»   » అందుకే భరత్ అంత్యక్రియలకు హాజరుకాలేదు.. రవితేజ.. జూనియర్ ఆర్టిస్టుతో తలకొరివి!

అందుకే భరత్ అంత్యక్రియలకు హాజరుకాలేదు.. రవితేజ.. జూనియర్ ఆర్టిస్టుతో తలకొరివి!

Written By:
Subscribe to Filmibeat Telugu

తన సోదరుడు భరత్ అంత్యక్రియలకు హాజరుకాలేను. చిధ్రమైన తన తమ్ముడి భౌతిక కాయాన్ని చివరి చూపు చూసి భరించలేను అని టాలీవుడ్‌ ప్రముఖ హీరో రవితేజ తన సన్నిహితులతో అన్నట్టు సమాచారం. రోడ్డు ప్రమాదంలో తన సోదరుడు భరత్ మరణించడంపై రవితేజ్, ఆయన కుటుుంబ సభ్యలు తీవ్ర షాక్ గురైనట్టు తెలుస్తున్నది. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ ఔటర్ రింగ్ రోడ్డులో ఆగి వున్న లారీని ఢీకొట్టిన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే.

30 ఏళ్ల అనుబంధం.. భావోద్వేగం..

30 ఏళ్ల అనుబంధం.. భావోద్వేగం..

తన తమ్ముడి భరత్‌తో 30 ఏళ్ల అనుబంధాన్ని రవితేజ ఈ సందర్భంగా గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురైనట్టు సమాచారం. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం భరత్‌ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ కూడా హాజరుకాలేదని తెలిసింది.

షాక్ గురైన కుటుంబం

షాక్ గురైన కుటుంబం

భరత్ మృతివార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. అంత్యక్రియలకు హాజరుకాలేం. తమ పరిస్థితిని అర్థం చేసుకోండి అని రవితేజ మీడియాను మిత్రులను కోరారు. దీంతో తొలుత ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన భరత్ భౌతిక కాయాన్ని అక్కడి నుంచి నేరుగా మహా ప్రస్థానానికి తరలించారు.

సోషల్ మీడియాలో చర్చ

సోషల్ మీడియాలో చర్చ

సినీనటుడు భరత్ అంత్యక్రియలకు ఆయన సోదరుడు రవితేజ సహా చాలా మంది కుటుంబీకులు హాజరుకాకపోవడంపై సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ప్రమాదంలో భరత్‌ ముఖం పూర్తిగా ఛిద్రమైపోయినందున అది చూసి మేం తట్టుకోలేమని, అందుకే అంత్యక్రియలకు రాలేనని రవితేజ ప్రకటించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌,కు బానిసై, కుటుంబ సభ్యుల మాటలను పెడచెవిన పెట్టడం వల్లే.. అందరూ ఉండికూడా భరత్‌ అనాధలా పోవాల్సివచ్చిందనే చర్చకూడా నడుస్తున్నది.

జూనియర్‌ ఆర్టిస్టుతో తలకొరివి!

జూనియర్‌ ఆర్టిస్టుతో తలకొరివి!

కుటుంబ సభ్యులెవరూ రాలేని పరిస్థితిలో భరత్‌ భౌతికకాయానికి ఓ జూనియర్‌ ఆర్టిస్టుచేత అంత్యక్రియలు జరిపించినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం అతనికి రూ.1500 ఇచ్చినట్లు, పిల్లల స్కూలు ఫీజుల కోసమే అతనా పని చేయడానికి ముందుకొచ్చినట్లు, ఈ విషయం జూనియర్‌ ఆర్టిస్టే స్వయంగా చెప్పినట్లు ప్రచారం సాగుతున్నది.

అంత్యక్రియల పర్యవేక్షించిన రఘు

అంత్యక్రియల పర్యవేక్షించిన రఘు

రవితేజ మూడో సోదరుడు రఘు అంత్యక్రియలను పర్యవేక్షించారు. అంత్యక్రియలకు నటులు ఉత్తేజ్, జీవిత రాజశేఖర్, ఆలీ, రఘుబాబు, కుటుంబ సభ్యులు, పలువురు సమీప బంధువులు, మిత్రులు మాత్రమే హాజరయ్యారు.

English summary
Actor Raviteja shocked with her brother's death. Actor Raviteja brother met accident on Outer Ring Road on Hyderabad. His family not attended the funeral become heavy discussion in social media. His another brother Raghu conducted furnerals with help of A junior Actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X