»   » రాజమౌళి పై ఒట్టు, ఓడ్కా తాగి భయపెట్టాడంటూ నాగ్, ధర్నా చేస్తాం,ఛైన్స్ తో దాడి చేస్తాం

రాజమౌళి పై ఒట్టు, ఓడ్కా తాగి భయపెట్టాడంటూ నాగ్, ధర్నా చేస్తాం,ఛైన్స్ తో దాడి చేస్తాం

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: తన కామెంట్ లతో తరచూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్‌వర్మ. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'శివ' నుంచి త్వరలో విడుదల కానున్న 'వంగవీటి' వరకు సినీప్రస్థానాన్ని వివరిస్తూ హైదరాబాద్‌లో 'శివ టు వంగవీటి' కార్యక్రమాన్ని నిర్వహించారు.

  జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు సినీ ప్రముఖుల హాజరయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేశ్‌, రాజశేఖర్‌, దర్శకులు రాజమౌళి, పూరీ జగన్నాథ్‌, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, హరీశ్‌ శంకర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంగోపాల్‌వర్మతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.


  ఆ సందర్బంగా రామ్ గోపాల్ వర్మ సైతం అనేక హామీలు ఇచ్చారు. ఆయన తనదైన శైలిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'వంగవీటి'. దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మాత. ఈనెల 23న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో 'శివ టూ వంగవీటి' పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమ విశేషాలు, ఫొటోలతో క్రింద చదవండి.


  రాజమౌళికి చేస్తున్న వాగ్దానమిది

  రాజమౌళికి చేస్తున్న వాగ్దానమిది

  ‘‘నా చివరి తెలుగు సినిమా ‘వంగవీటి' అని చెప్పాను. అన్నమాట మీద నేను నిలబడనని అందరికీ తెలుసు. ఇప్పుడు నాలో నిజాయితీ మెరుగువుతోంది. ముందు ముందు నేను గర్వంగా చెప్పుకొనే సినిమాలే చేస్తాను. రాజమౌళికి నేనిస్తున్న వాగ్దానమిది. నామీద నేనే ఒట్టేసుకొని చెబుతున్నా. నాకు నాకన్నా ఇంకెవరూ ఇష్టం లేదు. ఆ ప్రామిస్‌ ఇవ్వగలను'' అని చెప్పారు రామ్‌గోపాల్‌వర్మ.


  నా మీదా,నాగార్జున మీదా

  నా మీదా,నాగార్జున మీదా

  ‘‘ఈమధ్య రాజమౌళిని కలిసి ‘వంగవీటి' నాకు ప్రత్యేకమైన చిత్రమని చెప్పా. ‘ఇలాంటివి చాలా చూశాంలే' అన్నట్టు ఓ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. దానికి నేను అర్హుడినే. ఎందుకంటే అలాంటి మాటలు చాలాసార్లు చెప్పుంటా. కానీ ఇక మీదట గర్వపడే సినిమాలే చేస్తా. నా మీదొట్టు. నాకంటే మిన్నగా ప్రేమించే నాగార్జున మీదొట్టు'' అన్నారు రాంగోపాల్‌ వర్మ.


  చావని పాముని

  చావని పాముని

  వర్మ మాట్లాడుతూ ‘‘ట్విట్టర్‌లో ఆమధ్య ఒకరు కామెంట్‌ పెట్టారు. ‘ఎన్నిసార్లు కొట్టినా చావని పాము నువ్వు' అని. ‘వర్మ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది' అని ఓ ఇంటర్వ్యూలో నాగార్జునని ఓసారి అడిగితే... ‘పిచ్చి' అన్నాడు. ఆ మాటలకు నేను అర్హుడినే అన్నారు.


  ఎప్పుడూ అనుకోలేదు

  ఎప్పుడూ అనుకోలేదు

  విజయవాడ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్నప్పుడే అక్కడి రాజకీయాలు, పరిస్థితి, వంగవీటి కథపై అవగాహన ఉన్నాయి. అయితే సినిమా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘వంగవీటి' కథని సినిమాగా తీసే పరిపక్వత ఇప్పటికి వచ్చిందేమో అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.


  అలాంటి నిర్మాత దొరకడు

  అలాంటి నిర్మాత దొరకడు

  ‘బ్రేక్‌' అనే మాట నేను నమ్మను. కాకపోతే ప్రపంచంలో ఏ దర్శకుడికీ తన తొలి సినిమాకి నాగార్జున లాంటి నిర్మాత దొరకడు. ‘కావాలంటే నా పారితోషికం తగ్గించండి... కానీ రామూకి ఏం కావాలో అది ఇవ్వండి' అంటూ నా ప్రతి నిర్ణయాన్నీ గౌరవించారు అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.


  ట్రాక్ లో కి వచ్చేస్తాం...

  ట్రాక్ లో కి వచ్చేస్తాం...

  రాజమౌళి లాంటి దర్శకులు సరైన ట్రాక్‌ చూసుకొని పరుగు అందుకొంటారు. నేను పరిగెట్టేస్తే చాలు, ట్రాక్‌లోకి వచ్చేస్తాం అనుకొనేవాణ్ని. నాలుగు రాళ్లేద్దాం ఏదోటి తగలకపోతుందా అనుకొంటుంటా. అందుకే నా దగ్గర్నుంచి ఈమధ్య సరైన సినిమాలు రాలేదేమో? అన్నారు రామ్ గోపాల్ వర్మ.


  మాట మీదే నిలబడనని

  మాట మీదే నిలబడనని

  ఇక నుంచి గర్వపడే సినిమాలే తీస్తా. నేనేదో మాట మీద నిలబడనని అనుకొంటుంటారు. కాకపోతే ఈసారి నిజాయతీగానే చెబుతున్నా. ఆ ఫలితాలు మీరే చూస్తారు''అన్నారు వర్మ.


  నాగ్ మాట్లాడుతూ..

  నాగ్ మాట్లాడుతూ..

  "రాజమౌళి గారికి ఇచ్చిన ఆ ఒక్క ప్రామిస్ మాత్రం గుర్తు పెట్టుకో. ఎవ్రీ ఫిలిం యూ మేక్ ఫ్రం నౌ ఆన్ షుడ్ మేక్ ఏ డిఫరెన్స్. దట్ ఐ వాంట్ యూ టూ డూ. (ఇక నుంచి నువ్వు తీసే ప్రతి చిత్రం వైవిధ్యంగా ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను)" అన్నాడు నాగార్జున.


  రాజమౌళి మీద ఒట్టు వేసా

  రాజమౌళి మీద ఒట్టు వేసా

  దీనిపై స్పందించిన రామ్, నాగార్జున వ్యాఖ్యలకు ఒక చిన్న సవరణ చేయాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. ఇందాక రాజమౌళి మీద ఒట్టు వేశాను. ఇప్పుడు నాగార్జున మీద ఒట్టు వేస్తున్నాను. రాజమౌళి మీద ఉత్తుత్తి ఒట్టు వేశానని భవిష్యత్తులో తాను చెప్పుకునే అవకాశం లేకుండా చూసుకునేందుకే నాగార్జున మీద కూడా ఒట్టు పెడుతున్నట్టు చెప్పాడు. ఇకపై వైవిధ్య భరిత చిత్రాలే తీస్తానని అన్నారు రామ్ గోపాల్ వర్మ.


  నీతోనే చేస్తా...

  నీతోనే చేస్తా...

  "ఎంత మంది నా దగ్గరకు వచ్చారో... 'శివ' తీద్దామండీ... శివ-2 తీద్దామండీ మీతో అని... అందరూ సీక్వెల్స్ తీస్తున్నారని... రామూ... ఓన్లీ ఇఫ్ యూ మేకిట్ విత్ మీ... ఐ వాంట్ టూ డూ శివ-2. ఆర్ ఐ విల్ నెవర్ టచ్ దట్ (రామూ నువ్వు మాత్రమే నాతో తీయాలని ముందుకు వస్తే, నేను శివ-2 చేస్తాను. లేకుంటే దాన్ని ముట్టుకోనే ముట్టుకోను)" అని తెలిపారు నాగార్జున.


  ఓ ప్రెండ్ నాకు..

  ఓ ప్రెండ్ నాకు..

  నాగార్జున చెబుతూ ‘‘ఓ దర్శకుడి కంటే ఓ స్నేహితుడిలా రాము అంటే నాకు ఇష్టం. అప్పట్లో నేనెవరితోనూ పెద్దగా కలిసేవాణ్ని కాదు. రామూతో తప్ప. శివలాంటి కథ చెప్పాడని కాదు. తనతో కూర్చున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకొనేవాళ్లం. బ్రూస్లీ, గాడ్‌ ఫాదర్‌, నక్షత్రాలు, విశ్వం... ఇలా ఎన్నో టాపిక్కులు అంటూ గుర్తు చేసుకున్నారు తమ అనుబంధాన్ని.


  వంద సినిమాల్లో ఖచ్చితంగా..

  వంద సినిమాల్లో ఖచ్చితంగా..

  ‘శివ' నా జీవితాన్నే కాదు తెలుగు సినిమానీ మార్చింది. దేశంలోని ఉత్తమ వంద సినిమాల జాబితా తీస్తే అందులో ‘శివ' కూడా ఉంటుంది. దాదాపు పాతికేళ్ల నాటి సూపర్ హిట్ చిత్రం 'శివ' గురించి హీరో నాగార్జున మాట్లాడారు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.


  బొర్ కొట్టినప్పుడల్లా

  బొర్ కొట్టినప్పుడల్లా

  ఎవరైనా ‘నా ఇష్టం' అనే పుస్తకం రాసుకొని, తనకి తాను అంకితం ఇచ్చుకొంటారా? అందుకే వర్మ అంటే నాకిష్టం. నాకు బోర్‌ కొట్టినప్పుడల్లా వర్మ ట్విట్టర్‌ ఖాతా తెరుస్తా. మనసులో ఏం అనుకొన్నాడో అదే చెబుతాడు. వర్మా... నువ్వు ఏం అనుకొంటే అది చేయ్‌. ఇలా ఒట్లు వేయకు అని నాగార్జున సలహా ఇచ్చారు.


  పెన్నుని కత్తిలా పట్టుకుని

  పెన్నుని కత్తిలా పట్టుకుని

  "మేమిద్దరమూ ఓడ్కా తాగడం స్టార్ట్ చేసే వాళ్లం. ఒకటి అయిపొయ్యేది, రెండు అయిపొయ్యేది, ఫుల్ బాటిల్ అయిపొయ్యేది. నాకు భయం వేసేది. రామ్ కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని కథ చెప్పేవాడు. పక్కనే ఉన్న పెన్ను, పెన్సిల్ ను కత్తిలా పట్టుకుని మీదకు వచ్చేసేవాడు. అందుకే టేబుల్ కు ఇటువైపున నేను కూర్చుని, అటువైపున రామ్ ను కూర్చోబెట్టేవాడిని" అంటూ 'అంతం' సినిమా స్టోరీ డిస్కషన్స్ ను గుర్తు చేసుకుంటూ నాగ్ తెలిపాడు.


  నాగ్ తో చైన్ లాగించి..

  నాగ్ తో చైన్ లాగించి..

  వెంకటేష్‌ మాట్లాడుతూ... ‘‘శివ' తరవాత ‘శివ'లాంటి సినిమానో, దానికంటే గొప్ప సినిమానో తీస్తాడనుకొన్నా. కానీ అంచనాలకు భిన్నంగా ‘క్షణం క్షణం' చేశాడు. నాగ్‌తో చైన్‌ లాగించాడు. నన్ను కూర్చోబెట్టి పాట పాడించాడు అన్నారు.


  కేవలం తెలుగు సినిమానే కాదు..

  కేవలం తెలుగు సినిమానే కాదు..

  'శివ టు వంగవీటి' గురించి చెప్పాలంటే చాలా ఉంటుందని వెంకటేష్ అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన 'శివ టు వంగవీటి' వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'శివ' తెలుగు సినీ పరిశ్రమ పోకడను మాత్రమే కాదని, భారతీయ సినీ పరిశ్రమ పోకడను పూర్తిగా మార్చేసిందని అన్నారు.


  అద్బుతమైన సినిమా...

  అద్బుతమైన సినిమా...

  శివ'లో నాగార్జునను పరుగెత్తించాడు, అలాంటిది 'క్షణక్షణం'లో నన్నేమో కూర్చేపెట్టేవాడు' అంటూ నవ్వుతూ చెబుతూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. వీడేంట్రా బాబు నాగార్జునను పరుగెత్తించాడు. నన్ను కూర్చోబెడుతున్నాడని అనుకునేవాడినని అన్నారు. ఎలా అయితేనేం ఒక డిఫరెంట్ జానర్ లో అద్భుతమైన సినిమాను తనకు ఇచ్చాడని ఆయన కితాబునిచ్చారు.


  అది నిజమా..నీకూ అలా అనిపించిందా

  అది నిజమా..నీకూ అలా అనిపించిందా

  సినిమా పూర్తైన తరువాత తన దగ్గరకు వచ్చి బయట అందరూ 'క్షణక్షణం' సినిమాలో శ్రీదేవికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి, వెంకీకి తక్కువ ప్రాముఖ్యతనిచ్చానని అంటున్నారని, 'అది నిజమా? నీకలా అనిపించిందా? అని అడిగాడని, అలా అడిగితే ఏం చెబుతాం?.
  ‘నాకు ఈ కథ నచ్చింది' అని తనతో చెప్పేవాణ్ని. ' అని వెంకీ అనగానే అంతా నవ్వేశారు.


  ఎన్ని ఫైట్స్ చేసినా

  ఎన్ని ఫైట్స్ చేసినా

  మేమంతా ‘శివ' గురించి మాట్లాడుకొనేవాళ్లం. మేం ఎన్ని ఫైట్లు చేసినా వర్కవుట్‌ అవ్వలేదు. ‘చైను పట్టుకొని నాగ్‌ క్రెడిట్‌ అంతా కొట్టేశాడు' అని చెప్పుకొనేవాళ్లము''అన్నారు వెంకటేష్.


  రాజమౌళి మాట్లాడుతూ..

  రాజమౌళి మాట్లాడుతూ..

  ‘‘వందలమంది దర్శకులకు స్ఫూర్తి వర్మగారు. అయితే మధ్య మధ్యలో ‘ఐస్‌ క్రీమ్‌', ‘అడవి' అంటూ ఏవేవో తీస్తుంటారు. చాలా ఏళ్ల తరవాత ఆయన ‘వంగవీటి' కోసం ప్రచారం చేస్తున్న విధానం చూస్తుంటే ఈ సినిమాని కచ్చితంగా ప్రేమించి తీశారన్న నమ్మకం కలుగుతోంది. ‘వంగవీటి'తో వర్మ మళ్లీ మన మధ్యకు వచ్చేశారనిపిస్తోంది''అన్నారు రాజమౌళి.


  అలా చెప్పించుకోవటం ఇష్టం లేక

  అలా చెప్పించుకోవటం ఇష్టం లేక

  రాజమౌళి మాట్లాడుతూ... సినీ పరిశ్రమ చెన్నయ్ లో ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లందరూ దర్శకుడుకి 'నమస్కారం సర్, గుడ్ మార్నింగ్ సర్' అని తప్పనిసరిగా చెప్పాలనే రూల్ ఉండేదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. అయితే అలా చెప్పించుకోవడం రాంగోపాల్ వర్మకు అస్సలు ఇష్టం ఉండదని తెలిసిందని, దీంతో హైదరాబాదు వచ్చాక ఆయనకు ఆ రెండు చెప్పకుండా విష్ చేసేందుకు చాలా ప్రాక్టీస్ చేశానని అన్నారు.


  యాక్సిడెంటల్

  యాక్సిడెంటల్

  రామూగారు చాలా కాలం తరువాత వంగవీటిని బాగా ప్రమోట్ చేస్తున్నారని రాజమౌళి తెలిపారు. 'రామూగారూ ఈ సినిమాలు ఎలా తీశారు?' అని అడిగితే 'విజయాలన్నీ యాక్సిడెంటల్ గా వచ్చాయని, ఫ్లాపులన్నీ ఇన్సిడెంటల్' అని అనేవారని, అది ఆయనలాగే అర్థం కాదని రాజమౌళి తెలిపారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.


  అలా ఉండాలనిపిస్తుంది

  అలా ఉండాలనిపిస్తుంది

  రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలు సమాజం మీద ఎంతో ప్రభావం చూపిస్తాయని తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో 'శివ టు వంగవీటి' వేడుకలో ఆయన మాట్లాడుతూ, వర్మ 'శివ' చూస్తే 'శివ'లా ఉండాలని, 'సత్య' చూస్తే 'సత్య'లా కావాలని, 'సర్కర్' చూస్తే 'సర్కార్' లా ఉండాలని అనిపిస్తుందని అన్నారు. ఆయన తన సినిమాలతో అంత ప్రభావం చూపుతారని ఆయన చెప్పారు.


  అలా చేస్తే ఒప్పుకోం..

  అలా చేస్తే ఒప్పుకోం..

  తాను వచ్చిన దగ్గర్నుంచి వేదికనెక్కినవారంతా 'వర్మ సినిమాలు తీయాలి తీయాలి' అంటున్నారని, ఆయన మానేస్తానని చెప్పారేమో తనకు తెలియదని, ఒకవేళ అలా అంటే కనుక ఎవరూ అంగీకరించరని అన్నారు. 'ఆయన ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీయాలి...మనమంతా వాటిని ఆదరిస్తూ ఉండాలి' అని ఆయన సూచించారు. 'వంగవీటి' సినిమా యూనిట్ కు శుభాకాంక్షలని, సినిమా అందర్నీ అలరించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.


  చౌదరి చెప్తూంటే విన్నాను

  చౌదరి చెప్తూంటే విన్నాను

  రాంగోపాల్ వర్మ మంచి దర్శకుడని సీనియర్ దర్శకుడు బి.గోపాల్ కితాబునిచ్చారు. వర్మను చూసి గర్విస్తున్నామని ఆయన చెప్పారు. 'శివ టు వంగవీటి' వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'చౌదరి చెబుతుంటే విన్నాను, సినిమాలు మానేస్తానన్నావట. అది సరికాదు' అంటూ హితవు పలికారు.


  మేమంతా సైకిల్ ఛైన్స్ తో దాడి చేస్తాం...

  మేమంతా సైకిల్ ఛైన్స్ తో దాడి చేస్తాం...

  'నీకు సినిమాలు తప్ప ఇంకేమీ తెలియదు... మరి సినిమాలు మానేసి ఏం చేస్తావు?' అని అడిగారు. 'నీ నిర్ణయం మార్చుకో... ఒకవేళ నువ్వు నీ నిర్ణయం మార్చుకోకుంటే నేను, చౌదరి, హరీష్ శంకర్, పూరీ, ఇతర శిష్యులతో కలిసి సైకిల్ చైన్లు పట్టుకుని వస్తాము... నువ్వే నిర్ణయించుకో... నీకు సైకిల్ ఛైన్లు కావాలా? లేక సినిమాలు తీయడం కావాలా?' అని ఆయన అనగానే... వర్మతో కలిసి రాజమౌళి, పూరీ, హరీష్ శంకర్ తదితరులంతా గట్టిగా నవ్వేశారు.


  గుణశేఖర్ మాట్లాడుతూ..

  గుణశేఖర్ మాట్లాడుతూ..

  ‘‘వంగవీటి తరవాతా వర్మ ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి. లేకపోతే.. ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తామ''న్నారు గుణశేఖర్‌.రాంగోపాల్ వర్మ ఎంతో మందికి స్పూర్తినిచ్చారని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెలిపాడు.


  అది రూమర్ అనుకుంటున్నా

  అది రూమర్ అనుకుంటున్నా

  'శివ టు వంగవీటి' వేడుకలో గుణశేఖర్ మాట్లాడుతూ, ఇన్స్ స్టిట్యూట్ లాంటి రాంగోపాల్ వర్మతో రెండడుగులు నడిచే అదృష్టం తనకు కలిగిందని అన్నాడు. ఆయన సినిమాలు చూస్తూ ఎన్నో నేర్చుకున్నామని, నేర్చుకుంటూనే ఉంటామని చెప్పాడు. అలాంటి వర్మ వంగవీటి తరువాత సినిమాలు తీయడం మానేస్తానని ప్రకటించాడని, అయితే అది వదంతి అని అనుకుంటున్నానని అన్నాడు. అలా కాకుండా ఆయన అలాంటి నిర్ణయమే కనుక తీసుకుంటే, ఆయన ఇంటి ముందు దర్శకులంతా కలసి ధర్నా చేస్తామని ప్రకటించాడు. 'శివ టు వంగవీటి' వరకు వర్మ జర్నీ ఆసక్తికరమని గుణశేఖర్ తెలిపాడు.


  ఎదిగిన వ్యక్తి

  ఎదిగిన వ్యక్తి

  ప్రతి ఒక్కరి జీవితానికి ఒక హీరో ఉంటారని, తన జీవితానికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హీరో అని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపాడు. 'శివ టు వంగవీటి' సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో సినిమాలను మించి ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాంగోపాల్ వర్మేనని అన్నాడు.


  ఏ డైలాగు చెప్పినా వర్మకే ..

  ఏ డైలాగు చెప్పినా వర్మకే ..

  తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలు చెప్పిన పాప్యులర్ డైలాగులన్నీ వర్మకే సూటవుతాయని ఆయన తెలిపారు. 'నాక్కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్కుంది' తీసుకున్నా, ' ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' తీసుకున్నా, 'ముంబైలో ఎలాగోలా బతికేయాలని రాలేదు, ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను' .. ఇలా ఏ డైలాగ్ చెప్పినా అది ఆయనకే చెందుతుందని అన్నారు హరీష్ శంకర్.


  ఆయనో స్టాంప్

  ఆయనో స్టాంప్

  రాంగోపాల్ వర్మ అంటే.. చలన చిత్ర చరిత్రలో శాశ్వతమైన ఒక స్టాంప్ అని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. ‘శివ టు వంగవీటి సెలబ్రేషన్స్' సందర్భంగా ఒక న్యూస్ ఛానెల్ లైవ్ లో ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పారు.


  ఏకంగా సినిమానే..

  ఏకంగా సినిమానే..

  ‘‘శివ' సినిమాకు నన్ను పిలిచి డైలాగ్స్ రాయమన్నప్పుడు.. వర్మ ఏమిటి, అప్పుడే డైరెక్టర్ కావడం ఏమిటని అనుకున్నాను. అయితే, ఆ సినిమా కథ ఎలా చెప్పాడంటే.. ఏకంగా సినిమానే చూపించేశాడు. ఒక వ్యక్తితో కలిసి ఇన్నేళ్లు ప్రయాణం చేయడం నిజంగా చాలా సంతోషం' అని భరణి అన్నారు.


  రీలాంచ్ ఇచ్చారు

  రీలాంచ్ ఇచ్చారు

  ప్రస్తుత తరుణంలో డ్రీమ్ లాంచే కష్టం అనుకుంటే... తనకు రాంగోపాల్ వర్మ డ్రీమ్ రీ లాంచ్ ఇచ్చారని 'హ్యాపీడేస్' ఫేమ్... 'వంగవీటి' సినిమాలో 'దేవినేని మురళి' పాత్రధారి ఛాగంటి వంశీ తెలిపాడు.


  ఆశ్చర్యపోతారు

  ఆశ్చర్యపోతారు

  హైదరాబాదులో నిర్వహించిన 'శివ టు వంగవీటి' వేడుకలో వంశీ మాట్లాడుతూ, సాధారణంగా అంతా అగ్నికి ఆజ్యం తోడవుతుందని అంటారని, దర్శకుడు రాంగోపాల్ వర్మ అగ్ని అయితే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఆజ్యమని అన్నాడు. వర్మకు కిరణ్ అన్ని విధాలుగా అండగా నిలిచాడని తెలిపాడు. తనకు వర్మ అద్భుతమైన అవకాశం ఇచ్చారని చెప్పాడు. 'వంగవీటి' సినిమా అద్భుతంగా వచ్చిందని, విడుదలైన తరువాత చూసి అంతా ఆశ్చర్యపోతారని వంశీ తెలిపాడు. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు.


  ఈ పోగ్రామ్ లో ...

  ఈ పోగ్రామ్ లో ...

  కార్యక్రమంలో బి.గోపాల్‌, బోయపాటి శ్రీను, రేవంత్‌రెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, రాజశేఖర్‌, ఎస్‌.గోపాల్‌రెడ్డి, పూరి జగన్నాథ్‌, సుధీర్‌బాబు, తనికెళ్ల భరణి, హరీష్‌ శంకర్‌, వైవీఎస్‌ చౌదరి, వంశీపైడిపల్లి, సి.కల్యాణ్‌, రాజశేఖర్‌, జీవిత, రామసత్యనారాయణలతో పాటు ‘వంగవీటి' చిత్ర యూనిట్ పాల్గొంది.


  English summary
  "I will make movies that are watchable, that make you proud of. It is my oath," Ram Gopal Varma declared this on the stage of 'Vangaveeti' function held on Dec 20 in Hyderabad. '
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more