పవన్ కళ్యాణ్ కు జోడీగా కనీసం ఒక్క చిత్రంలో అయినా నటించే అవకాశం వస్తే చాలని చాలా మంది నాయికలు ఎదురు చూస్తుంటారు. . పవన్ కోసమే కేవలం అది అథితి పాత్ర అని తెలిసి కూడా 'బంగారం" చిత్రంలో త్రిష నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా విష్ణువర్థన్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందిస్తున్నాడు. ఇందులో ఆయనకు జోడీగా సారాజైన్ దియాజ్, అంజలీ లావనియా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.
ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న కింగ్ ఫిషర్ మోడల్ అంజలీ లావనియా మాట్లాడుతూ' సెట్లో ఆయన వర్క్ చూస్తే ముచ్చటేస్తుంది. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది. మరో సారి పవన్ తో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 6న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవుతుంది. నవంబర్13న ఆడియో విడుదలవుతుంది. చిత్రాన్ని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు" అని తెలిపింది కింగ్ ఫిషర్ మోడల్ అంజలీ లావనియా.
Anjali is making her debut as one of the heroines in Pawan Kalyan film; she was roped in after the producers saw her on the Kingfisher calender. Anjali doesn't elaborate much on her role in the film but says that she loved shooting with Pawan Kalyan.
Story first published: Tuesday, September 27, 2011, 11:51 [IST]