For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ముద్దు వివాదం: చావుదెబ్బలే అంటూ హీరోయిన్ సీరియస్ వార్నింగ్

  By Bojja Kumar
  |

  పరిచయం లేని వ్యక్తులు వచ్చి ముద్దు పెట్టు అని అడిగితే ఏ అమ్మాయికైనా కోపం వస్తుంది. ధైర్య వంతురాలు, కోపిష్టి అమ్మాయి అయితే అలా అడిగితే చెంపచెల్లుమనిపిస్తుంది. కొందరైతే చెప్పుతో కొడతారు. మామూలు అమ్మాయిలకు ఉన్నట్లే హీరోయిన్లకు మనసు ఉంటుంది, మనోభావాలు ఉంటాయి.

  సినిమాల్లో హీరోలకు ముద్దు పెడుతున్నావు కదా, మాకూ పెట్టు అని అడగటం ఎంత దారుణం. ఇలాంటి సంఘటనే ఇటీవల హీరోయిన్ అదా శర్మకు ఓ వ్యక్తి నుండి ఎదురైంది. అయితే అదా శర్మ తిరస్కరించడంతో... కొందరు ఆమెపై విమర్శలు చేయడం మొదలు పెట్టారట, అభిమానికి ముద్దు ఇస్తే తప్పేంటి? ఇవ్వొచ్చు కదా, అదేమీ హానికరంకాదు.... అంటూ ఆమెపై కొందరు కామెంట్స్ చేయడంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అదా శర్మ ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యారు.

  Adah Sharma Hot Photoshoot For Valentines Day - Filmibeat Telugu
   నన్ను రెచ్చగొట్టారు, అందుకే ఇలా

  నన్ను రెచ్చగొట్టారు, అందుకే ఇలా

  ‘గడిచిన 3 ఏళ్ల కాలంలో ట్విటర్‌లో నేను ఎప్పుడూ ఇలా స్పందించలేదు. ముద్దు ఇవ్వనందుకు నన్ను కొందరు తమ మాటలతో రెచ్చగొట్టారు. నేనేదో అతడిని అవమాన పరిచినట్లు మాట్లాడుతున్నారు. అందుకే నేను ఇపుడు స్పందిస్తున్నాను. ఈ విషయాన్ని నేను అందరు ఆడపిల్లల తరఫు నుంచి మాట్లాడుతున్నాను... అంటూ అదా శర్మ ట్వీట్ చేశారు.

  అది నిర్ణయించడానికి మీరెవరు?

  అది నిర్ణయించడానికి మీరెవరు?

  ముద్దు ఇవ్వడం ప్రమాదకరం ఏమీ కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదేమీ పెద్ద విషయం కాదని నన్ను విమర్శిస్తున్నారు. అయినా నా జీవితంలో ఏది చిన్న విషయం? ఏది పెద్ద విషయం? అని నిర్ణయించడానికి మీరెవరు?... అంటూ అదా శర్మ ఫైర్ అయ్యారు.

  నా చేతిలో చావు దెబ్బలే

  నా చేతిలో చావు దెబ్బలే

  పరిచయం లేని ఒక అబ్బాయి నా వద్దకు వచ్చి ముద్దు ఇవ్వు అని అడిగితే... నా చేతిలో అయిపోయాడే. చావు దెబ్బలు కొడతాను. కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తంతాను. నా దెబ్బలు ప్రాణాంతకంగా ఉంటాయి. ఆ సమయంలో మీ పురుషాంగానికి ఏమీ కాకుండా ఉంటే మీరు అదృష్టవంతులే.... అంటూ అదా శర్మ ఘాటుగా స్పందించారు.

   అలా అని ఫిజికల్ కాంటాక్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారా?

  అలా అని ఫిజికల్ కాంటాక్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారా?

  నేను నా చేతులు, కాళ్లు, వెన్ను భాగాలను ఎక్స్ ఫోజ్ చేస్తాను. దాని అర్థం మరొకరితో ఫిజికల్ కాంటాక్టుకు సిద్ధంగా ఉన్నానని అర్థం కాదు... అని అదా శర్మ అన్నారు.

   సినిమాల్లో వేరు, నిజ జీవితంలో వేరు

  సినిమాల్లో వేరు, నిజ జీవితంలో వేరు

  కమాండో 2లో భావన రెడ్డి పబ్లిక్ ప్లేసులో ముద్దు పెడుతుంది. ‘హార్ట్‌ఎటాక్‌' చిత్రంలో హయాతి గంట సేపు ముద్దు పెడుతుంది. అవన్నీ నేను ప్రదర్శించిన పాత్రలు. కానీ, నిజ జీవితంలో నేను అదా శర్మను.... నిజ జీవితంలో నేను రియాక్ట్ అయ్యే తీరు, వేసుకునే దుస్తులు, నేను జీవించే విధానం వేరుగా ఉంటుంది అని తెలిపారు.

  అబ్బాయిలు, పురుషులను గౌరవిస్తాను

  అబ్బాయిలు, పురుషులను గౌరవిస్తాను

  నేను అబ్బాయిలు, పురుషులను గౌరవిస్తాను. నా జీవితంలో తండ్రి, తాతయ్య, స్నేహితులు, దర్శకులు, నటులు ఇలా ఎందరో అద్భుతమైన పురుషులు ఉన్నారు. నేను మాట్లాడేది పురుషులకు వ్యతిరేకంగా దయచేసి భావించవద్దు .... అని అదా శర్మ తెలిపారు.

   దెయ్యం పాత్రలో చాలా మంది చంపా, నిజ జీవితంలో అలా చేయగలమా?

  దెయ్యం పాత్రలో చాలా మంది చంపా, నిజ జీవితంలో అలా చేయగలమా?

  అయినా ‘హార్ట్‌ఎటాక్‌' చిత్రంలో నన్ను ముద్దు అడిగితే నేను కొట్టిన సన్నివేశం కూడా ఉంది. ఇలా సినిమా పాత్రలను ఊహించుకుని నిజ జీవితంలో కూడా ఇలాగే ఉండాలి అంటే ఎలా? అలా అయితే ‘1920' అనే చిత్రంలో నేను దెయ్యం పాత్రలో చాలా మందిని చంపేశాను, నిజ జీవితంలో అలా చేయగలమా? అని అదా శర్మ ప్రశ్నించారు.

  English summary
  "I have never had a twitter outburst in the 3 yrs that I've been on twitter but accusations of "being insulted" for not being given a "HARMLESS KISS" have provoked me. I speak for a lot of girls here when I say the following ..." Adah Sharma said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more