twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా బాయ్ ప్రెండ్స్ లిస్ట్ చాలా పెద్దది : రెజీనా

    By Srikanya
    |

    చెన్నై : నా బాయ్‌ఫ్రెండ్స్‌ గురించి అయితే అదో పెద్ద జాబితా. కానీ ఎవర్నీ ప్రేమించలేదు. ఎప్పుడు, ఎవరిపై ప్రేమ పుడుతుందో కూడా తెలియదు. ఎవరినైనా ఇష్టపడితే తప్పకుండా చెబుతా అంటోంది రెజీనా. అలాగే పెళ్లి గురించి చెప్తూ.. ప్రస్తుతం నాకు 22 ఏళ్లు. నా తల్లిదండ్రులు ప్రేమవివాహం చేసుకున్నారు. నేను ప్రేమిస్తున్నానని ఇంట్లో చెబితే తప్పకుండా పెళ్లి చేస్తారు. ఆ నమ్మకం నాకుంది అంది.

    'రొటీన్‌ లవ్‌స్టోరీ', 'ఎస్‌ఎంఎస్‌' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి రెజీనా. తమిళంలో 'అళగియ అసుర'తో అడుగుపెట్టింది. తాజాగా విడుదలైన 'కేడీ బిల్లా కిలాడి రంగ'తో మంచిపేరు దక్కించుకుంది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ సరసన నటించే అవకాశం చేజిక్కించుకున్నట్లు ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఆమెను మీడియా రీసెంట్ గా పలరకరించింది. రకరకాల విషయాలు ముచ్చటించింది.

    మొదటిగా తన తెరంగ్రేటం గురించి చెప్తూ... చెన్నైలో చదువుకున్నా. ప్రారంభంలో మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. 'కానల్‌నీర్‌', 'సాటర్‌డే', 'కాదలిల్‌ సొదప్పువదు ఎప్పడి' అనే లఘుచిత్రాల్లో నటించా. అంతకుముందు 'కండనాల్‌ ముదల్‌'లో లైలాకు చెల్లెలిగా కనిపించా. ఆ తర్వాత 'అళగియ అసుర'లో నాయికగా ఎంపికయ్యా. అనంతరం అవకాశాలు ఎక్కువగా వచ్చినా చదువు కారణంగా ఒప్పుకోలేదు. ఇప్పుడు సైకాలజీ పూర్తి చేసేశా. మళ్లీ నటనపై దృష్టిపెట్టా అంది.

    ఇక తెలుగులో అవకాశాలు...గురించి చెప్తూ...ఎస్ ఎమ్ ఎస్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు వెళ్లా. 'రొటీన్‌ లవ్‌స్టోరీ' మంచి ఫలితాన్నిచ్చింది. కన్నడలో చేసిన 'సూర్యగాంధీ' చక్కటి వసూళ్లు సాధించింది. 'కేడీ బిల్లా కిలాడి రంగ' మరో హిట్‌ అందించింది. తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నా. ఇంకా పేర్లు పెట్టలేదు. మలయాళంలో విడుదలైన 'సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌' తమిళ రీమేక్‌ 'ఉన్‌ సమయల్‌ అరైయిల్‌'లో కూడా నటిస్తున్నా. తమిళంలో 'నిర్ణయం' అనే చిత్రాన్ని కూడా అంగీకరించా అని చెప్పింది.

    రీసెంట్ గా వరసగా తెలుగు సినిమాలు కమిటవుతోందనే విషయం గురించి చెప్తూ.... జ: ఆ భాష, ఈ భాష అని విడగొట్టి మాట్లాడటం నాకిష్టం లేదు. ఏ భాష చిత్రమైనా మంచి పాత్ర ఉంటే తప్పక నటిస్తా. తమిళంలోనే తొలి సినిమా చేశాను. ఆ తర్వాత తెలుగులోకి వెళ్లాను. ఇప్పుడు కోలీవుడ్‌లోకి వచ్చా ంది.

    గ్లామర్‌గా నటించే విషయం గురించి చెప్తూ... నేను నటించిన రెండు సినిమాల్లోనూ గ్లామర్‌ పాత్ర పోషించలేదు. అయినా ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది. మంచినటి అని గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం. అందాలు ఆరబోస్తేనే జనం ఆదరిస్తారనుకోవడం సరి కాదు. అయినా నేను ఎవర్నీ రోల్‌మాడల్‌గా పెట్టుకోలేదు. నేను నాలా నటించాలని అనుకుంటున్నా. చివరి వరకు రెజీనాలానే ఉండాలనుకుంటున్నా.

    English summary
    Regina, who has had a successful stint in Tollywood with the Telugu Siva Manasalo Sakthi and Routine Love Story, is making a comeback of sorts in Tamil, after a gap. Sharing screen space with Sivakarthikeyan, Vimal and Bindu Madhavi, in this film directed by Pandiraj, Regina is waiting for audiences to see her potential. Talking about her role, the city-bred girl says, “It’s a rural story where I play a girl working in a Xerox shop. She’s a firecracker of a character, who dominates Sivakarthikeyan. The film is a laugh riot.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X