»   »  గెలుపు బావ గారిదే...అంటూ మహేష్ బాబు ట్వీట్

గెలుపు బావ గారిదే...అంటూ మహేష్ బాబు ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అసలు రాజకీయాలకు వీలైనంత దూరంగా ఉండే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.....గుంటూరు నుండి టీడీపీ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేస్తున్న బావ గల్లా జయ్ దేవ్ కోసం గళం విప్పిన సంగతి తెలిసిందే. గతంలో బావను గెలిపించాలంటూ ట్విట్టర్ ద్వారా కోరిన మహేష్ బాబు.....ఈ సారి మరో ట్వీట్ ద్వారా గెలుపు బావదే అంటూ ధీమా వ్యక్తం చేసాడు.

ట్విట్టర్ ఎకౌంటు ద్వారా మహేష్ తన భావ ఎలాగైనా గెలిచి తీరుతాడు అని తెలిపాడు. గుంటూరులోని తన అభిమానులు ప్రజలు జయదేవ్ ని తమ సొంత మనిషిలా చుసుకున్తున్నారని, దానికి తను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపాడు. అంతేకాకుండా జయదేవ్ ప్రచారాన్ని గమనిస్తున్నానని, భారీ మెజారిటీతో గెలుస్తాడనే నమ్మకం ఉందని ట్వీట్ చేసాడు.

I’m sure Jay Galla will win with a thumping majority: Mahesh Babu

కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు తన బావ గురించి చేసిన వ్యాఖ్యలు...

తన సోదరి పద్మను ఆయన వివాహం చేసుకున్నపుడు నా వయసు 13, అప్పటి నుంచీ ఆయన తనకు రోల్ మోడల్, ప్రేరణ అని అన్నారు. ఆయన నన్ను ఆయన ట్రీట్ చేసే విధానం, తీసుకునే కేర్ తనకు బాగా నచ్చేదని అన్నారు. తర్వాత కాలంలో ఆయన విజన్, దాన్ని విలువతో కూడి నిజం చేసుకోవటం అర్దం చేసుకున్నానని, ఈ రోజు అమర్ రాజా గ్రూప్, అమరన్ బ్రాండ్ అభివృద్దిని చూసానన్నారు. ఆయన తన విజయాలతో మీడియా చేత, పారిశ్రామిక వర్గం చేత గుర్తింపబడ్డారు అన్నారు.

ఆయన ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని మాట్లాడేవారు, అయితే ఎందుకనేది నిజంగా నాకు అర్దం కాలేదు, నేను ఎప్పుడూ దాన్ని ఇష్టపడలేదు. రాజకీయాల ద్వారానే రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చి మార్పు తేవాలనేవారు. అలాగే రాజకీయం ద్వారా చాలా మందికి సేవ చేయవచ్చు అనేవారు. ఆయన ఫేవరెట్ కోట్ ఏమిటంటే... "One man can make a difference, and every man should try."

నాకు ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన డిఫెరెన్స్ తేగలరనే నమ్మకం ఉంది. ఆయన మీకు కూడా నచ్చుతాడనుకుంటున్నాను, గుంటూరు భవిష్యత్ ఆశాజ్యోతిగా ఆయన కాగలరు అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తూ మహేష్ బాబు తన బావ గురించి ట్వీట్ ఇచ్చారు.

English summary

 With elections in Seemandhra just around the corner, Mahesh Babu posted on Twitter saying, “I’m really happy that all my fans n people of guntur have welcomed and embraced jaygalla as their own..Have been following his campaign closely n I’m sure he will win with a thumping majority.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu