»   » షాక్....‘మెగా’ ఇమేజ్ వద్దంటున్న మెగాఫ్యామిలీ హీరో

షాక్....‘మెగా’ ఇమేజ్ వద్దంటున్న మెగాఫ్యామిలీ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఇమేజ్.... దీనికి ఉన్న పవర్ ఏమిటో, సత్తా ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇమేజ్ ఉంటే చాలా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టడం చాలా ఈజీ. కొత్త హీరో అయినా ఓపెన్సింగ్స్ అదిరిపోతాయి. మెగా ఫ్యామిలీ నుండి పరిచయం అయ్యే హీరోలందరికీ ఇది వర్తిస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం తనకు ఈ ‘మెగా' ఇమేజ్ వద్దంటున్నాడు.

మెగా ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ ని అడ్డం పెట్టుకుని తాను పైకి రావాలనుకోవడం లేదని, సొంత గుర్తింపు తెచ్చుకుంటానని అంటున్నాడు. మెగా ఫ్యామిలీకి చెందిన వాడిని కావడం వల్లే తనకు అవకాశాలు వస్తున్నాయనేది నిజమే అయినప్పటికీ, తన పనిని బట్టే ప్రేక్షకులు ఆదరిస్తారని, నటన విషయంలో న్యాయ నిర్ణేతలు వారేనని అన్నారు.


త్వరలో సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే 'పిల్లా నువ్వు లేని జీవితం', ‘రేయ్' సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ కొత్తగా కనిపించనున్నారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని మాటీవి వారు 3.75 కోట్లకు కొనుగోలు చేసారు. ఇప్పటికే రిలీజైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


I don't want Mega family image: Sai Dharam Tej

సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పూర్తి కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాయికి మరో హిట్ అందిస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.


సాయిధరమ్‌తేజ్‌. సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్‌, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్ర్కీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌ శంకర్‌ ఎస్‌.

English summary
"I am not trying to blend in to mega family" said Sai Dharam Tej.
Please Wait while comments are loading...