»   » నాకు కొత్తేంటి?: సన్నీ లియోన్ సూటిగా

నాకు కొత్తేంటి?: సన్నీ లియోన్ సూటిగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సన్నిలియోన్ ...నాకు కొత్తేంటి అని అడుగుతోందంటే వేరే అర్దం తీసుకోకండి...ఆమె చెప్పేది...నాకు కామెడీ చేయడం కొత్తేమీ కాదు అని. సాధారణంగా ..సన్నీ లియోన్ అంటే హాట్‌ హాట్‌ అందాలు గుర్తొస్తాయి కానీ ఈ సారి కామెడీ తో అదరకొడతా అంటోంది. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ స్ధానం ఏర్పాటు చేసుకుంటున్న ఈ భామ తాజాగా 'కుచ్‌ కుచ్‌ లోచాహై' అనే ఓ అడల్ట్‌ కామెడీ చిత్రంలో నటించింది. అందుకే తనూ ఓ మంచి కమెడియన్‌ అని మురిసిపోతోంది. ఈ చిత్రంలో తను కడుపుబ్బా నవ్విస్తానంటోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సన్నిలియోన్ మాట్లాడుతూ...''నేను అమెరికాలో ఉన్నపుడు ఓ కామెడి స్కిట్ లు చేసే గ్రూప్ లో సభ్యురాలిగా ఉండేదాన్ని. పలు హాస్యనాటికల్లోనూ నటించాను. అందుచేత హాస్యం పండించడం నాకు కష్టమనిపించలేదు. ఎలాగూ నాకు మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉందని అందరూ అంటుంటారు ''అని మురిసిపోతూ చెప్పింది.

ఇక ''కుచ్‌ కుచ్‌..' సన్నీలియోని సినిమానా?' అని అడిగితే ''లేదు...కుటుంబ కథా చిత్రం. సరదా సరదాగా సాగుతుంది'' అని చెప్పింది. ఈ నెల 8న 'కుచ్‌ కుచ్‌...' విడుదల కానుంది. ట్విస్ట్ ఏమిటంటే... ఈ సినిమాలో ద్వంద్వార్థ సంభాషణలు మితిమీరి ఉండటంతో ఏం చేయాలో తెలియక సెన్సార్‌ బోర్డువారు డైలామాలో పడ్డారట.

I've got a good sense of humour, says Sunny Leone

బాలీవుడ్ లో ఇప్పుడు సెక్సీ లేడీ స్టార్ సన్నిలియోన్ హవా నడుస్తోందని బాలీవుడ్ హీరోలు కూడా ఒప్పుకుంటున్నారు. ఈ హాట్ బ్యూటీ సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఏక్ పహెలీ లీలా సినిమా ట్రైలర్ తోనే ప్రేక్షకులల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకోగా.. లేటెస్ట్ గా అంతర్జాలంలో రిలీజైన సన్నీ నయా మూవీ కుచ్ కుచ్ లోచా హై టీజర్ కూడా సన్నీ ఫ్యాన్స్ ను ఫుల్లుగా ఎంటర్ టైన్ చేస్తోంది... కొద్ది రోజుల క్రితం రిలీజైన ఈ ట్రైలర్ చూసిన వారంతా... ఈ సినిమా ఓపెనింగ్స్ తోనే లాభాల బాట పట్టడం ఖాయమని అంటున్నారు.

కుచ్ కుచ్ లోచా హై ట్రైలర్ చూసిన వారికి.. ఈ సినిమా ఓ సెక్సీ ఎంటర్ టైనర్ అని ఈజీగా అర్థమవుతుంది. టీనేజ్ కుర్రాడికి తండ్రి అయిన ఓ వ్యక్తి.. సన్నీలియోన్ వంటి హాట్ బ్యూటీ మాయలో పడి.. ఎలాంటి వింత వేషాలు వేషాడన్నదే ఈ మూవీ స్టోరీ. ట్రైలర్ చూడగానే క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.... కానీ ఈ సినిమాలో సన్నీ లియోన్ హాట్ హాట్ అందాలు ఎలా ఉంటాయని భావించే వారికి మాత్రం ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది.

ఇందులో సన్నీ అందాల ఆరబోత పీక్ స్టేజ్ కు చేరుకుందని కొన్ని సీన్లు చెప్పకనే చెప్పాయి... అందుకేనేమో టీజర్ వచ్చిన రెండు రోజుల్లోనే మిలియన్ హిట్స్ ను దాటి స్టార్ హీరోల రేంజ్ లో దూసుకుపోతోంది.... సినిమాలో 45 ఏళ్ల వ్యక్తిని తనవైపు తిప్పుకున్న సన్నీ.. ఈ సినిమా ద్వారా ఆ ఏజ్ అంకుల్స్ అందరినీ అట్రాక్ట్ చేసి సినిమా ఘన విజయానికి దోహదపడుతుందేమో చూద్దాం.

క ప్రస్తుతం దక్షిణ, ఉత్తరాది భాషల్లో గ్లామరస్ రోల్స్ చేస్తున్న సన్నీ జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రూపొందింది. సన్నీ అంటే.. కేవలం నీలి చిత్రాల తార మాత్రమే కాదు.. ఆమె జీవితంలో అంతకు మించిన విషయాలు బోల్డన్ని ఉన్నాయట. వాటి సమాహారంతో ప్రముఖ దర్శకురాలు దీపా మెహతా సోదరుడు దిలీప్ మెహతా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ విషయాన్ని స్వయంగా సన్నీ భర్త డానియెల్ పేర్కొన్నారు.

సన్నీ జీవితంలోకి డానియెల్ రాకముందు.. అతనొచ్చిన తర్వాత సంఘటనల సమాహారంతో ఈ చిత్రం ఉంటుంది. సన్నీ, డానియెల్ పాల్గొనగా 18 నెలల పాటు చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం ఈ చిత్రం ఎడిటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది జరగనున్న 'సన్‌డాన్స్ ఫిలిం ఫెస్టివల్'లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇండో-కెనడియన్ శృంగారతార సన్నీ లియోన్..యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, అందాల భామ దీపికా పదుకోన్ లను వెనక్కునెట్టి సన్నీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. 2015 మొదటి మూడు నెలలో విడుదలైన బాలీవుడ్ చిత్రాలన్నింటి కంటే సన్నీ తాజా హిందీ చిత్రం 'ఏక్ పహేలి లీలా' ట్రైలర్ ను యూ ట్యూబ్ లో అత్యధికమంది వీక్షించారు.

రెండు నెలల క్రితం విడుదలైన 'ఏక్ పహేలి లీలా' ట్రైలర్ ను ఇప్పటి దాకా కోటిమందికిపైగా వీక్షించారు. గుల్షన్ దేవయ్య, రాధికా ఆప్టే నటించి 'హంటర్' రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రాధికా ఆప్టే చిత్రం 'బాంబే వెల్వెట్', అమితాబ్, ధనుష్ ల చిత్రం 'షమితాబ్' ట్రైలర్లు ఉన్నాయి.

English summary
"'Kuch Kuch Locha Hai' is my first comedy film. But something that people don't know is that when I lived in the US and used to work there, I was part of a comedy group. There were stand-up comedians in that group and in between we used to do comedy skits," Sunny said.
Please Wait while comments are loading...