twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ గారు దేవుడు, చెడు ప్రచారమే, ఏడ్చాను: నితిన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు హీరో నితిన్ నటించిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా టాక్ కూడా బాగానే ఉంది. ఈ నేపథ్యంలో నితిన్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

    ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు నితిన్ ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు. 'హార్ట్ ఎటాక్' సినిమాకు గుడ్ ఫీడ్ బ్యాక్ వస్తోందని, సినిమా కోసం ఎంటైర్ టీం మొత్తం కష్టపడి పని చేసామని, తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోందని నితిన్ చెప్పుకొచ్చారు. పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది, ఆయన ఎలాంటి టెన్షన్ లేకుండా అంతా ప్లానింగ్ ప్రచారం చేసుకుంటూ వెళతారని నితిన్ అన్నారు.

    'హార్ట్ ఎటాక్' విడుదలకు ముందు కొందరు సినిమాపై నెగెటివ్ ప్రాచారం చేసారని, ఇండస్ట్రీలో చెడు సంస్కృతి సాగుతోందని నితిన్ చెప్పుకొచ్చారు. అదే విధంగా తన దైవం పవన్ కళ్యాణ్ అంటూ ఆయన గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇంట్వ్యూ ఫోటోలు స్లైడ్ షోలో.....

    పవన్ కళ్యాణ్ నాకు దేవుడు లాంటి వారు...

    పవన్ కళ్యాణ్ నాకు దేవుడు లాంటి వారు...


    పవన్ కల్యాణ్ నాకు దేవుడు లాంటి వారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకునే నేను పరిశ్రమలోకి వచ్చాను. ఆయన్ను నేను మనస్ఫూర్తిగా ఆరాధిస్తాను. నా సినిమాల్లో ఏదో ఒక రకంగా ఆయన మార్కు ఉండేలా చూసుకుంటాను. నా గురించి ఆయనకు బాగా తెలుసు. అందు వల్ల ఆయన మరో రకంగా ఫీల్ కారు అంటూ....నితిన్ చెప్పుకొచ్చారు.

    విడుదలకు ముందు నెగెటివ్ ప్రచారం

    విడుదలకు ముందు నెగెటివ్ ప్రచారం


    సినిమా పరిశ్రమలో ఒక అన్‌హెల్దీ ట్రెండ్ నడుస్తోంది. కావాలనే కొందరు సినిమాలపై నెగెటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు. కేవలం నా సినిమాలకు మాత్రమే కాదు...ఇతర సినిమాలకు కూడా ఇలానే ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. రివ్యూలు రాసే వారికి కూడా నాది ఒకటే విజ్ఞప్తి. సినిమాపై జనాల జనరల్ ఒపీనియన్ ఏమిటో చెప్పండి. మీ ఫీలింగ్ రివ్యూల్లో రాయొద్దు. అలాంటివి ఏమైనా ఉంటే...సపరేట్‌గా బ్లాగులో రాసుకోండి అని నితిన్ అభిప్రాయ పడ్డారు.

    ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చాను

    ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చాను


    ‘సినిమా విడుదలకు ముందు చాలా మంది సినిమాపై నెగెటివ్‌గా ప్రచారం చేయడానికి ట్రై చేసారు. కానీ అవేమీ పని చేయలేదు. శాంతి థియేటర్లో సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడం స్వయంగా చూసాను. ఆ సమయంలో ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చాను. పూరిగారిని హగ్ చేసుకున్నాను. ఆ రెస్పాన్స్ చూసాక ఆయన కూడా ఎమోషన్ అయ్యారు' అని నితిన్ వెల్లడించారు.

    రెమ్యూనరేషన్ పెంచాడనే వార్తలపై ఇలా...

    రెమ్యూనరేషన్ పెంచాడనే వార్తలపై ఇలా...


    వరుస హిట్లతో నితిన్ రెమ్యూనరేషన్ పెంచారనే వార్త తెరపైకి వచ్చింది. దీనిపై నితిన్ స్పందిస్తూ....ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలు మా సొంత బేనర్లో చేసాం. కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా నేను ఎంతగానో ఇష్టపడే గౌతం మీనన్ గారి బేనర్లో చేస్తున్నాను. పూరి జగన్నాథ్ బ్యానర్ కూడా నా సొంత బేనర్ లాంటిదే. నా తర్వాతి రెండు సినిమాలు కూడా సొంత బేనర్లోనే చేస్తున్నాను. అలాంటపుడు రెమ్యూనరేషన్ పెంచాననే ప్రశ్న ఎక్కడిది? అంటూ వ్యాఖ్యానించాడు నితిన్.

    కొరియర్ బాయ్ కళ్యాణ్ గురించి...

    కొరియర్ బాయ్ కళ్యాణ్ గురించి...


    కొరియర్ బాయ్ కళ్యాణ్ మూవీ తెలుగు వెర్షన్ టాకీ పార్టు పూర్తయింది. ఒక సాంగు బ్యాలెన్స్ ఉంది. తమిళ వెర్షన్ షూటింగ్ జరుగుతోందని నితిన్ తెలిపారు.

    తర్వాతి సినిమాలు...

    తర్వాతి సినిమాలు...


    తర్వాతి సినిమాల కరుణాకరణ్ దర్శకత్వంలో ఒకటి, సురేందర్ రెడ్డి అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో మరొకటి చేస్తున్నట్లు నితిన్ తెలిపారు. శ్రీనివాసరెడ్డితో చేయబోయే సినిమా ఫిబ్రవరి 9న ప్రారంభమవుతుందని, కరుణాకరన్ మూవీ మార్చి పస్ట్ వీక్‌లో ప్రారంభం అవుతుందని తెలిపారు.

    English summary
    "Right from my earliest films, Pawan Kalyan references can be found. Because of the recent big hits, people are noticing it now. Pawan Kalyan is like a God for me in films and I deeply admire him. Including him in someway or the other is my way of showing my admiration. Pawan Kalyan garu also knows how much I admire him, so he does not feel bad" Nitin told about Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X