Just In
- 30 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 35 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్‌తో చేసే అర్హత లేదు, గుడ్డిగా ఫాలోయింగే..
హైదరాబాద్ : సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి 'ఎస్ఎంఎస్' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన సుధీర్ బాబు తాజాగా 'ప్రేమకథా చిత్రమ్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కెమెరామెన్ జె.ప్రభాకర్‌రెడ్డి తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ ఆర్.పి.ఎ. క్రియేషన్స్, మారుతీ టాకీస్ పతాకంపై సుదర్శన్‌రెడ్డి, మారుతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందిత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 7న విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను వెల్లడించారు. యువతీ యువకులు ప్రేమలో మోసమోయి, ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఈ కథ సరికొత్తగా మారుతుందని, నలుగురు వ్యక్తుల మధ్య జరిగే ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉందని, ఓ మంచి కథనంతో దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరికీ నచ్చుతుందని ఆయన తెలిపారు.
ఓ ప్రశ్నకు స్పందిస్తూ....'కృష్ణ, మహేష్‌బాబుతో కలసి నటించే అవకాశం వస్తే నా అంత అదృష్టవంతులు ఎవరూ లేరని, ఓ మంచి కథ దొరికితే తప్పక చేస్తానని, అసలు మహేష్‌బాబుతో నటించే అర్హత ఉండాలని, ప్రస్తుతం నాకు అది లేదనే అనుకుంటున్నాను అన్నారు.
మహేష్‌బాబు ఎంతో కష్టపడి స్టార్‌డమ్ సాధించిన హీరో అని, తను హీరోగా పరిచయమైన సమయంలో కృష్ణగారు సినిమాలు చేయడంలేదని తెలిపారు. ఏ చిత్రానికైనా కృష్ణ జడ్జిమెంట్ వందశాతం ఖచ్చితంగా ఉంటుందని, తన భార్య కూడా చిన్నప్పటినుండి సినిమా వాతావరణం చూసిన వ్యక్తి కనుక పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఆమె చెప్పిన విషయాలు నచ్చుతాయని, తాను కచ్చితంగా ఏ చిత్రం ఎలా ఉంటుందో అంచనా వేయగలదని తెలిపారు.
నేను మహేష్ బాబు స్ట్రాటజీని గుడ్డిగా ఫాలో అవుతాను. మహేష్ బాబు కెరీర్ మొదట్లో ఆయన కొన్ని తరహా కథలని, పాత్రలని మాత్రమే ఎంచుకునే వారు. ఎప్పుడైతే ఆయన అలా చేయడం మానేశారో అప్పుడే ఆయనకు అసలైన సక్సెస్ వచ్చింది. ఇప్పుడు ఆయన ప్రతి కథ వింటున్నారు, వాటిల్లో నుంచి బెస్ట్ కథల్ని ఎంచుకుంటున్నారు. నేను కూడా ఇంచు మించు ఆయనలానే చేస్తున్నాను. సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు అభిమానులకు కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయని, ద్వితీయ చిత్రంగా తాను నటించిన ఈ చిత్రం విజయవంతవౌతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు.