»   » వాళ్ళను ఆపను బ్రదర్..! పవన్ ఫ్యాన్స్ పై ధరమ్‌తేజ్

వాళ్ళను ఆపను బ్రదర్..! పవన్ ఫ్యాన్స్ పై ధరమ్‌తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈమధ్య కాలం లో మెగా ఫ్యామిలీ లో ఏ ఫంక్షన్ జరిగినా ఒకటే ఆలోచన, పవన్ ఫ్యాన్స్ ని ఎలా కంట్రోల్ చెయ్యాలీ అనే. ఏ సభ అయినా సరే వాళ్లకు అనవసరం పవర్ స్టార్ గురించి స్టేజ్ మీద వినబడాల్సిందే. లేదంటే అక్కడ రచ్చరచ్చే అది రామ్గోపాల్ వర్మ వంగ వీటి ఆడియో అయినా, చిరు 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, బన్నీ సక్సెస్ టూర్ అయినా ఎవరన్నదీ, ఏమిటన్నదీ వాళ్లకి అనవసరం వాళ్ళు ఎక్కువేమీ అడగరు కేవలం తమ అభిమాన నటుడి గురించి రెండు మాటలు చెప్తే చాలు కేరింతలు కొట్టేస్తారు.

 I Can't Stop Pawan Kalyan Fans Says Sai Dharam Tej

అక్కడివరకూ బాగానే ఉందిగానీ ప్రతీసభలోనూ అసలు సభజరగకుండా గోల చేయ్యటం ఎక్కువైపోతూండటం తో మెగా ఫ్యామిలీలో కూడా అసహనం పెరిగిందనే చెప్పాలి. అందుకే ఆమధ్య నాగబాబు చీవాట్లు పెట్టాడు, తర్వాత బన్నీ కూడా ఒక్కమాట చెప్పమని అరుస్తున్న పవన్ అభిమానులపై "చెప్పను" బ్రదర్ అంటూ వాళ్ళ ఈగోపై దెబ్బ కొట్టాడు అంతే అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు ఫ్యాన్స్. అయితే నాగబాబుని ఏమీ అనలెరు కాబట్టి బన్నీ ని ఏకేయటం మొస్దలు పెట్తారు పీకే ఫ్యాన్స్. దాదాపుగా సంవత్సరం కావస్తున్నా ఆ వివావదం ఇంకా రగులుతూనే ఉంది.

అయితే ఇదే సంధర్భం లో 'నాగబాబు, బన్నీ.. అలా అరుస్తున్నందుకు ఫ్యాన్స్‌కు క్లాస్‌ తీసుకున్నారుగా' అనే ప్రశ్న ఇటీవల సాయిధరమ్‌కు కూడా ఎదురైంది. దానికి సాయిధరమ్‌ స్పందిస్తూ.. 'ఎవరి అభిప్రాయం వారిది. వాళ్ల సిట్యువేషన్‌లోకి వెళ్లి నేను కామెంట్‌ చేయలేను. వారు అలా అంటే అనుండొచ్చు. నేను మాత్రం అలా అనలేను. నాకు మా ముగ్గురు మావయ్యలంటే ఎంతో ఇష్టం. నేను, మా అమ్మ, తమ్ముడు ఈ రోజు ఇలా ఉన్నామంటే దానికి వారు ముగ్గురే కారణమ'ని చెప్పాడు. ఎంతయినా "నొప్పింపక తానొవ్వక" అన్నట్టు తప్పించేసుకున్నాడు ధరమ్ తేజ్.

English summary
Both Naga Babu and Bunny have expressed their anger on fans in the past several times, but Sai Dharam says that it is their personal opinion and he can’t comment on the same. “I love my three uncles and they are the reason behind my success,” said Sai Dharam Tej.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu