»   » మా కుక్క కూడా నన్ను అలా అనుకోదు: స్టార్ హీరో సంచలన కామెంట్

మా కుక్క కూడా నన్ను అలా అనుకోదు: స్టార్ హీరో సంచలన కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ టాప్ స్టార్ షారుక్ ఖాన్ తనను 'గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును బహూకరించిన అనంతరం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆదివారం జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో షారుక్ కు గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించారు.

ప్రస్తుతం షారుక్‌ ఖాన్ తన మూవీ షూటింగ్‌ నిమిత్తం బుడాపెస్ట్‌లో ఉండటం వల్ల ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకకు హాజరు కాలేక పోయారు. అయితే తనకు ఈ అవార్డు ఇవ్వడంపై షారుక్ తనదైన రీతిలో స్పందించారు.

బుడాపెస్ట్ నుండి వీడియో

ఫిల్మ్ ఫేర్ అవార్డులకు హాజరు కాకపోయినా...బుడాపెస్ట్‌ నుండే సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో పోస్టు చేసారు. ఐకాన్‌ అవార్డు అందుకోవడంపై తన అభిప్రాయాలు వెల్లడిస్తూ వీడియో పోస్ట్‌ చేశారు.

కృతజ్ఞతలు చెబుతూనే...

గ్లోబల్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో నన్ను గౌరవించినందుకు అందరికీ కృతజ్ఞతల అంటూనే... నేను ఓ ఐకాన్‌నని అనుకోవడం లేదు. ఎందుకంటే నా స్నేహితులు, మా ఇంట్లో వారు నన్నుఅలా అనుకోరు అంటూ కామెంట్ చేసారు.

మా ఇంట్లో కుక్క కూడా...

మా ఇంట్లో కుక్క కూడా...

అంతెందుకు మా ఇంట్లో ఉండే కుక్క కూడా నన్ను ఐకాన్‌ అనుకోదు..... అంటూ షారుక్ ఖాన్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

ఐకాన్స్ అంటే....వారు

ఐకాన్స్ అంటే....వారు

ఐకాన్‌ అంటే నేను కాదు. మహ్మద్‌ అలీ, అమితాబ్‌ బచ్చన్‌, మిల్కా సింగ్‌, మైఖెల్‌ జాక్సన్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎందరో ఉన్నారు. నేను ఐకాన్‌ అనే పదానికి సరిపోతాను అనుకోవడంలేదు. నేను నా జీవితంలో ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని కష్టపడ్డాను అని తెలిపారు.

English summary
"I don't think I AM an icon because my dog doesn't think I'm an icon" Shah Rukh Khan responds about his Filmfare award.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu