twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పదేళ్ల వయసు వరకు నాన్నని చూడలేదు.. ఇంకెవరు చేసినా ఒప్పుకునేవాడిని కాదు.. కళ్యాణ్ రామ్!

    |

    స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ మొత్తం ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. ఈ చిత్రం కోసం బాలయ్య వినూత్నంగా ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన నటీనటులంతా ఒక చోట చేరి ఎన్టీఆర్ బయోపిక్ అనుభవాల్ని పంచుకుంటున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, రానా, దర్శకుడు క్రిష్, బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి ఆసక్తికర విశేషాలు తెలిపారు.

    2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!

    నన్ను పరిచయం చేసింది బాబాయే

    నన్ను పరిచయం చేసింది బాబాయే

    కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది బాబాయే అని తెలిపాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత బాబాయ్ నిర్మాణంలో నటిస్తున్నానని తెలిపాడు. దర్శకుడు క్రిష్ తనకు మూడున్నర గంటల పాటు ఈ చిత్ర కథ వివరించారని కళ్యాణ్ రామ్ తెలిపారు. మా నాన్న 20 ఏళ్ల వయసులో ఎలా ఉన్నారో నాకు తెలియదు. నాన్నగారి పాత్ర కోసం అవసరమైన అన్ని సలహాలు బాబాయ్ ఇచ్చారని బాలకృష్ణ తెలిపాడు.

    ఒప్పుకునేవాడిని కాదు

    ఒప్పుకునేవాడిని కాదు

    ఎన్టీఆర్ బయోపిక్ లో బాబాయ్ నటిస్తూ, నిర్మిస్తూ చాలా పెద్ద భాద్యత భుజాలపైకి ఎత్తుకున్నారు. ఎందుకంటే ఆయన చేస్తోంది తెలుగువారిని ప్రభావితం చేసిన ఎన్టీఆర్ చరిత్రని అని కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఈ చిత్రాన్ని ఇంకెవరు నిర్మించినా ఒప్పుకునేవాడిని కాదు. బాబాయ్ నిర్మిస్తున్నారు..నాకు సంతోషం. ఈ లోగా బాలయ్య కల్పించుకుని నాన్నగారి ఒరా వచ్చింది అన్నయ్య హరికృష్ణకు మాత్రమే. ముక్కుసూటి తనం, ఎలాంటి పని అయినా లాభనష్టాలు చూసుకోకుండా ముందుకు వెల్ళడం లాంటి గుణాలు అన్నయ్యకు వచ్చాయని బాలయ్య తెలిపారు.

    ఎన్టీఆర్ బయోపిక్: వెంకటేశ్వరస్వామిగా బాలయ్య న్యూ పోస్టర్ఎన్టీఆర్ బయోపిక్: వెంకటేశ్వరస్వామిగా బాలయ్య న్యూ పోస్టర్

    నాన్నని చూడలేదు

    నాన్నని చూడలేదు

    కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తాను నాన్నని 10ఏళ్ల వయసు వరకు సరిగా చూడలేదని తెలిపారు. నాన్న ఎప్పుడూ వాళ్ళ నాన్నతోనే తిరిగేవారు. ఉదయం 3 గంటలకు వెళితే.. రాత్రి 10 గంటలకు తిరిగొచ్చేవారు. నేను 8గంటలకే నిద్రపోయావాడిని అని కళ్యాణ్ రామ్ తెలిపాడు. నాన్నగారి అంత గాంభీర్యమైన రూపం నాది కాదు. కానీ నాపై క్రిష్ నమ్మకం ఉంచాడు అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

    ఆ సీన్ కోసం వెయిటింగ్

    ఆ సీన్ కోసం వెయిటింగ్

    క్రిష్ మాట్లాడుతూ.. ఈ చిత్రం చేసే సమయంలో సుమంత్ లో ఉత్సహం చూశా. సుమంత్ నాతో ఎప్పుడూ అంటుండేవాడు. క్రిష్ నేను దివిసీమ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రా సాగే ఆ సీన్ చాలా బావుంటుందని క్రిష్ తెలిపాడు. ఎన్టీఆర్ లో ఒక తెలియని అమాయకత్వం ఉంటుంది. నిమ్మకూరులో ఉండే సాధారణ వ్యక్తిగా, అమాయకుడిగా ఉన్న ఎన్టీఆర్ తెలుగు జాతి మొత్తం గర్వపడే కథానాయకుడిగా, మహా నాయకుడిగా ఎలా మారాడు అనేది ఈ చిత్రంలో చూస్తారని క్రిష్ తెలిపారు.

    చంద్రబాబుకు టెన్షన్

    చంద్రబాబుకు టెన్షన్

    బాలయ్య మాట్లాడుతూ.. చాలా మంది నటులు వాళ్ళు పోషించిన పాత్రలే పేర్లుగా మారిపోయాయి. ఈ చిత్రంలో కూడా చాలా మందికి అదే పరిస్థితి ఉంటుందని బాలయ్య అన్నారు. గడ్డంతో ఉంటే రానా.. తీసేస్తే చంద్రబాబు అని బాలయ్య చమత్కరించారు. గడ్డం తీసేయమ్మా అంటూ బాలయ్య సరదాగా అన్నారు. గడ్డం తీయడానికి నాకేం అభ్యంతరం లేదు.. కానీ చంద్రబాబు టెన్షన్ పడుతారు అంటూ రానా సరదాగా వ్యాఖ్యానించాడు.

    English summary
    I did not seen much my father till 10 years old says Kalyan Ram. NTR Kathanayakudu releasing Jan 9th world wide
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X