»   »  పబ్లిక్ గా :సురేంద్ర రెడ్డిని ఏకేసిన రవితేజ

పబ్లిక్ గా :సురేంద్ర రెడ్డిని ఏకేసిన రవితేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ నా ప్రతి సినిమా విషయంలో నేను ఫైనల్ కాపీ చూసాక ఎలా ఉందనే దానిపై ఫైనల్ జడ్జ్ మెంట్ తీసుకుంటాను. కానీ ఈ సారి డైరెక్టర్ సురేందర్ రెడ్డికి వాల్యూ ఇచ్చి ఫైనల్ జడ్జ్ మెంట్ కి వదిలేసాను. కానీ నేను సినిమా లెంగ్త్ ఎక్కువైందని తనకి చెప్తూనే ఉన్నాను కానీ తనే వినలేదు. పర్ఫెక్ట్ గానే ఉందని అన్నాడు. ఫైనల్ గా రిలీజ్ అయ్యాక ఓ మంచి లెసన్ నేర్చుకున్నాడు. నేను కూడా కిక్ 2 పరంగా ఓ మంచి లెసన్ నేర్చుకున్నాను. నెక్స్ట్ కిక్ 3 ఉంటుంది కానీ ఆ సినిమా విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటానని' రవితేజ పబ్లిక్ గానే ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో కామెంట్స్ పాస్ చేసాడు.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ కిక్ 2 సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొంది మొన్న శుక్రవారం విడుదలైన చిత్రం ‘కిక్‌-2'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మించారు. ఈ చిత్రం సెకండాఫ్ బోర్ కొట్టిందని,ఎంటర్టైన్మెంట్ తక్కువైందని కంప్లైంట్ లు వచ్చాయి. దాంతో చిత్రం కు నెగిటివ్ టాక్ వచ్చేసింది.

దాంతో వెంటనే దర్శక,నిర్మాతలు రంగంలోకి దిగి సెకండాఫ్ ని ఇరవై నిముషాలు కట్ చేసి,ట్రిమ్ చేసి వదిలారు. అయినా ఈ సినిమాకు లాస్ లు తప్పేటట్లు లేవు. దాదాపు 10 కోట్లు లాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవటం మొదలయ్యాయి. సోమవారం,మంగళవారం, బుధవారం మూడు రోజులు పూర్తిగా కలెక్షన్స్ తగ్గిపోవటం మొదలైంది. మరో ప్రక్క మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం హౌస్ ఫుల్స్ తో దూసుకుపోతోంది.

I’ve learnt my lesson with Kick 2: Ravi Teja

సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ ''దర్శకుడిగా పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చిన చిత్రం 'కిక్‌ 2'. ఇదివరకు తీసిన 'కిక్‌'లో వినోదమే ఎక్కువ. ఈసారి వినోదంతోపాటు భావోద్వేగాలు ఉండాలనుకొన్నా. ఒక కథలో రెండింటినీ సమపాళ్లలో జోడించడం ఆషామాషీ కాదు. చాలా జాగ్రత్తలు తీసుకొని చిత్రాన్ని తీర్చిదిద్దా. విరామం తర్వాత వినోదం కాస్త తక్కువైందనే ఫిర్యాదులొచ్చాయి. దీంతో కొన్ని సన్నివేశాల్ని తొలగించాం'' అన్నారు.

అలాగే...''కొత్తగా ఏ ప్రయత్నం చేసినా సంతృప్తి లభిస్తుంది. తరచుగా ప్రేక్షకుల ముందుకొచ్చే చిత్రాలకి భిన్నంగా 'కిక్‌ 2' చేశా. మా ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. ఈ సినిమాకి 'రేసుగుర్రం' తరహాలో ప్రారంభవసూళ్లు లభించాయి''అన్నారు సురేందర్‌రెడ్డి.

'కిక్‌ 2' మొదలైన విధానం గురించి చెబుతూ ....

''రేసుగుర్రం' తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా చేయాలనుకొన్నా. ఇంతలో కల్యాణ్‌రామ్‌ఈ సినిమా చేద్దామన్నారు. భారీ హంగులతో కూడిన కథ కావడంతో బడ్జెట్‌ ఎక్కువే అవుతుందని ముందుగానే వూహించాం. కల్యాణ్‌రామ్‌ లేకపోతే 'కిక్‌ 2'నే లేదు. ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశాడు. సినిమాలో అడుగడుగునా నిర్మాణ విలువలు కనిపిస్తాయి. రవితేజ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది''అన్నారు.

ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
Ravi admits he erred in not listening to his own judgement. “I’ve always followed my gut feelings about my films. But this time, I listened to the director (Surender Reddy) because he’s a veteran and I thought we must value his opinion. I kept telling him the film was too long. But he wouldn’t listen.”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu