»   »  నన్ను వాడుకున్నారు : పోలీసులతో హీరోయిన్ లీనా

నన్ను వాడుకున్నారు : పోలీసులతో హీరోయిన్ లీనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : మలయాళ హీరోయిన్‌ లీనా మరియాపాల్‌ చీటింగ్ కేసులో ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. చెన్నైలోని కెనరా బ్యాంకుకు తప్పుడు పత్రాలు సమర్పించి మోస పూరితంగా రూ.19 కోట్లు భారీ రుణం తీసుకోవడమే ఇందుకుకారణం. ఈ రుణం తిరిగి చెల్లించకుండా అజ్ఞాతంలోకి వెళ్లి ఢిల్లీలోని ఫతేపుర్‌బేరీలో దొరికిపోయారు.

ప్రస్తుతం పోలీసు రిమాండ్‍‌లో ఉన్న లీనా మరియా పాల్.....విచారణలో పలు విషయాలు బయట పెట్టింది. నేను కావాలని ఏ తప్పూ చేయలేదని, తన స్నేహితుడు సుఖేష్ చంద్రశేఖర్‌ తనను పావులా వాడుకున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. కాగా పరారైన సుఖేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leena Maria Paul

కాగా...లీనా మరియా పాల్‌ ఈ ఒక్క కెనరా బ్యాంకులోనే కాదు... తమిళనాడు, కేరళలోని అనేక బ్యాంకుల్లో అమ్ముడు ఇలాంటి మోసాలకే పాల్పడిందట. ఆమె చేసిన నేరాలపై సీబీఐ దర్యాప్తు కూడా ముమ్మరం చేసింది. ఆమెపై మరిన్ని కేసులో నమోదు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఆమెపై 420, 120 బి, 406 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. కోర్టులో నేరం రెజువైన తర్వాత ఆమెకు జైలు శిక్ష పడనుంది. ఆమెపై ఉన్న వివిధ కేసుల నేపథ్యంలో....ఆమెకు జైలు జీవితం తప్పే అవకాశాలు న్యాయ నిపుణులు అంటున్నారు. ఇన్నాళ్లు తన అందచందాలతో ప్రేక్షకులను అలరించిన లీనా మరియా పాల్...ఇప్పుడు కటకటాల వెనక్కి వెలుతుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

English summary
I have not fraud, Leena Maria Paul said to police in investigation. She wanted in connection with a cheating case here and arrested from Delhi recently in a joint operation by Delhi Police and Chennai crime branch officials.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu