»   » అపుడు....మహేష్ బాబు టెన్షన్ పడ్డారు, వణికి పోయారు!

అపుడు....మహేష్ బాబు టెన్షన్ పడ్డారు, వణికి పోయారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘శ్రీమంతుడు' సినిమా విడుదలకు ముందు మహేష్ బాబు తన మనసులో ఆలోచన ఎలా ఉందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో తన చిత్రం సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో? అని ఆయన కాస్త ఆందోళన చెందారట. ఏదైతేనేం... సినిమా పెద్ద హిట్టయింది. శ్రీమంతుడు హిట్ ఇచ్చిన ఎనర్జీతో మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం' చిత్రానికి ఉత్సాహంగా సిద్ధమయ్యారు.

ఇటీవల ఇంటర్య్వూలో మహేష్ బాబు మాట్లాడుతూ... ‘శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అయింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. సినిమా ఎంత కలెక్ట్ చేసింది, నంబర్స్, రికార్డ్స్ అవన్నీ ఇపుడు అనవసరం. సినిమాను విజయవంతం చేసిన మూవీ లవర్స్ అందరికీ నా కృతజ్ఞతలు' అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.


I'm literally shivering : Mahesh Babu

శ్రీమంతుడు సినిమా విడుదల ముందు రోజు పరిస్థితి గురించి వివరిస్తూ..‘శ్రీమంతుడు సినిమా విడుదల ముందు రోజు కాస్త టెన్షన్ ఫీలయ్యాను. షివరింగ్ వచ్చేసింది. చేతులు వణికి పోయాయి. నా గత రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. 1-నేనొక్కడినే కాస్త బెటర్. కానీ సినిమా లెంత్ ఎక్కువగా ఉండటం దెబ్బతీసింది. ఆగడు సినిమా ప్యూర్ మిస్టేక్. కానీ శ్రీమంతుడు టాపు లేపింది. చాలా సంతోషంగా ఉంది' అని మహేష్ బాబు తెలిపారు.


‘అప్పట్లో మగధీర తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో రెండు నెలల వరకు ఒక్క హిట్టు కూడా లేదు. అందుకే బాహుబలి లాంటి పెద్ద హిట్ తర్వాత వస్తుండటం కాస్త టెన్షన్ పెట్టింది. అంత పెద్ద సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా క్లిక్ అవుతుందో లేదో అని కాస్త నర్వస్ అయ్యాను. లక్కీగా శ్రీమంతుడు బాక్సాఫీసు వద్ద వర్కౌట్ అయింది' అని మహేష్ బాబు అన్నారు.

English summary
"I'm literally shivering, hands shaking and feeling very tense. After Magadheera came, for two months there is no other hit in Telugu industry. That's why I'm worried to come after Baahubali. I'm nervous if my film would click or not post such massive hit. Luckily, Srimanthudu worked", Mahesh Babu said.
Please Wait while comments are loading...