»   » నా పరిస్థితి దారుణం, వారి పరిస్థితి ఏంటో?...వరదలపై సిద్ధార్థ్

నా పరిస్థితి దారుణం, వారి పరిస్థితి ఏంటో?...వరదలపై సిద్ధార్థ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తమిళనాడు రాష్టం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజధాని నగరం చెన్నై పూర్తిగా నీట మునిగింది. ఇళ్లలోకి భారీ నీరు చేరడంతో వందల కాలనీల్లో జనం నిరాశ్రయులయ్యారు. తీవ్రంగా నష్టపోయారు. వరదబాధితుల్లో సినీ స్టార్లు సైతం ఉన్నారు.

ఈ విషయమై సిద్ధార్థ్ మీడియాతో మాట్లాడుతూ... భారీ వరదల కారణంగా నేను నా గూడు కోల్పోయాను. మూడు స్టూడియోలు, మూడు కార్లు వరదల్లో పాడైపోయాయి. ఇంట్లో నీరు నిలవడంతో ఆరు రోజులుగా ఇంటికి దూరంగానే ఉంటున్నాను. నా పరిస్థితే ఇలా ఉంటే సాధారణ జనం ఇంకా ఎన్నిఇబ్బందులు పడ్డారో, ఎంత నష్టపోయారో అర్థం చేసుకోవచ్చు అన్నారు.

 I had lost my house for the first time: Actor Siddharth

వరద బాధితులకు సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు రావడంపై ఆనందం వ్యక్తం చేసాడు. సోషల్ మీడియా ద్వారా చెన్నై వరద బాధితులకు చాలా హెల్ప్ జరిగింది. వరద బాధితులకు సహాయం అంద చేస్తున్న వారందరికీ సిద్ధార్త్ థాంక్స్ చెప్పారు.

ప్రస్తుతం చెన్నై పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. నగరం మళ్లీ మునుపటి స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందన్నారు. అయితే నగరాన్ని వాస్తవారిని విరుద్దంగా... మరింత భయంకరంగా సోషల్ మీడియాలో చూపించే ప్రయత్నం చేయవద్దని సిద్ధార్థ్ వేడుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికైనా వెంటనే పరిస్థితి సరిదిద్దడం సాధ్యం కాదు. ప్రస్తుతం ప్రభుత్వం తన వల్ల అయినంత సహాయం చేస్తోంది అన్నారు.

English summary
The floods in Tamil Nadu were of "epic proportions" and he had reached out on behalf of the less fortunate on Twitter as he had "freaked out" after losing his home "for the first time in life," actor Siddharth told NDTV in an interview today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu