని కోరాడు. ఆ రోజున పురుషులంతా ఏం చేస్తారో తనకు తెలియదని, అయితే ఏడాదిలో ఒకరోజును మెన్స్ ఉమెన్స్ డే పాటించాలని అన్నాడు. మగవారందరి తరఫున మహిళలకు ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే చెబుతున్నానని వర్మ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.

పోలీసులకు ఫిర్యాదులు

పోలీసులకు ఫిర్యాదులు

వర్మ చేసిన అనుచిత ట్వీట్ పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయింది. మహిళల్నికించపరిచేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సన్ని పేరుతో వర్మ చేసిన వ్యాఖ్యలపై సామాజిక ఉద్యమకర్త విశాఖ మాంబ్రే గోవా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

వర్మ ను చెప్పులతో కొడతాం

వర్మ ను చెప్పులతో కొడతాం

వర్మ మహిళలపై చేసిన వ్యాఖ్యలకు వర్మ క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ నాయకురాలు విద్యా చవాన్ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే వర్మను చెప్పులతో కొడతామని తీవ్రంగా హెచ్చరించారు.,,మరోవైపు వర్మ సినిమాలకు పనిచేయకూడదని సినిమా సెట్టింగ్, దాని అనుబంధ కార్మికుల సంఘం నిర్ణయించింది. ఈ సంఘంలో 52 వేల మంది సినీ కార్మికులు ఉన్నారు.

చివరకు క్షమాపణ చెప్పిన వర్మ

చివరకు క్షమాపణ చెప్పిన వర్మ

తన కామెంట్ల మీద ఇంత గొడవ జరిగాక.... తాను చేసిన ట్వీట్లకు నిజంగా మనస్తాపం చెందిన వారికి తాను క్షమాపణలు చెబుతున్నట్లు వర్మ ట్వీట్‌ చేశారు.

English summary
Talking to the media, Rakhi said, "Whatever Ram Gopal Varma said is right. I am with him, where he has praised Sunny Leone. I would also like to say that every woman, as said by Ram Gopal Varma, should learn to give pleasure."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu