»   » వివి వినాయక్ ఇల్లును కొనేసిన యువ హీరో!

వివి వినాయక్ ఇల్లును కొనేసిన యువ హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఆర్థిక పరమైన ఇబ్బందులతో హైదరాబాద్ లోని తన ఇంటిని అమ్ముకున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వివి వినాయక్ దగ్గర నుండి ఇల్లును కొనుగోలు చేసింది ఎవరో తెలిసి పోయింది.

తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ మాదాపూర్ లోని వివి వినాయక్ కు చెందిన 4 బెడ్రూంల ఫ్లాట్ కొనుగోలు చేసాడు. ఈ ఇల్లంటే తనకు ఎంతో ఇష్టమని, ఏడేళ్లుగా తాను దాచుకున్న డబ్బుతో ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు. ఈ ఇల్లు మొదట్లో మా మావయ్యదే, తర్వాత దాన్ని ఆయన వినాయక్ గారికి అమ్మేసారు. ఏదో ఒకరోజు ఈ ఫ్లాట్ కొంటానని మామయ్యతో చిన్నతనంలో చెప్పాను అంటూ.... అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు సందీప్ కిషన్.

I bought VV Vinayak's house: Sundeep Kishan

సందీప్ కిషన్ సినిమాల వివరాల్లోకి వెళితే...
సందీప్ కిషన్ ప్రస్తుతం 'రన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై సుధాకర్‌ చెరుకూరి, కిషోర్‌ గరికపాటి, అజయ్ సుంకర నిర్మించారు. అని కన్నెగంటి దర్శకుడు. తమిళ చిత్రం 'నేరం' రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా మార్చి 23న విడుదలవుతుంది. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది.

సందీప్ కిషన్ మాట్లాడుతూ ''గత సంవత్సరం నేను గుడ్, బ్యాడ్ టైం చూసేశాను. చాలా నేర్చుకున్నాను. చాలా మారాను. రన్ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గొప్ప వ్యక్తులతో పనిచేసే అవకాశం వచ్చింది. అనీల్ సుంకరగారు ఎప్పుడూ నా వెల్ విషర్. నిర్మాతలు మంచితనానికి మారు పేరు. బాబీ ఫెంటాస్టిక్ యాక్టర్. తను గురించి నేను కొత్తగా చెప్పేదేం లేదు. అనీషా మంచి కో స్టార్. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. దర్శకుడు అని కన్నెగంటి సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడను. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

English summary
"This was my uncle's house. As a kid, I remember coming over here often and even telling my uncle, 'I will buy your apartment one day'. Later, my uncle sold this house to director VV Vinayak. Finally, three months ago, I bought this house from him," Sundeep Kishan reveals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu