»   »  గ్రామాల దత్తత ఇష్యూ: తన వద్ద డబ్బుల్లేవన్న రామ్ చరణ్!

గ్రామాల దత్తత ఇష్యూ: తన వద్ద డబ్బుల్లేవన్న రామ్ చరణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీమంతుడు సినిమా విడుదలైన దగ్గర నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పలువురు స్టార్లు గ్రామాలను దత్తత తీసుకునే కాన్సెప్టును ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ను అడిగితే డబ్బులేవంటూ సమాధానం ఇచ్చారు.

మీరు కూడా ఏదైనా గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటారా..? అని అడిగితే...డ‌బ్బులు బాగా సంపాదించాక....అప్పుడు ఏదైనా గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని చెప్పాడు చ‌ర‌ణ్‌. ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూ చేతి నిండా సంపాదిస్తునప్న చెర్రీ, మరో వైపు వివిధ వ్యాపారాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో చిరంజీవి 150వ సినిమాను కూడా నిర్మించబోతున్నాడు రామ్ చరణ్....... మరి రామ్ చరణ్ నుండి ఇలాంటి సమాధానం రావడం ఆశ్చర్య కరమే మరి.

I do not have a lot of money: Ram Charan

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా విషయానికొస్తే ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రూస్ లీ'. బ్రూస్ లీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ దాదాపు 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది.

రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
"I do not have a lot of money" Ram Charan said about adopt villages.
Please Wait while comments are loading...