»   » సారీ..అది తప్ప ఇంకేమీ చెయ్యలేను: మహేష్

సారీ..అది తప్ప ఇంకేమీ చెయ్యలేను: మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లేదు..ఒక్కసారి నటుడు అయితే జీవితాంతం నటుడే..నాకు కేవలం నటనంటేనే ఫ్యాశన్. నేను ఇంకేమీ తెలియదు. నేను జీవితంలో నటన తప్ప ఇంకేమీ చెయ్యలేను. నేను నాలుగో సంవత్సరం నుండీ ఇప్పటివరకూ నటిస్తూనే ఉన్నాను..అంతకు మించి నేను ఆలోచించలేను అని క్లియర్ గా చెప్పారు మహేష్. తాజాగా ఆయన ఓ ఆంగ్ల సినీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో...మీరు భవిష్యత్ లో ఫిల్మ్ మేకర్ గా (నిర్మాతగా) మారతారా అన్న ప్రశ్నకి ఇలా స్పందించారు. అలాగే మల్టీ స్టారర్ చిత్రాలు గురించి చెప్తూ..నేను చేయటానికి ఎప్పుడూ రెడీనే..అయితే నా డౌట్ ఏమిటంటే...ఎవరైనా అలాంటి కరెక్ట్ గా ఫిట్ అయ్యే కథతో రాగలరా అని ఎదురు ప్రశ్నించారు. ఇక ఈ మ్యాటర్ ని బట్టి అర్ధమయ్యే మ్యాటర్ ఏమిటంటే మహేష్ బాబు వాళ్ళ నాన్న గారిలా భవిష్యత్ లో నిర్మాతగా గానీ, దర్శకుడుగా గానీ మారరన్నమాట. నటనతోనే తన అభిమానులను సంతోషపరుస్తారన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu