»   » ట్రెండింగ్ టాక్ : ఎన్టీఆర్ కు సాటి లేరంటూ తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్

ట్రెండింగ్ టాక్ : ఎన్టీఆర్ కు సాటి లేరంటూ తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తన యాక్టింగ్ తో ఎవరికీ అందని స్థాయిలో ఉండడం విషయంలో ఎన్టీఆర్ సాటి ఎవరూ రాలేరని.. ఆయన లాంటి నటుడు ఉండరని అన్నారు పవన్. అలాగే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తాను వీరాభిమానిని అని.. క్రేజ్ విషయంలో ఆయన్ను అందుకోవడం సాధ్యం కాదని చెప్పేశాడు పవన్ కళ్యాణ్.

ఇక ఎన్టీఆర్ యాక్టింగ్ కి సాటి కానీ.. చిరంజీవి క్రేజ్ కి పోటీ కానీ ఉండదని పవన్ చెప్పారు. ఇదంతా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వూలో పవన్ చెప్పిన మాటలు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం హిందీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చి ఇంటర్వూ తీసుకున్న హిందీ మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ మాటలు అన్నారు పవన్ .


Also Read: పవన్ కళ్యాణ్‌ను తట్టుకుంటే వచ్చే కిక్కే వేరప్పా (ఇంటర్వ్యూ)


పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'సర్దార్ గబ్బర్ సింగ్' బాలీవుడ్ లో హల్ చల్ చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 2012లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన "గబ్బర్ సింగ్" కు ఫ్రాంచైజ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8న తెలుగు వెర్షన్ తో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నారు.


I like NT Rama Rao: Pawan Kalyan

ఈ నేపధ్యంలో బాలీవుడ్ ప్రేక్షకులను ఈ సినిమా వైపు ఆకర్షించేందుకు డిఫరెంటుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రాతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడిలా ముఖాముఖి ఇంటర్వూలు ఇస్తున్నారు.


ఆ ఇంటర్వూలో భాగంగా...బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు తాను సూపర్ ఫ్యాన్ అని చెప్పిన పవన్.. సర్దార్ చిత్రం కథ డిమాండ్ మేరకే హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.


Also Read: ఆ రోజు పవన్ బాబాయ్ తో మాట్లాడాకే.. : సీక్రెట్ బయిటపెట్టిన రామ్ చరణ్


ఇక తనకు స్టార్ డం మీద మమకారం కానీ ఇష్టం లేవని క్లియర్ గా వివరించాడు. ఇక ఎప్పటిలాగే ...పాటల్లో నటించడానికి - డ్యాన్సులు చేయడంలోనూ ఇబ్బంది పడతానని చెప్పేశాడు పవన్ కళ్యాణ్.


I like NT Rama Rao: Pawan Kalyan

చిత్ర నిర్మాణం కొన్ని ఏరియాలకు, కొంతమందికి మాత్రమే పరిమితం కాకూడదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమ చిత్రం ఒక దేశంలోని వివిధ భాషలను ప్రత్యేకించి హిందీ భాషతో మమేకం కావడానికి తోడ్పడుతుందని తెలిపారు.


బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పవన్ ...తెలంగాణ, చత్తీస్ ఘఢ్, మధ్యప్రదేశ్ సరిహద్దులో పనిచేసే పోలీసు అధికారి గబ్బర్ సింగ్ పాత్రలో కనిపించనున్నాడని ఎరోస్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా వెల్లడించారు.


ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. పవన్ నటించిన పలు తెలుగు సినిమాలు హిందీలో బుల్లితెరపై అనువాదమై ఎప్పటి నుండో ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు బాలీవుడ్లో మంచి స్పందన వస్తుందని, మంచి వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు.

English summary
In his recent media interaction, Pawan Kalyan reveals Sr.NTR is one person he admires a lot among the old generation. He even adds, 'NTR's popularity can't be replicated'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu