»   »  అలా అంటే పట్టించుకోను.. దీపికా పదుకొనే

అలా అంటే పట్టించుకోను.. దీపికా పదుకొనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో అత్యధికంగా పారితోషికం తీసుకొనే నటి అని అంటే చాలా గర్వంగా ఉంటుందని దీపికా పదుకొనే అంటున్నారు. అలా పిలువడం వల్ల తాను ఇబ్బంది పడనని తెలిపారు. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోయిన్ అని పిలిస్తే గర్వంగా ఫీల్ అవుతానని పేర్కొన్నారు.

బాక్సాఫీస్ వద్ద తన చిత్రాలు ఘనవిజయం సాధించడానికి అది ప్రతిఫలమని భావిస్తూ ఉంటానని, ఆ ఘనత తన ఒక్కరికే కాదని, ప్రతీ మహిళకు చెందుతుందని అన్నారు.

 I feel proud that people call me the highest paid actress in Hindi films, says Deepika Padukone

కేవలం సినీ పరిశ్రమలో తాను ఒక్కరినే అత్యధికంగా పారితోషికం తీసుకోవడం లేదని, ఇతర రంగాల్లో కూడా తనకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సాధించిన కీర్తితో సంతృప్తి చెందడం లేదని, ఇంకా సాధించాల్సి ఎంతో ఉందని ఆమె అన్నారు.

ఇటీవల వరుస విజయాలతో దూసుకెళ్తున్న దీపికా పదుకొనే ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావతిలో రణ్‌వీర్‌సింగ్, షాహీద్ కపూర్ సరసన నటిస్తున్నది.

English summary
Deepika Padukone said that The reason I hold the title of the highest paid actresses is because I'm able to deliver at the box-office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu