»   » ‘ఐ లవ్ యూ స్వీట్ హార్ట్’... నాగార్జున ట్వీట్

‘ఐ లవ్ యూ స్వీట్ హార్ట్’... నాగార్జున ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
"I Love You Sweet Heart" Nagarjuna Tweet ‘ఐ లవ్ యూ స్వీట్ హార్ట్’

అక్కినేని నాగార్జున తన భార్య అమల పుట్టినరోజు సందర్భంగా చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. అమల 48వ పుట్టినరోజును పురస్కరించుకుని నాగార్జున ఈ ట్వీట్ చేశాడు. 'ఐ లవ్ యూ స్వీట్‌హార్ట్‌. నీతో కలిసి చాలా కాలం జీవించాలని నాకు నేనే విష్‌ చేసుకుంటున్నా. హ్యాపీబర్త్‌డే' అంటూ నాగ్ ట్వీట్ చేశారు.

నాగార్జున, అమల 1992లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత పాతికేళ్లుగా వీరి వివాహ బంధం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతోంది. సినిమాల ద్వారానే ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది, ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.... ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది.

అమల కుటుంబ నేపథ్యం

అమల కుటుంబ నేపథ్యం

అమల కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. అమల తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. తండ్రి బెంగాళీ. ప్రముఖ నాట్యకారిణి రుక్మిణీ ఆరండేల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీ రాజా దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన వైశాలి తమిళ చిత్రం ద్వారా కథానాయికగా సినీరంగంలోనికి ప్రవేశించింది.

తెలుగులో

తెలుగులో

తెలుగులో అమల మొదటి చిత్రం డి.రామానాయుడు నిర్మించిన చినబాబు. ఆ చిత్రంలో కథానాయకుడు నాగార్జున. నాగార్జునతో ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది అని చెబుతుంటారు.

అమల, నాగార్జున

అమల, నాగార్జున

నాగార్జున, అమల కలిసి ‘ప్రేమ యుద్ధం', ‘చినబాబు', ‘కిరాయి దాదా', ‘శివ', ‘నిర్ణయం' చిత్రాల్లో నటించారు. వీరు 1992లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక ఆమె సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత 2012లో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంలో ఆమె మళ్లీ నటించారు.

సినిమాలు

సినిమాలు

అమల తన కెరీర్లో 50 పైగా చిత్రాల్లో నటించారు. ఆమె ఎక్కువ తమిళ చిత్రాల్లో నటించారు. దీంతో పాటు తెలుగు, తమళయాలం, హిందీ చిత్రాల్లో చేశారు.

English summary
Nagarjuna took to twitter and posted two beautiful pics of himself and Amala and tweeted that "I love you sweetheart. I wish for myself many happy returns of today with you happy birthday!!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu