నాగార్జునకి కథ లేదన్న శ్రీకాంత్ అడ్డాల

By Srikanya

హైదరాబాద్ : మసకబారుతున్న కుటుంబ అనుబంధాలకు మళ్లీవన్నెలద్దిన కథనే హీరోగా చేసి... ఇద్దరు ప్రముఖ హీరోలను ఆ కథనంలో నడిపిస్తూ.. తెలుగు సినిమా అంటే ఇదీ అని మరోసారి చెప్పిన సినీ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఆయన తాజా చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విజయవంతం కావడంపై సినీ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా తాను నాగార్జున తో సినిమా చేస్తున్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. తన దగ్గర నాగార్జునకి కథ లేదని అన్నారు. ఈ చిత్రానికి ముందు కొత్త బంగారు లోకం విడుదల అయ్యాక... ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ద్వారా నాగార్జున క్యాంప్ నుంచి వచ్చిన ఆఫర్ ని వదులుకున్నట్లు సమాచారం.

శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ కుటుంబ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో మహేష్‌బాబు, వెంకటేష్‌ల నటన జీవం పోసిందన్నారు. చిరునవ్వుతో ఒక అడుగేస్తే మంచి స్నేహపూర్వక వాతావరణం తద్వారా కుటుంబం, సమాజం ఏర్పడుతుందని ఈ చిత్రంలోని కథ రుజువు చేసిందని చెప్పారు. నా ఆలోచనకు నిర్మాత దిల్‌రాజు ఇచ్చిన ప్రోత్సాహమే 'సీతమ్మ వాకిట్లో...' చిత్ర విజయమన్నారు. హింస, పోరాటాలు నేపథ్యంలో వస్తున్న చిత్రాలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు. కుటుంబ నేపథ్యం, మంచి కథతో చిత్రాలు రావాలని కోరుకునే వారిలో తాను మొదటివాడినని చెప్పారు.

అలాగే తనకు సినీ దర్శకుడికా మారడానికి మీకు ప్రేరణ గురించి చెపుతూ... వాస్తవానికి దగ్గరగా ఉండి సున్నితమైన, భావోద్వేగమైన సన్నివేశాలు కలిగిన సినిమాలు ఎన్నో చూశా. ఆ ప్రేరణతోనే దర్శకుడిగా మారా. సినీ దర్శకులు దాసరి నారాయణరావు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడ్ని అన్నారు. ఇక తాను ఠాగూర్‌, ఆర్య, బొమ్మరిల్లు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశా. నా తొలి చిత్రం 'కొత్తబంగారులోకం' ప్రేక్షకులను కదిలించింది. కుటుంబ కథా చిత్రాలు అందించాలనే లక్ష్యంతోనే సినీ రంగంలోకి అడుగుపెట్టా అన్నారు.

ఇద్దరు పెద్ద కథనాయకులతో కుటుంబ కథతో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తీసిన అనుభవం గురించి చెపుతూ... ఈ చిత్రం తీసే సమయంలో ఆ హీరోలను కాకుండా కథనే నేపథ్యంగా తీసుకుని ముందుకు సాగా. మహేష్‌బాబుకు, వెంకటేష్‌కు గతంలో ఉన్న చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం మలిచే సమయంలో కొన్ని సన్నివేశాల్లో వారిద్దరూ అందించిన సహాయ సహకారాలు మరువలేను. సీతమ్మ వాకిట్లో చల్లని మల్లెచెట్టు ఉంటే ఎంత సువాసనగా ఉంటుందో అదే రీతిలో ప్రేమానుబంధాలతో కుటుంబం ముడిపడి ఉండాలనే ఆశయంతో చిత్రం తీసి విజయవంతం అయ్యా అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X