»   » నేను అఖిల్ సినిమాలో చేయటం లేదు

నేను అఖిల్ సినిమాలో చేయటం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఊహలు గుసగుసలాడే చిత్రంతో పరిచయమైన చిన్నది రాశిఖన్నా. ఆమె తన ఒంపుసొంపులతో ఇండస్ట్రీ దృష్టిని ఒక్కసారిగా తన వైపు తిప్పుకుని గోపించంద్ సరసన జిల్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం జిల్ ప్రమోషన్ లో ఉన్న ఆమె అఖిల్ ...లాంచింగ్ చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే రాసిఖన్నా అవన్నీ వట్టి పుకార్లే అని కొట్టిపారేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రాశిఖన్నా మాట్లాడుతూ... " నేను ఏ ఐటం సాంగ్ ఏ సినిమాలోనూ చేయటం లేదు. నేను ప్రస్తుతం జిల్ చిత్రం ప్రమోషన్ లో పాల్గొంటున్నాను. త్వరలో రవితేజ సరసన బెంగాళ్ టైగర్ సినిమా కు షూటింగ్ లో వెళ్తాను ", అంటూ చెప్పుకొచ్చింది. రాశిఖన్నా తన కెరీర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. తనకు ఉపయోగపడే ఆఫర్స్ కే మ్రొగ్గుచూపి ముందుకు వెళ్తోంది.

ఇక ఆమె నటించిన జిల్ చిత్రం విషయానికి వస్తే....

I’m Not Doing Akhil’s Movie : Raashi Khanna

గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం జిల్. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్ దర్శకుడు. ఈ నెల 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.... వంశీ, ప్రమోద్ సినిమాల పట్ల తపన ఉన్న నిర్మాతలు. తమ ప్రతి చిత్రంతో ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాతో వారికి హ్యాట్రిక్ హిట్ సొంతం కావాలని కోరుకుంటున్నాను. రాధాకృష్ణకు దర్శకుడిగా మంచి పేరు రావాలి. ఈ సినిమాలో గోపీచంద్ కొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఫ్యామిలీ, యాక్షన్ హీరో స్థాయి నుంచి యూత్‌హీరోగా ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు అని అన్నారు

. దర్శకుడు మాట్లాడుతూ ఓ దమ్మున్న ఫైర్ ఆఫీసర్ కథే ఈ చిత్ర ఇతివృత్తం. కర్తవ్య నిర్వహణలో ఎదురైన సవాళ్లను అతడు ఏ విధంగా అధిగమించాడన్నదే సినిమాలో కీలకంగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో గోపీచంద్ పూర్తి సహకారాన్ని అందించాడు అని చెప్పారు.

గోపీచంద్ మాట్లాడుతూ... నిర్మాతలు నాకు మంచి స్నేహితులు. స్వంత సినిమాలానే భావించి ఇందులో నటించాను. దర్శకుడు ఈ కథను నాకు ఏడాదిన్నర క్రితమే చెప్పాడు. ఇప్పటికి ఈ సినిమా చేయటం కుదిరింది. అలాగే ఈ చిత్రంలో నేను కొత్తగా కనిపించడానికి ప్రభాస్, వంశీ, రాధాకృష్ణలు అందించిన ప్రోత్సాహమే కారణం. ఇటీవలే విడుదలైన ఆడియోకు, టీజర్‌కు చక్కటి ఆదరణ లభిస్తుంది. సినిమా కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అని అన్నారు.

English summary
“I’m not doing any item number in any movie. As I’m promoting Jil now, I’ve to join shoot of Raviteja’s Bengal Tiger soon”, said Rashi Khanna, at the trailer launch event of Jil the other day.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu