»   » నేను దేవున్ని నమ్మను: కమల్ హాసన్

నేను దేవున్ని నమ్మను: కమల్ హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘చీకటి రాజ్యం' సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్ మీడియాకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రాజేష్ సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో నవంబర్ 20న విడుదలువుతోంది. వాస్వానికి నవంబర్ 12న విడుదల కావాల్సి ఉన్నా.... ‘అఖిల్' మూవీ విడుదల నేపథ్యంలో నాగార్జున విజ్ఞప్తి మేరకు వాయిదా వేసారు.

ఇంటర్వ్యూలో ఆయనకు వివిధ అంశాల గురించి ప్రస్తావించారు. తక్కువ టైమ్‌లో నాణ్యమైన చిత్రాల్ని చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా సినిమాలు చేస్తున్నాను. దర్శకత్వంపై దృష్టిపెడితే నటనకు పూర్తిగా న్యాయం చేయలేమోనని ప్రస్తుతం డైరెక్షన్‌కు దూరంగా వుంటున్నాను అన్నారు.

అందరూ అనుకుంటున్నట్లుగా రీమేక్ కథల్ని తెరకెక్కించడం అంత సులభమైన విషయం కాదు. అందరికీ తెలిసిన కథని అర్థవంతంగా ఆవిష్కరించాలంటే మరింత శ్రమ పడాల్సివుంటుంది. జేమ్స్‌బాండ్ సినిమాను రీమేక్‌గా ఎంచుకొని దాని ఒరిజినల్ మ్యాజిక్‌ను రిపీట్ చేయడం సాధ్యమయ్యే పనికాదు అన్నారు.

I do not believe in God: Kamal Haasan

నేను దేవుణ్ణి నమ్మను. అందుకే పౌరాణిక చిత్రాలపై మొదటి నుంచి ఆసక్తిని పెంచుకోలేదు. రామాయణ కథతో లంకేశ్వర చిత్రాన్ని తీయాలని ఒకప్పుడు అనుకున్నాను. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు అన్నారు. త్వరలో ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రాన్ని చేయబోతున్నాను. ఈ చిత్రానికి రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం అన్నారు.

డబ్బు సంపాదించడానికి, ప్రతిభను పెంపొదించుకోవడానికి, విజయాన్ని సాధించడానికి షార్ట్‌కట్‌లు లేవు. సుదూరమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సివుంటుంది. దగ్గరి దారులు వెతుక్కుంటే లక్ష్యం కనుమరుగయ్యే ప్రమాదం వుంటుంది.

సినిమాలకు భాషా భేదాలు వుండకూడదు. జాతీయ స్థాయిలో సినిమాలకు ఒకేరకమైన విధి విధానాలుండాలి. నేషనల్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను మేఘాలయాలో నెలకొల్పి అన్ని ప్రాంతాల వారికి శిక్షణ ఇవ్వాలి. అప్పుడే ఒక భాష వారు మరొక భాషా చిత్రాల్ని రూపొందించవచ్చు. తెలంగాణవారు తమిళ చిత్రాల్ని, ఒరిస్సా వారు తమిళ చిత్రాల్ని తీసే వెసులుబాటు లభిస్తుంది.

English summary
'I do not believe in God' said actor Kamal Haasan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu