»   » మతాభిమానులు నాకొద్దు : సల్మాన్ సంచలన వ్యాఖ్య

మతాభిమానులు నాకొద్దు : సల్మాన్ సంచలన వ్యాఖ్య

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సంచనల వ్యాఖ్యలు చేసారు. మతాన్ని చూసి అభిమానించే ఫ్యాన్స్ నాకొద్దు అంటూ తేల్చి చెప్పారు. బాలీవుడ్ చరిత్రలో ఒక స్టార్ హీరో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. సల్మాన్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం వెనక పెద్ద కారణమే ఉంది.

  ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ 'జై హో' చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి రోజు అతితక్కువ ఓపెనింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. సినీ విశ్లేషకులు కోమల్ నహ్తా సినిమాకు ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడంపై ట్విట్టర్లో స్పందిస్తూ.....'సల్మాన్ ఖాన్ మోడీని కలవడం, మోడీని పొగుడుతూ కామెంట్స్ చేయడం సల్మాన్ ఖాన్‌ను అభిమానించే ముస్లిం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. 'జై హో' ఓపెన్సింగ్స్ పరిశీలిస్తే సల్మాన్ ముస్లిం ఫ్యాన్స్ అంతా 'జై హో'చిత్రాన్ని బహిష్కరించినట్లు స్పష్టమవుతోంది' అని ట్వీట్ చేసారు.

  I Don't Want Communal Fans: Salman Khan

  'జై హో' మూవీ విడుదలకు కొన్ని రోజుల ముందు సల్మాన్ ఖాన్...గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలవడంతో పాటు, ఆయన గ్రేట్ మ్యాన్ అంటూ పొగిడిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ మెడీ గురించి అలా మాట్లాడటం నచ్చలేదు. ముఖ్యంగా పలువురు ముస్లిం ఫ్యాన్స్ సల్మాన్ చర్యను ఎండగట్టారు. ఆయన సినిమాలను బహిష్కరించాలని పలువురు ముస్లిం నేతలు కూడా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

  అయితే సల్మాన్ ఖాన్ మాత్రం....కోమల్ నహ్తా వాదనతో ఏకీభవించడం లేదు. 'ఓపెనింగ్స్ తక్కువగా రావడానికి కారణం అది కాదు...అయినా ఇలాంటి ప్రచారం చేయడం మంచిది కాదు' అని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. 'అభిమానులకు సినిమా నచ్చలేదు. సినిమాలోని కంటెంట్ నచ్చలేదు. కానీ ఇలాంటి (కోమల్ నహ్తా చెప్పినట్లుగా) వాదన తెరపైకి తేవడం మంచిది కాదు. అది పూర్తిగా తప్పుడు వాదనే' అని సల్మాన్ ఖాన్ స్పష్టం చేసారు.

  'సినిమా ఇండస్ట్రీలో హిందూ, మిస్లిం, సిక్, క్రిస్ట్రియన్ లాంటి బేధాలు ఉండవు. అంతా ఒకటే. మనసున్న మనుషులం. వినోదం పంచడమే మా కర్తవ్యం. అయినా ఇలాంటి పనికిమాలిన కారణాలతో అభిమానులు నా సినిమా చూడరు అని నేను అనుకోను. వారికి సినిమా నచ్చక పోవడం వల్లనే ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదని నేను భావిస్తున్నాను. ఒక వేళ అలాంటి కారణం(మతపరమైన) ఉండి ఉంటే....అలాంటి అభిమానులు నాకు అవసరం లేదు' అని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

  English summary
  Salman Khan made it very clear- he doesn't want to be surrounded by people who have timid, oppressive, phobic minds. In a bold statement, he clarified that he doesn't need fans who think on communal ground. This could be boldest opinion any star would have made in the history of Bollywood films.Instead of mending his ways to make a deal with the corrupt, Salman took a remarkable stand.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more