twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కెమెరామాన్ గంగతో రాంబాబు'లోలానే...:తమన్నా

    By Srikanya
    |

    హైదరాబాద్ :పవన్ కళ్యాణ్ తో చేసిన 'కెమెరామాన్ గంగతో రాంబాబు'లోలానే బయట గలగలా మాట్లాడతా. చిన్నప్పటి నుంచి వయస్సులో నాకంటే పెద్దవాళ్లతో స్నేహం చేయడం అలవాటు. ఈ అలవాటు నాకు బాగానే పనికొచ్చింది. వాళ్లతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకునే దాన్ని. కొత్తల్లో ఏ సినిమా ఎంచుకొంటే ఎలాంటి ఫలితం వస్తుందో అని భయపడేదాన్ని. ప్రతిదీ గందరగోళంగా అనిపించేది. ఇప్పుడు అందరి సపోర్ట్ ఉండడంతో అన్నీ సర్దుకున్నాయి అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

    అలాగే..ఇప్పటివరకు అన్ని సినిమాలనూ ఇష్టంగానే చేశా. కానీ తమిళంలో 'ఆనంద తాండవం' చేసేప్పుడే కాస్త కష్టపడ్డా. అది హిందీలో కరీనా నటించిన 'జబ్ వియ్ మెట్‌'కు రీమేక్‌. అందులో హీరోయిన్ పాత్ర తనను తాను చాలా ఇష్టపడుతుంది. కరీనా ఆ పాత్రలో అదరగొట్టేసింది. అంతకంటే మంచి బాడీలాంగ్వేజి కోసం చాలా హోంవర్క్ చేశా. న్యూయార్క్ లో దాని క్త్లెమాక్స్ జరుగుతున్నప్పుడు ఒక్కటేక్ లోనే సీనంతా పూర్తి చేశా. అంతా షాక్‌. దర్శకుడు గాంధీ అయితే ఏడుపు ఆపుకోలేపోయాడు. విషయం అర్థం కాకపోయినా ఆ సినిమాకు పనిచేస్తున్న విదేశీయులు సైతం కదిలిపోయారంటే నమ్మండి అంది.

    ఇప్పుడైతే తెలుగులో స్పష్టంగా మాట్లాడగులుగుతున్నా కానీ మొదట్లో చాలా కష్టపడ్డా. సెట్లో కూడా నా సీన్ అయిపోగానే ఓ మూలకెళ్లి మౌనంగా కూర్చునేదాన్ని. కానీ అలానే ఉంటే ఎప్పటికీ అర్థం చేసుకోలేనని అనిపించింది. అందుకే మొదట నా దగ్గర పనిచేసే సహాయకులతో మెల్లగా మాటలు కలిపా. కొంచెం కొంచెం అర్థం చేసుకోవడం మొదలుపెట్టా. వాళ్లు తప్పుల్ని సరిదిద్దేవారు. ఇప్పుడు తెలుగు, తమిళం రెండూ దంచేస్తా. దర్శకులు అడగాలే గాని నా సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పేసుకుంటా అంటూ చెప్పుకొచ్చింది.

    ఓసారి మా స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ లో పాల్గొన్న నన్ను చూసి ఓ దర్శకుడు 'నటిస్తావా' అని అడిగారు. అలా పదమూడేళ్ల వయసులోనే ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనలో కనిపించా. ఆ తరవాత హిందీ సినిమా 'చాంద్ సా రోషన్ చెహ్రా'లో చేశా. అదే ఏడాది తెలుగులో 'శ్రీ'లోనూ అవకాశం వచ్చింది. ఆ తరవాత తమిళంలో మూడు సినిమాలు చేశాక 'హ్యాపీడేస్‌'తో మళ్లీ తెలుగులోకి వచ్చా. ఆ సినిమా తరవాత చెప్పేదేముంది... వరుస అవకాశాలతో అటు తమిళం, ఇటు తెలుగులో బిజీ బిజీ అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది.

    English summary
    Tamanna says that Ganga character is the own life. She plays journalist in Cameraman Gangato Rambabu film which is big hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X