»   » నమ్మి మోసపోయా..అరెస్ట్ చేయాలంటూ నమిత

నమ్మి మోసపోయా..అరెస్ట్ చేయాలంటూ నమిత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు హాట్ హీరోయిన్ గా వెలిగిన బొద్దుగుమ్మ నమిత. ఈ మధ్య కాలంలో ఆమెకు అవకాశాలు అనేవి రాకుండా పోయాయి. దాంతో చాలా ఇబ్బందుల్లో ఉన్న నమితను రీసెంట్ గా ఓ ఈవెంట్ మేనేజర్ మోసం చేసారు. దాంతో ఆమె బాధతో ఈ విషయాన్ని మీడియాకు తెలియచేసింది. ఆ మేనేజర్ ని అరెస్ట్ చేయాలంటోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నమిత వెర్షన్ ఏమిటంటే... రీసెంట్ గ నన్ను ఓ ఈవెంట్ మేనేజర్ మోసం చేశాడు.. ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇస్తానని ఒప్పుకున్న సొమ్మును ఇవ్వకుండా ముఖం చాటేశాడు. ఇటీవల సూరత్‌లో జరిగిన ఓ వేడుకలో ప్రత్యేకంగా నర్తించి అక్కడి ఆహుతుల్ని అలరించాను.

ఈ కార్యక్రమానికి మేనేజర్‌గా వ్యవహరించిన ఓ వ్యక్తి ఇందులో పాల్గొనాలంటూ నన్ను కొద్ది రోజుల క్రితం సంప్రదించాడు. దీని కోసం నాకు పెద్దమొత్తంలో పారితోషికాన్ని ఆఫర్ చేశాడు. గతంలో ఇలాంటి పలు కార్యక్రమాల్ని సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి కావటంతో అతడి ఆఫర్‌కు వెంటనే అంగీకారం తెలిపాను.

 I Have Been Cheated': Namita

ఇందులో పాల్గొనడం కోసం కొన్నాళ్ల పాటు నృత్యాల్లో ప్రత్యేక శిక్షణను కూడా తీసుకొని మరి ఈ వేడుకలో పాల్గ్గొన్నాను. అయితే కార్యక్రమం పూర్తయిన తర్వాత నాకు ఇస్తానని చెప్పిన రెమ్యునరేషన్‌లో కొంత మొత్తాన్ని చెల్లించిన అతడు ఆపై ముఖం చాటేశాడు. ఫోన్‌లో కూడా అందుబాటులో లేకపోవటంతో నమ్మి మోసపోయానని తెలుసుకున్నాను.

త్వరలో పోలీసులను ఆశ్రయించి అతనికి తగిన బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అని తెలిపింది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు లేక సినిమాలకు దూరమైన ఈ అమ్మడు మేనేజర్ మోసంతో మరింత ఇబ్బందుల్లో పడిందని తమిళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఇంతకుముందు కొద్ది కాలం క్రితం సైతం నమితకు ..కొంచెం అటూ ఇటూలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ సంఘటన నమిత అంటే ఇప్పటికీ ప్రేక్షకులకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని ప్రూవ్ చేసింది. ఈ విషయాన్ని నిరూపిస్తూ ఇటీవల తమిళనాడులో ఓ సంఘటన జరిగింది. బుల్లితెరలో పలు ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు నమితను ఆహ్వానిస్తూనే ఉన్నారు.

ఓ నాటక సమాజంవారు ఉత్సాహంతో ఆమెను అతిథిగా పిలవగా వచ్చిన అభిమానుల వీరంగంతో స్టేజి కూలిపోవడంతో భయపడిన నమిత అక్కడనుంచి ఇంటి ముఖం పట్టింది. తాజాగా ఆట-పాట లాంటి ఓ కార్యక్రమంలో నమిత పాల్గొననుందని ప్రకటించారు. 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమం రాత్రి 10 గంటలకు కూడా మొదలుకాలేదు.

 I Have Been Cheated': Namita

చివరికి నమిత అనారోగ్య కారణంగా ఈ కార్యక్రమానికి రావడం లేదని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో నమితతో స్ట్టెప్పులు వేయడానికి వచ్చిన అభిమానులు ఆవేశంతో వీరంగం సృష్టించారట! స్టేజిపై రాళ్లవర్షం కురిపించారు. నమిత పేరు చెప్పి తమను మోసం చేశారని అభిమానులు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారట. దీన్నిబట్టి తెలిసేదేంటంటే నమితకు అభిమానుల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని.

తెలుగులో వచ్చిన'జెమిని' సినిమాలో ఎంతో ముద్దుగా కనిపించిన నమిత......ఇపుడు మాటల్లో చెప్పలేనంద బొద్దుగా తయారైంది. నమిత ఇలా తయారు కావడానికి కారణం....స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి వ్యసనాలే కారణమనే వార్తలు ఫిల్మ్ సర్కిల్‌లో వినిపిస్తున్నాయి.

అమ్మడు భారీగా లావెక్కడంతో సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. కనీసం ఐటం సాంగు అవకాశాలు నమితకు ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడటం లేదు ఇపుడు. దీంతో సన్నబడాలని నిర్ణయించుకున్న నమిత కేరళలోని ఆయుర్వేదం ట్రీట్‌మెంట్‌ చేసుకుంటుంది.

English summary
Reportedly, Namitha has been cheated by a Event Manager whom she has been associated with since the past few years.
Please Wait while comments are loading...