»   »  కొత్త టాలెంట్: డాడీ, బాబాయ్ రూట్లో రామ్ చరణ్!

కొత్త టాలెంట్: డాడీ, బాబాయ్ రూట్లో రామ్ చరణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగులో, ఫైటింగుల్లో, డాన్సింగుల్లో తన టాలెంటు ఏమిటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. గుర్రపుస్వారీలో కూడా తన పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. తాజాగా రామ్ చరణ్ తేజ్ మరో విషయంలో కూడా తన టాలెంటు నిరూపించుకోబోతున్నాడు. ఆ సారి రామ్ చరణ్ పాటలు పాడటంపై దృష్టి సారించాడు.

ఇటీవల ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ....చిన్న తనంలో సంగీతం క్లాసులకు వెళ్లేవాడినని, అయితే అంత సీరియస్‌గా నేర్చుకోలేదని తెలిపారు. తిరుపతిలో జరిగిన ప్రజారాజ్యం పార్టీ ఆవిష్కరణ సభ ప్లే చేసిన 'ప్రజా రాజ్యం మాదే' అనే పాటలో గొంతు కలిపాను. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ పాడలేదు. రాబోయే నా సినిమాల్లో తప్పకుండా మళ్లీ పాట పాడుతా' అని చరణ్ వెల్లడించారు.

Ram Charan

చరణ్ తండ్రి చిరంజీవి కూడా తన సినిమాల్లో పలు పాటలు పాడిన సంగతి తెలిసిందే. మాస్టర్, మృగరాజు తదితర సినిమాల్లో చిరంజీవి పాడిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో పాటలతో అదగొడుతుండటం తెలిసిందే. ఇపుడు రామ్ చరణ్ కూడా వారి దారిలో ప్రయాణిస్తూ.....తన సింగింగ్ టాలెంట్ నిరూపించుకోవాలని ఆశ పడుతున్నాడు.

ఇక పోతే....రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా ఈ నెల 12న విడుదలైన బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్వకత్వం వహించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈచిత్రంలో శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లు. అల్లు అర్జున్, కాజల్ అతిథి పాత్రల్లో నటించారు.

English summary

 Speaking to the media Ram Charan said “I sang the ‘Praja Rajyam Meede’, which was unveiled at the inaugural meeting in Tirupati. Very soon, I shall be singing in one of my upcoming films,”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu