»   » నో రిటైర్మెంట్, బిగ్'బి' బాటలో నడుస్తా: నాగార్జున

నో రిటైర్మెంట్, బిగ్'బి' బాటలో నడుస్తా: నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: రిటైర్మెంట్ గురించిన ఆలోచన అసలు తనకు లేదని టాలీవుడ్ మన్మదుడు అక్కినేని నాగార్జున స్పష్టం చేసారు. అమితాబ్ బచ్చన్‌లా వేర్వేరు పాత్రల్లో నటించాలనేదే తన లక్ష్యమని తెలిపారు. హీరోగా పూర్తి భారం మోయాల్సిన అవసరం లేనప్పుడు అమితాబ్ చేస్తున్నట్లుగా ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తాననని నాగార్జున తెలిపారు.

మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమే అని నాగార్జున వెల్లడించారు. వంద సినిమాలకు దగ్గరవుతున్నాను, కెరీర్లో ఇన్ని సినిమాలు చేస్తాననుకోలేదని వ్యాఖ్యానించారు. రోజూ వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం, బాగా నీళ్లు తాగడమే నా ఆరోగ్య రహస్యమని నాగార్జున వెల్లడించారు.

కండలు పెంచాలంటే ఒళ్లు అలిసిపోయేలా కసరత్తులు అవసరం లేదని...ప్రతి క్రమం తప్పకుండా రోజూ గంట సేపు వ్యాయామం చేస్తే సరిపోతుందని, తాను 25 ఏళ్లుగా నుంచి చేస్తున్నానని తెలిపారు. కడుపు మాడ్చుకునే డైటింగులు చేయనని నాగార్జున స్ఫష్టం చేసారు.

ప్రస్తుతం నాగార్జున నటించిన 'భాయ్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జునే నిర్మిస్తున్నారు. రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary

 "I don't think I will ever retire, but gradually like Amitji (Amitabh Bachchan), I will think of doing different kinds of roles. I will slowly start taking up roles where I don't have to singlehandedly take the burden of a film on my shoulders like I'm doing now as a hero," Nagarjuna told to IANS.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu